హార్ట్ఎటాక్తో ప్రముఖ సింగర్ మృతి
మెక్సికో: మెక్సికోకు చెందిన ప్రముఖ గాయకుడు, రచయిత జువాన్ గాబ్రియేల్(66) 'ది డివో' కన్నుమూశారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన చనిపోయారు. కాలిఫోర్నియాలోని సాంటా మోనికాలోగల ఆయన ఇంటి వద్దే గాబ్రియల్ కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించే లోపే తుదిశ్వాస విడిచారు. ఆయన దాదాపు 1,800 పాటలు రాశారు.
చాలా గీతాలను స్వయంగా ఆలపించారు. లాస్ ఎంజెల్స్ లో శనివారం రాత్రి ఓ కచేరి నిర్వహించిన గాబ్రియేల్ ఆ మరుసటి రోజే మృత్యువాత పడటం ఆయన అభిమానులను తీవ్రంగా బాధిస్తోంది. అంతకు ముందు మూడు రోజుల కిందటే బిల్ బోర్డ్ మేగిజిన్ గాబ్రియేల్ ను ప్రశంసల్లో ముంచెత్తింది. లాటిన్ మ్యూజిక్ ఆల్బమ్స్‌లో వరుసగా ఐదోసారి గాబ్రియేల్ ముందున్నాడని పేర్కొంది. ఆయన మృతిపట్ల మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీతో సంతాపం తెలియజేశారు. గాబ్రియేల్ తమ దేశంలోని ప్రఖ్యాత మ్యూజిక్ ఐకాన్ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.