breaking news
janhit congress
-
తిరుమల శ్రీవారి సేవలో జాన్వీ కపూర్, సిద్ధార్థ్ కపూర్.. ఫోటోలు
-
దోస్తీనా..కుస్తీనా?
చండీగఢ్:హర్యానా రాష్ట్రంలో బీజేపీ, జన్ హిత్ కాంగ్రెస్ ల పొత్తు వ్యవహారం కాస్తా మళ్లీ మెదటికొచ్చింది. బీజేపీ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) హర్యానాలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్(ఐఎన్ఎల్డీ)తో పొత్తు కుదుర్చుకుంది. దీంతో బీజేపీ పరిస్థితి అక్కడి కుడిలో పడ్డ ఎలుకలా మారింది. ఏమీ చేయలేని పరిస్థితిలో జన్ హిత్ కాంగ్రెస్ తో పొత్తుకు యాత్నాలు ఆరంభించింది. ఈ పొత్తు అంశం తొలుత సానుకూలంగా కనిపించినా.. ప్రస్తుతం మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీనికి శనివారం ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ మండలి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటనే. త్వరలో వివిధ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. పార్టీ గెలుపుకు హర్యానాతో సహా మిగతా రాష్ట్రాల్లో పార్టీ కేడర్ సిద్ధంగా ఉండాలని పిలుపునివ్వడం కాస్తా జన్ హిత్ కాంగ్రెస్ ను డైలామాలో పడేసింది. దీనిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కుల్దీప్ బిషన్ తాజాగా మీడియా ముందుకొచ్చారు. ఇరు పార్టీల పొత్తు అంశానికి సంబంధించి బీజేపీ వైఖరి ఏమిటో తెలియజేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ తీరు సమంజసంగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా బీజేపీ దీనిపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని సూచించారు. 'మా పార్టీ నేతలు బీజేపీ పెద్దలతో సమావేశమైయ్యారు. మేము వారికి శనివారం వరకూ సమయం ఇచ్చాం. అయితే వారు నుంచి మాత్రం స్పందన సరిగా లేదు.ఎవరు ఎన్ని సీట్లపై పోటీ చేయాలనే దానిపై కూడా స్పష్టత రాలేదు. ఇప్పటికైనా బీజేపీ తన అభిప్రాయాన్ని తెలపాలి 'అని బిషన్ విలేకర్ల సమావేశంలో తెలిపారు.తాము పొత్తుపై బీజేపీ చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.ఒకవేళ వీరిద్దరి మద్య పొత్తు ఏర్పడితే మాత్రం పంజాబ్లో మూడు దశాబ్దాలకుపైగా జట్టుగా మెలుగుతూ 2007 నుంచి కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)లు పక్క రాష్ట్రం హర్యానాలో మాత్రం వైరి పక్షాలుగా మారతాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంలోనూ అకాలీదళ్ భాగస్వామిగా ఉన్నప్పటికీ ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హర్యానాలో మాత్రం బీజేపీని కాదని ఆ పార్టీ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ)తో పొత్తు ఏర్పాట్లుకు యత్నించడమే ఇందుకు కారణమైంది. అయితే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో హర్యానాలోని 10 ఎంపీ సీట్లకుగానూ 8 చోట్ల పోటీ చేసి గెలిచిన బీజేపీ అదే జోరును అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగిద్దామనుకుంటోంది. మొత్తం 90 సీట్లున్న హర్యానాలో గురుద్వారాల యాజమాయిషీ విషయంలో పంజాబ్ సర్కారు తీరుపై తలెత్తిన వివాదం, జరిగిన హింస ఆ పార్టీకి ప్రతికూలంగా పరిణమించే అవకాశం కనిపిస్తోంది. అంతకుముందు జరిగిన సాధారణ ఎన్నికల్లో హర్యానా జన్హిత్ కాంగ్రెస్ను మిగిలిన రెండు సీట్లలో ఐఎన్ఎల్డీ ఓడించడంలో తాము చేపట్టిన ప్రచారం దోహదపడటంతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై అకాలీదళ్ ఆశలు పెట్టుకుంది.