క్రీడల్లో పోటీతత్వం ఉండాలి
క్రికెట్లో శిక్షణ కోసం హకీంపేట్ సమీపంలోని సింగాయిపల్లి పరిధిలో ‘జాన్స్ డి మార్క్’ అనే కొత్త క్రికెట్ అకాడమీ ఏర్పాటైంది. సోమవారం ఈ అకాడమీని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రారంభించారు. కొత్త గ్రౌండ్ ఇంగ్లండ్‌లోని మైదానాలను తలపిస్తోందని, ఇక్కడ శిక్షణ పొందే ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. - న్యూస్‌లైన్, శామీర్‌పేట్ రూరల్
శామీర్‌పేట్ రూరల్, న్యూస్‌లైన్: క్రికెట్లో శిక్షణ కోసం నగర శివార్లలో మరో అకాడమీ ఆటగాళ్లకు అందుబాటులోకి వచ్చింది. హకీంపేట్ సమీపంలోని సింగాయిపల్లి పరిధిలో ‘జాన్స్ డి మార్క్’ అనే కొత్త క్రికెట్ అకాడమీ ఏర్పాటైంది. సోమవారం ఈ అకాడమీని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, క్రీడల్లో పోటీ తత్వం ఉంటేనే ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. కొత్త గ్రౌండ్ ఇంగ్లండ్‌లోని మైదానాలను తలపిస్తోందని, ఇక్కడ శిక్షణ పొందే ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి కూడా పాల్గొన్నారు. నగర శివార్లలో ఇంత చక్కటి సౌకర్యాలతో మైదానం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. శామీర్‌పేట పరిధిలో మైదానం ఏర్పాటు చేయడం పట్ల స్థానిక శాసనసభ్యుడు కేఎల్ఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు క్రికెటర్లతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.