breaking news
Industrial Development Bank
-
చిన్న ఎన్‌బీఎఫ్‌సీలకు సిడ్బీ సాయం
ముంబై: చిన్న ఎన్‌బీఎఫ్‌సీల వృద్ధిని వేగవంతం చేసేందుకు చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (సిడ్బీ) ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. తద్వారా బ్యాంక్‌ల నుంచి నిధుల పొందే అర్హతను వాటికి కలి్పంచనుంది. ఈ కార్యక్రమంలో తొలుత 18 చిన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలను (ఎన్బీఎఫ్సీలు) చేర్చింది. చిన్న ఎన్బీఎఫ్సీలు మరింత విస్తరించేందుకు వీలుగా, వాటి అర్హతలను పెంచేందుకు ఐదు నెలల కార్యక్రమాన్ని రూపొందించినట్టు సిడ్బీ చైర్మన్, ఎండీ శివసుబ్రమణియన్ రామన్ తెలిపారు. రిస్క్, కార్యకలాపాలు, పరిపాలన, టెక్నాలజీ తదితర అంశాల్లో నిపుణుల మార్గదర్శకత్వాన్ని వాటికి అందించనున్నట్టు చెప్పారు. దేశంలో 8 కోట్ల చిన్న వ్యాపార సంస్థలు ఉంటే, కేవలం 15 శాతం వాటికే సంఘటిత మార్కెట్ (ఇనిస్టిట్యూషన్స్) నుంచి రుణ సాయం అందుతున్నట్టు రామన్ తెలిపారు. దీంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) రుణ వితరణ విభాగంలో భారీ అవకాశాలున్నట్టు చెప్పారు. గడిచిన మూడేళ్లలో ఎంఎస్ఎంఈలకు సిడ్బీ రుణ వితరణ రూ.50,000 కోట్ల మార్క్‌ను అధిగమించినట్టు తెలిపారు. వ్యవస్థ మొత్తం మీద ఎంఎస్ఎంఈలకు సంబంధించి రూ.25 లక్షల కోట్ల రుణ పుస్తకం ఉండగా, వచ్చే రెండేళ్లలో రెట్టింపు అవుతుందన్నారు. ఇప్పుడున్న ఎంఎస్ఎంఈ రుణాల్లో కేవలం 28 శాతమే ఎన్బీఎఫ్సీలు సమకూర్చినవిగా తెలిపారు. తాము చేపట్టిన కార్యక్రమంలో భాగంగా.. ఎంఎస్ఎంఈలు ప్రధాన లక్ష్యంగా పనిచేసే ఎన్‌బీఎఫ్‌సీలకు సంఘటిత మార్కెట్ నుంచి నిధులు పొందే అర్హతను కలి్పంచడం ప్రధాన లక్ష్యమని రామన్ చెప్పారు. -
చిన్న సంస్థల కోసం రెండు ఫండ్స్
రూ. 12,000 కోట్లతో ఏర్పాటు - ఆవిష్కరించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ముంబై: చిన్న సంస్థలకు తోడ్పాటు అందించే దిశగా చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (సిడ్బి) ఆధ్వర్యంలో రెండు ఫండ్స్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం ఆవిష్కరించారు. వీటి మొత్తం మూలనిధి రూ. 12,000 కోట్లు ఉంటుంది. ఇందులో భారత ఆకాంక్ష నిధి (ఐఏఎఫ్- ఫండ్ ఆఫ్ ఫండ్స్) కింద రూ. 2,000 కోట్లు, సిడ్బి మేక్ ఇన్ ఇండియా లోన్ ఫర్ ఎంటర్ప్రైజెస్ (స్మైల్) స్కీము కింద రూ. 10,000 కోట్లు ఉంటాయి. వేల కోట్ల ఈక్విటీ పెట్టుబడులు స్టార్టప్స్, చిన్న..మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) కోసం సమీకరించే విధంగా ఐఏఎఫ్ ఉంటుందని జైట్లీ తెలిపారు. దీనికి బీమా దిగ్గజం ఎల్ఐసీ భాగస్వామిగా ఉండనుందని వివరించారు. మరోవైపు, ఎంఎస్ఎంఈలు వృద్ధి చెందేందుకు తోడ్పాటు అందించేలా.. తక్కువ వడ్డీ రేటుపై టర్మ్ లోన్లు మొదలైనవి అందించడం స్మైల్ పథకం ప్రధానోద్దేశమని పేర్కొన్నారు. కాగా దాదాపు 2 లక్షల మందికి ఉపాధి కల్పించే 13,000 సంస్థలు స్మైల్‌తో ప్రయోజనం పొందగలవని సిడ్బీ తెలిపింది. ఎస్సీ, ఎస్టీలు, అంగవైకల్యం గలవారు, మహిళల నిర్వహించే సంస్థలకు ప్రత్యేక రాయితీలు ఈ పథకం కింద ఉంటాయని సిడ్బి సీఎండీ క్షత్రపతి శివాజి చెప్పారు. స్టార్టప్ లిస్టింగ్ సులభతరం..: సెబీ చీఫ్ స్టార్టప్ సంస్థలు సులభతరంగా లిస్టింగ్ అయ్యేందుకు కొత్త నిబంధనలు తోడ్పడగలవని సెబీ చైర్మన్ యూకే సిన్హా తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో టెక్నాలజీ స్టార్టప్‌ల సంఖ్య 3,000 పైగా ఉందని, ఏటా 800-1,000 కొత్తవి పుట్టుకొస్తున్నాయని సిన్హా పేర్కొన్నారు. ఇదే తీరు కొనసాగితే 2020 నాటికి స్టార్టప్‌ల సంఖ్య 10,000 మార్కును దాటేయగలదని చెప్పారు. ఇదిలాఉండగా, ప్రస్తుతం స్టార్టప్ సంస్థల్లోకి వచ్చే విదేశీ వెంచర్ క్యాపిటల్ నిధుల్లో సింహభాగం.. ఈ-కామర్స్ రంగంలోకే వెడుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా కార్యక్రమంలో తెలిపారు. అలా కాకుండా తయారీ, సౌర విద్యుత్, బయోటెక్నాలజీ వంటి రంగాల స్టార్టప్‌లకు కూడా నిధులు అందాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.