‘పట్టు’ కోల్పోతున్న రైతులు
పలమనేరు: పలమనేరు మండలం నూనేవారి పల్లెకు చెందిన చెంగన్నగౌడు కుటుం బం పట్టు పురుగుల పెంపకంపై ఆధారపడి జీవిస్తోంది. ఎకరా విస్తీర్ణంలో మ ల్బరీ సాగు చేస్తున్నారు. బోరులో నీటి మట్టం తగ్గడంతో అతికష్టం మీద పం టకు అందిస్తున్నారు. ఈ పరిస్థితిలో ఏ డాదిగా పట్టుగూళ్ల ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దానికితోడు పంటల దిగుబడి కూడా తగ్గుతోంది. ప్రస్తుతం ఆ రైతు వందమట్టి మేపగా 45 కిలోల గూళ్లొచ్చాయి. వీటిని మార్కెట్కు తీసుకొస్తే రూ.10వేలు వచ్చింది.
ఇందులో ఖర్చు రూ.ఏడు వేలు పోతే నెల కష్టం మూడు వేలు మాత్రమే మిగిలింది. ఇదే మండలంలోని కన్నమాకులపల్లెకు చెం దిన శివ కూడా మార్కెట్కు గూళ్లను తీసుకొచ్చాడు. ధరలు తగ్గుముఖం పట్టడంతో ఏ మాత్రమూ గిట్టుబాటు కావ డం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏ పట్టు రైతును కదిలించినా ఇలాంటి కథలే వినిపిస్తాయి.
ఉత్పత్తులు తగ్గుతున్నాయి..
పలమనేరు మార్కెట్కు సంబంధించి 2011-12 సంవత్సరంలో 360 టన్నుల పట్టుగూళ్లు ఉత్పత్తి కాగా, 2013కు 207 టన్నులు, ప్రస్తుతం 200 టన్నులకు పడిపోయింది. ఇదే పరిస్థితి ఇతర మార్కెట్లోనూ ఉంది. కర్ణాటకలోని రాంనగర్ లో రోజుకు 30 టన్నుల పట్టుగూళ్లు వ చ్చేవి. అలాంటిది ఏడు టన్నులు కూడా రావడం లేదు. అక్కడా అదే పరిస్థితి.
ధరలు తగ్గడానికి కారణాలివే..
ధరలు తగ్గడానికి కారణం సిల్క్ వీవింగ్ వ్యాపారులు ముందుకు రాకపోవడమే. దీపావళి సందర్భంగా దేశంలోని సేట్లు వ్యాపార లావాదేవీలను నిలుపుదల చేశారు. ఆషాఢ మాసంతో పెళ్లిళ్ల సీజన్ లేక స్థానిక మార్కెట్లో పట్టుకు డిమాం డ్ తగ్గింది. ఇదే సమయంలో వాతావరణ మార్పుల కారణంగా పంట కూడా దెబ్బతినడంతో రైతులకు తీరని నష్టం వాటిల్లింది.
తగ్గుతున్న మల్బరీ సాగు విస్తీర్ణం, పంట దిగుబడి..
జిల్లాకు సంబంధించి 26,400 మంది రైతులు 27 వేల ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నారు. ఇందులో కుప్పం డివి జన్లో 10 వేల ఎకరాలు, పలమనేరు డివిజన్లో 9,500 ఎకరాలు సాగవుతోంది. ఎక్కువ మంది రైతులు ఈ ప్రాంతాల్లోనే పట్టుగూళ్లను ఉత్పత్తి చేస్తున్నారు. భూగర్భజలాలు అడుగంటి 40 శాతం మంది రైతులు పంటను సాగు చేయలేదు. మిగిలిన వాళ్లు కొద్దోగొప్పో సాగుచేసినా వాతావరణ పరిస్థితుల కా రణంగా పంట దిగుబడి తగ్గింది. మా మూలుగా దిగుబడి తగ్గినపుడు ధర పె రగాల్సింది పోయి తగ్గుముఖం పట్టడం రైతులను ఆందోళనపరుస్తోంది.