breaking news
jadcherla constituency
-
2023 జడ్చర్ల ఎలక్షన్స్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వీళ్ళే
ఉదయం 9గం వరకు జరిగిన పోలింగ్ శాతం: 12% నియోజకవర్గం: జడ్చర్ల జిల్లా: మహబూబ్ నగర్ లోక్‌సభ పరిధి: మహబూబ్ నగర్ రాష్ట్రం: తెలంగాణ మొత్తం ఓటర్ల సంఖ్య: 212,655 పురుషులు: 106,922 మహిళలు : 105,469 ఈ నియోజకవర్గం పరిధిలో నాలుగు మండలాలు ఉన్నాయి: 1. జడ్చర్ల 2. నవాబుపేట 3. బాలానగర్ 4. మిడ్జిల్ 2023లో పోటీ చేస్తున్న అభ్యర్థులు: 1. చిత్తరంజన్ దాస్ - BJP 2. జె.అనిరుధ్ రెడ్డి - INC 3. చర్లకోల లక్ష్మ ర్‌రెడ్డి - BRS నియోజకవర్గం ముఖచిత్రం: ఈ నియోజకర్గం మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంది. 2007లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జడ్చర్ల నియోజకవర్గం 4 మండలాలుగా విభజింపబడినది. పునర్వవస్థీకరణ ఫలితంగా షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న బాలానగర్, నవాబ్‌పేట మండలాలు జడ్చర్ల నియోజకవర్గంలోకి, జడ్చర్లలో ఉన్న తిమ్మాజీపేట మండలం నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి మార్చబడినది. జడ్చర్ల నియోజకవర్గానికి ఇప్పటివరకు రెండు ఉప ఎన్నికలతో సహా 14 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, కాంగ్రెస్(ఐ)లు కలిసి నాలుగు సార్లు, తెలుగుదేశం పార్టీ ఆరుసార్లు టీఆర్ఎస్ రెండుసార్లు గెలుపొందాయి. ఇక్కడి నుంచి ఇండిపెండెంట్లు కూడా రెండుసార్లు ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి అత్యధికంగా మూడుసార్లు ఎం. చంద్రశేఖర్ టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన మల్లు రవి కొంతకాలం ప్రభుత్వ విప్ పదవి నిర్వహించారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన లక్ష్మారెడ్డికి తెలంగాణ తొలి మంత్రివర్గంలో స్థానం లభించింది. ఈ నియోజకవర్గం మహబూబ్‌నగర్ లోక్‌సభ పరిధిలోకి వస్తుంది. 2023లో జరగబోయే ఎన్నికలలో జడ్చర్ల నియోజకవర్గంలో ప్రధానంగా కాంగ్రెస్, బి.ఆర్.ఎస్‌ల మధ్యే పోటీ జరగనున్నది. ఇక్కడ బి.జే.పి నామమాత్రంగానే పోటీలో ఉంది. 2018లో మంత్రి పదవిలో ఉంటూ టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన డాక్టర్ సి.లక్ష్మారెడ్డి మూడోసారి విజయం సాదించారు. కాని 2018లో గెలిచిన తర్వాత ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడం విశేషం. లక్ష్మారెడ్డి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది, మాజీ ఎమ్.పి డాక్టర్ మల్లు రవిపై 45082 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. లక్ష్మారెడ్డి ఇంతకుముందు రెండుసార్లు ఇక్కడ నుంచే గెలుపొందారు. లక్ష్మారెడ్డికి 94598 ఓట్లు రాగా, మల్లు రవికి 49516 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన మదుసూదన్ యాదవ్‌కు 3600 ఓట్లు మాత్రమే వచ్చాయి. సి. లక్ష్మారెడ్డి రెండువేల నాలుగులో టిఆర్ఎస్ పక్షాన గెలిచినా, ఆ తర్వాత పదవికి రాజీనామా చేసి 2008 ఉప ఎన్నికలో పోటీచేసి ఓటమి పాలయ్యారు. రెండువేల పద్నాలుగులో లక్ష్మారెడ్డి తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ ఐ పార్టీ సీనియర్ నేత డాక్టర్ మల్లు రవిపై 14734 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. టిడిపి-బిజెపి కూటమి పక్షాన పోటీచేసిన సిటింగ్ ఎమ్మెల్యే ఎమ్.చంద్రశేఖర్‌కు 11465 ఓట్లు మాత్రమే వచ్చి ఓటమి పాలయ్యారు. మల్లు రవి 2008లో జరిగిన ఉపఎన్నికలో గెలిచి కొంతకాలం విప్ పదవిని నిర్వహించారు. అంతకు ముందు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అదికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. నాగర్ కర్నూల్ ఎమ్.పిగా కూడా రెండుసార్లు ఎన్నికయ్యారు. అంతకు ముందు ఆయన సోదరుడు మల్లు అనంతరాములు కూడా నాగర్‌కర్నూల్ నుంచి ఎమ్.పిగా గెలుపొందారు. అనంత రాములు పీసీసీ అధ్యకక్షుడిగా కూడా పనిచేశారు. మల్లురవి మరో సోదరుడు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా మధిర నుంచి 2009, 2014, 2018లలో గెలుపొందారు. ఛీఫ్ విప్, ఉప సభాపతి పదవులను నిర్వహించారు. రవికి మాజీ ఉప ముఖ్యమంత్రి, దివంగత నేత కోనేరు రంగారావు మామ అవుతారు. జడ్చర్లలో కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి నాలుగుసార్లు, తెలుగుదేశం పార్టీ ఆరుసార్లు, టిఆర్ఎస్ మూడుసార్లు గెలిచాయి. ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా గెలిచారు. 1994లో ఇక్కడ గెలిచిన ఎమ్. సత్యనారాయణ హత్యకు గురి అయ్యారు. ఆ తర్వాత 1996లో జరిగిన ఉప ఎన్నికలోను, 1999లోను, తిరిగి 2009లోను సత్యనారాయణ సోదరుడు ఎమ్. చంద్రశేఖర్ గెలుపొందారు. ఇక్కడ నుంచి కాంగ్రెస్ నేత ఎన్.నరసప్ప, టిడిపి నేత కృష్ణారెడ్డి రెండేసి సార్లు గెలిచారు. జడ్చర్లలో ఏడుసార్లు రెడ్డి నేతలు, ఏడుసార్లు బిసి నేతలు (ప్రధానంగా ముదిరాజ్ వర్గం) గెలుపొందారు. ఇది జనరల్ సీటు అయినా ఉప ఎన్నికలో ఎస్.సి.నేత అయిన మల్లురవి పోటీచేసి గెలిచారు.మూడుసార్లు ఇతరులు గెలిచారు. -
కేసీఆర్ వెంటే జనం..మంత్రి శ్రీనివాస్ గౌడ్
-
అధికారంలోకి వచ్చాక విచారణ చేయిస్తాం: మల్లు
మహబూబ్‌నగర్ : కేసీఆర్ ప్రభుత్వ అక్రమాల పై తాము అధికారంలోకి వచ్చాక విచారణ చేయిస్తామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై జడ్బర్లలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్, రైతుకు నీళ్లు ఇచ్చింది ముమ్మాటికీ కాంగ్రెస్సేనన్నారు. కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లేవు, ఇందిరమ్మ ఇండ్ల బిల్లు రావన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పై జనం గర్జిస్తున్నారని, ప్రజల ఆశలను కేసీఆర్ నీరుగార్చారని మండిపడ్డారు. ప్రభుత్వం మహిళలు, యువత, రైతుల ఆత్మగౌరవాన్ని కించపరుస్తుందని వ్యాఖ్యానించారు. ప్రశ్నిస్తే పోలీసులు లాఠీలకు పనిచెబుతున్నారని ,బేడీలు వేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఆదివాసులపై అక్రమ కేసులు పెట్టి, వారి భూములను లాక్కుంటుందని తెలిపారు. రాహుల్ రాకతో దేశంలో కొత్త శకం ప్రారంభ మైందని.. గుజరాత్ ఫలితాలే దీనికి నిదర్శనమన్నారు. -
రెండు సార్లు ఓకే మూడోసారి డౌటే
జడ్చర్ల, న్యూస్‌లైన్:1962లో జడ్చర్ల నియోజకవర్గం ఏర్పడిన నాటినుంచి ఇప్పటివరకు ఐదుసార్లు బీసీ, ఐదుసార్లు రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులు ఎమ్మెల్యేగా ఇక్కడి ప్రజలు పట్టం కట్టారు. ఎనిమిది మండలాల పరిధిలోని గ్రామాలతో అటుఇటుగా ఉన్న ఈ నియోజకవర్గం పాలనాపరంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. చివరికి 2009లో జరిగిన పునర్విభజనలో జడ్చర్ల, బాలానగర్, మిడ్జిల్, నవాబ్‌పేట మండలాలతో ఓ రూపు దాల్చింది. నియోజకవర్గంలో దాదాపు 2.50లక్షల జనాభా ఉండగా, 1.89లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో సుమారు 37,636 మంది ఓటర్లు బీసీ సామాజికవర్గానికి చెందిన ముదిరాజ్‌లు జనాభాలో మొదటిస్థానంలో ఉన్నారు. వీరి తరువాత 29,818 మంది ఎస్సీ సామాజికవర్గం రెండోస్థానంలో ఉంది. వీరి తరువాత యాదవ కులస్తులు 24,847మంది, ఎస్టీలకు సంబంధించి లంబాడ సామాజికవర్గానికి చెందిన 24,061 మంది ఓటర్లు ఉన్నారు. 1972,78లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ సామాజికవర్గానికి చెందిన నర్సప్ప రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 1994లో టీడీపీ అభ్యర్థి ఎర్ర సత్యనారాయణ(ఎర్ర సత్యం)ను గెలిపించారు. ఆయన మరణాంతరం సోదరుడు ఎర్ర శేఖర్‌ను రెండుసార్లు ఎమ్మెల్యేగా ఆదరించారు. 1967లో భూత్పూర్ మండలం పోల్కంపల్లికి చెందిన లక్ష్మినర్సింహారెడ్డిని ఎమ్మెల్యేగా ఆదరించారు. అనంతరం జడ్చర్ల మండలం నాగసాల గ్రామానికి చెందిన ఎం.కృష్ణారెడ్డి ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా మరోసారి టీడీపీ నుంచి విజయం సాధించారు. వీరి తరువాత తాడూరు మండలం సిరసవాడ గ్రామానికి చెందిన సుధాకర్‌రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామానికి చెందిన సి.లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008లో జరిగిన ఉప ఎన్నికలో ఖమ్మం జిల్లాకు చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మల్లు రవి ఒక సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.