breaking news
jashua
-
గన్నవరంలో 144 సెక్షన్.. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు:ఎస్పీ జాషువా
సాక్షి, కృష్ణా: గన్నవరం నియోజకవర్గ పరిధిలో సోమవారం టీడీపీ, వైఎస్సార్సీపీ శ్రేణులు మధ్య ఘర్షణలు జరిగిన నేపథ్యంలో ఇవాళ టీడీపీ తలపెట్టిన చలో గన్నవరం కార్యక్రమానికి అనుమతి లేదని కృష్ణా జిల్లా ఎస్పీ జూషువా తెలిపారు. టీడీపీ నాయకుడు పట్టాభి.. విధులు నిర్వహిస్తున్న పోలీసుల మీద దాడికి పురి గొల్పడం, బాధ్యతా రహితంగా వ్యాఖ్యలు చేయడం వల్ల శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైందని చెప్పారు. ఈ ఘటనలో గన్నవరం సీఐ కనకారావు తలకు బలమైన గాయమైందని పేర్కొన్నారు. 'పట్టాభి తొందరపాటు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ఫుటేజీలు పరిశీలిస్తున్నాం. సుమోటోగా రియటింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చట్టాన్ని అతిక్రమించిన వారు ఎవరైనా చట్టరీత్యా చర్యలు తప్పవు. గన్నవరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 CRPC, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ముందస్తు అనుమతి లేకుండా ఏ విధమైన సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదు. గన్నవరం పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ ప్రవేశించకుండా చెక్ పోస్టులు, పికెట్స్ ఏర్పాటు చేశాం. చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా ప్రవేశించాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.' అని ఎస్పీ జాషువా ప్రకటనలో పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ లో ప్రజలు, రాజకీయ పార్టీ శ్రేణులు సహకరించాలని కోరారు. చదవండి: గన్నవరం రణరంగం.. ఎమ్మెల్యే వంశీపై అసభ్య పదజాలంతో విరుచుకుపడిన టీడీపీ నేతలు -
మహాకవి జాషువా చిరంజీవి
స్మరణ అన్ని రాకపోకలు ఆగిపోయినప్పటికీ, వందకుపైగా జాషువా పాటలు పాడే బృందాలు వచ్చాయి. సత్యహరిశ్చంద్ర నాటకంలో ‘ఇచ్చోటనే...’ వంటి కాటిసీను పద్యాలు అన్ని వందలమంది పాడుతుంటే ఆశ్చర్యపోవడం మా వంతయింది. జాషువా ఒక యుగకవి. జాతీయోద్యమ కాలంలో అనేక వైవిధ్యపూరితమైన వస్తువులను తీసుకుని పద్యాల్లో రాసి మెప్పించిన కవి. శ్రీశ్రీ మొదలుకొని కరుణశ్రీ దాకా ఎందరో వీరి వస్తువును, శైలిని స్వీకరించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. వేమనవలె పద్యాలను తేట తెలుగులో రాసిన జాషువా తన ఆత్మకథను కూడా ‘నా కథ’ పేరుతో పద్యాల్లోనే రాశారు. శాసనమండలి సభ్యులుగా గౌరవించబడ్డారు. జాషువా గబ్బిలం కావ్యాన్ని ప్రభుత్వ పూర్వ చీఫ్ సెక్రటరీ కాకి మాధవరావు ఇంగ్లీషులోకి అనువదించారు. సాహిత్య చరిత్రలో అనేక మార్పులు చేర్పులు ఎప్పటికప్పుడు జరుగుతున్నాయి. శ్రీశ్రీ, విశ్వనాథల మధ్య చర్చ జరిపి జాషువాను దశాబ్దాల తరబడి వదిలివేశారు. దళిత ఉద్యమంతోపాటు ‘దరకమే’ ఐక్యవేదిక ఈ సాహిత్య చరిత్రలో జాషువాను మళ్లీ ముందుకు తీసుకువచ్చింది. ఆ క్రమంలో ‘గబ్బిలం’ పేరుతో మేము దళిత రచయితల, కళాకారుల, మేధావుల ఐక్యవేదిక తరఫున మాసపత్రిక వెలువరించాము. అలా రాష్ట్రవ్యాప్తంగా జాషువాను ప్రచారం చేసిన తరువాతే వామపక్ష, స్త్రీవాద, అభ్యుదయవాద తదితర బృందాలు గుర్తించి ఏటా జాషువా జయంతి, వర్ధంతులను నిర్వహిస్తున్నాయి. 1993లో గుంటూరు జిల్లా వినుకొండలో మాన్యశ్రీ కాన్షీరామ్ నిర్వహణలో జాషువా మేళా జరిగింది. ఎండ్లూరు సుధాకర్, నేను, నారగోని, మాష్టార్జీ మొదలైనవారు దాన్ని నిర్వహించడం జరిగింది. ఆగస్టులో నిర్వహించిన ఆ మేళాకు ఒకటి రెండు రోజుల ముందు భారీ వర్షాలలో ఎక్కడి రోడ్లు అక్కడ తెగిపోయాయి. అన్ని రాకపోకలు ఆగిపోయినప్పటికీ, వందకుపైగా జాషువా పాటలు పాడే బృందాలు వచ్చాయి. సత్యహరిశ్చంద్ర నాటకంలో ‘ఇచ్చోటనే...’ వంటి కాటిసీను పద్యాలు అన్ని వందలమంది పాడుతుంటే ఆశ్చర్యపోవడం మా వంతయింది. ‘రాజు మరణించె ఒక తార రాలిపోయె, కవియు మరణించె ఒక తార గగనమెక్కె, రాజు నివసించు రాతి విగ్రహముల యందు, కవి నివసించె ప్రజల నాలుకయందు’ అని కవిని గురించి గొప్పగా వర్ణించిన సుకవి జాషువా. ‘వృద్ధవీరుడ, నీవయసెంత చెపుమ, తండ్రి మరణించియే నాల్గు తరములయ్యె...’ అంటూ భారతంలోని భీష్ముణ్ణి ఆయన ప్రశ్నించిన తీరు సాటిలేనిది. భవభూతి ‘ఉత్తర రామచరిత’, కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఒరవడిలో ఆధునిక తెలుగు సాహిత్యంలో ‘గబ్బిలం’, ‘ఫిరదౌసి’, ‘క్రీస్తు చరిత్ర’ వంటి కావ్యాలలోని జాషువా కరుణరస శిల్పం గుండెను కదిలిస్తుంది. ఒక్కొక పద్దియంబునకు ఒక్కొక నెత్తురుబొట్టు ప్రకారం పద్యవిద్యను పండించిన జాషువా తెలుగు సాహిత్యం ఉన్నంతవరకు చిరంజీవి. బి.ఎస్.రాములు, ఫోన్: 8331966987.