breaking news
jessi
-
కష్టమంతా మరచిపోయాం
అతుల్ కులకర్ణి, కబీర్ దుహన్ సింగ్, అర్చనా శాస్త్రి, ఆషిమా నర్వాల్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘జెస్సీ’. వి. అశ్వినికుమార్ దర్శకత్వంలో ఏకా ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్వేతాసింగ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలైంది. ఈ సందర్భంగా జరిగిన సక్సెస్‌మీట్‌లో పీవీఆర్ సినిమా ఉదయ్ మాట్లాడుతూ– ‘‘జెస్సీ’ సినిమాకు ఇంత పెద్ద రేంజ్లో కలెక్షన్స్ వస్తాయని ఊహించలేదు. మల్టీఫ్లెక్స్‌లో ఒక్క షోతో స్టార్ట్ అయి, 7 షోలతో రన్ అవుతుంటే... వన్ షోతో స్టార్ట్ అయిన సింగిల్ స్క్రీన్స్ 4 షోలతో రన్ అవుతున్నాయి. మొదటి మూడు రోజుల్లో ప్రతి రోజూ కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి’’ అన్నారు. ‘‘ఆడియన్స్ టాక్ విన్న తర్వాత మేం పడ్డ కష్టమంతా మరచిపోయాం. మాపై నమ్మకంతో పీవీఆర్ సినిమాస్ వారు సినిమాను విడుదల చేశారు. వారి నమ్మకం నిజమైంది’’ అన్నారు శ్వేతా సింగ్. ‘‘చిన్నగా విడుదలైన మా సినిమా హ్యూజ్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంది’’ అని వి. అశ్వినికుమార్ అన్నారు. -
మరోసారి జెస్సీ తరహా పాత్రలో త్రిష
నటి త్రిష సినీ జీవితంలో జెస్సీ పాత్ర మరువలేనిది.షిపుడు మళ్లీ అదే తరహా పాత్రలో మళయాళంలో మెరవనున్నారు. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో శింబుకు జంటగా విన్నైతాండి వరువాయా చిత్రంలో త్రిష నటించిన పాత్ర పేరు జెస్సీ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకుంటే ఆ చిత్రానికి ముందు, ఆ తరువాత అన్నంతగా త్రిష కెరీర్ మారిపోయిందని చెప్పవచ్చు. అప్పటివరకూ కమర్షియల్ నాయకిగా గ్లామర్ పాత్రలకు పరిమితమైన త్రిష జెస్సీ పాత్రలో తన అభినయంతో మంచి బలమైన పాత్రలను చేయగలనని నిరూపించుకున్నారు. మంచి యూత్‌ఫుల్ చిత్రంగా తెరకెక్కిన విన్నైతాండి వరువాయా చిత్రం విడుదల తరువాత చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు జెస్సీ అని పేరు పెట్టుకున్నారంటే ఆ పాత్ర ప్రభావం వారిపై ఎంతగా చూపిందో అర్ధం చేసుకోవచ్చు. చాలాకాలం తరువాత త్రిష మళ్లీ జెస్సీగా మారుతున్నారట. అయితే ఈ సారి తను మలయాళ చిత్రం ద్వారా అలాంటి పాత్రలో కనిపించనున్నారు. తమిళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో నటించిన ఈ చెన్నై చిన్నది ఇప్పుడు తొలిసారిగా మాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. అక్కడ ప్రముఖ దర్శకుడు శ్యామ్‌ప్రసాద్ దర్శకత్వంలో నవీన్ పౌలీకి జంటగా నటిస్తున్నారు. ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హేజూడే అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో త్రిష జెస్సీ తరహా పాత్రలో మరోసారి క్రిస్టియన్ అమ్మాయిగా నటిస్తున్నారట. ఈ చిత్రం తన కేరీర్‌ను మరో మలుపు తిప్పుతుందనే ఆశాభావంతో ఉన్నారామె. కాగా, ప్రస్తుతం త్రిష తమిళంలో నటించిన చతురంగవేట్టై-2 చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. అదేవిధంగా గర్జన, మోహిని, 96 అంటూ చేతి నిండా చిత్రాలతో యమ బిజీగా ఉన్నారు.