breaking news
indrani mukarji
-
షీనాబోరా హత్యకేసులో బిగ్ ట్విస్ట్
ముంబై : 12 ఏళ్ల క్రితం జరిగిన హీనాబోరా హత్య కేసులో బిగ్ ట్విస్ట్. కేసులో కీలకంగా ఉన్న షీనాబోరా అస్థికలు (ఎముకలు) మాయమయ్యాయి. కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు హత్య అనంతరం రాయగఢ్ పోలీసులు షీనాబోరా అస్థికల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడా అస్థికలు కనిపించడం లేదని సీబీఐ అధికారులు ముంబై ప్రత్యేక కోర్టుకు తెలిపారు.2012,మే 21న మహరాష్ట్రలోని రాయిఘడ్కు చెందిన గణేష్ ఎగ్డే తనకెంతో ఇష్టమైన మామిడి పండ్ల సీజన్ వచ్చేసిందని సంతోషంగా ఉన్నాడు. ఆ సంతోషాన్ని మరింత రెట్టింపు చేసేందుకు రాయిఘడ్ అడవుల్లో దొరికే రుచికరమైన మామిడి పండ్ల కోసం బయలు దేరాడు. అయితే అడవిలోకి వెళ్తుండగా.. ఓ చెట్టు సమీపంలో పెద్ద సూట్‌కేస్ గణేష్ కంటపడింది. అంతే ఆ సూట్‌కేసులో ఏముందో అని చూసిన ఆయన షాక్ తిన్నాడు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి జరిగిన సంఘటన గురించి వివరించాడు. క్షణాల్లో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ సూట్‌కేస్‌లో కాలిన మృతదేహం కనిపించింది.కట్ చేస్తే షీనా బోరా హత్య జరగ్గా.. మూడేళ్ల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో అరెస్టైన ఇంద్రాణీ ముఖర్జియా డ్రైవర్‌ను విచారించగా.. షీనా బోరా హత్య గురించి బయటపెట్టాడు.షీనాను ఇంద్రాణీ గొంతు నులిమి చంపేసిందని, ఆ తర్వాత షీనాబోరాను కాల్చివేసి ఆమె అస్థికల్ని రాయ్‌ఘడ్‌లోని గాగోడే-ఖుర్ద్ గ్రామ సమీపంలోని అడవుల్లో పడేసినట్లు చెప్పాడు. అప్రమత్తమైన షీనాబోరా కేసును విచారిస్తున్న అధికారులు స్థానిక రాయ్‌ఘడ్ పెన్ పోలీసుల సహకారంతో షీనాబోరా అస్థికల్ని స్వాధీనం చేసుకున్నారు.ఆ ఎముకల్ని పరీక్షించి అవి షీనాబోరావేనని సర్ జేజే హాస్పిటల్ ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ జెబా ఖాన్ తేల్చారు. మే 7న కోర్టు విచారణలో సీబీఐ తరపున హాజరైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీజే నాండోడ్ కేసు విచారణలో షీనాబోరా అస్థికల్ని జెబాఖాన్కు చూపించి విచారణ చేపట్టాలని కోర్టును కోరారు.ఇందులో భాగంగా గురువారం (జూన్ 13) షీనాబోరా అస్థికల గురించి ఆరా తీయగా అవి మాయమైనట్లు సీబీఐ అధికారులు కోర్టుకు వెల్లడించారు. విచారణలో ఆధారాలు (ఎముకలు) ఉన్న రెండు మార్క్ ప్యాకెట్లను గుర్తించలేకపోయామన్నారు. అస్థికలు లేకున్నా షీనా బోరా కేసు విచారణ కొనసాగించాలని సీబీఐ భావించింది. అందుకు డిఫెన్స్ లాయర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కోర్టు విచారణను జూన్ 27కి వాయిదా వేసింది. -
పెళ్లిళ్లోయ్ పెళ్లిళ్లు
జీవన కాలమ్: పెళ్లికి నాలుగు లక్ష్యాలను పెద్దలు చెప్పారు - ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ. సమాజ హితం - ఇప్పుడు రోజులు మారాయి. పెళ్లికి కారణాలు తిరగబడ్డాయి. కామేచ, అర్థేచ- మూడోది ఎవడిక్కావాలి? ఒక జోక్. ఒక భారతీ యుడు, అమెరికన్ కలిశారట. భారతీయుడు మొరబెట్టుకున్నాడట. అయ్యా, మా దేశంలో పెళ్లిళ్లు మా ప్రమేయం లేకుండా పెద్దలు నిర్ణ యిస్తారు. జాతకాలు, ముహూర్తాలు, మంగళ సూత్రాలు, తంతు- గొడవ. నేను చూడని, ప్రేమించని పిల్ల మెడలో తాళి కట్టమంటారు. ఎలా చచ్చేది? - అన్నాడట. అమెరికన్ అన్నాడు: మీ పని బాగానే ఉంది బాబూ. నా సంగతి చూడు. నేను మూడేళ్లు ప్రేమించి మొగుడు పోయిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. రెండేళ్ల తర్వాత మా నాన్న నా పెళ్లాం మొదటి భర్త కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు మా నాన్న నాకు అల్లుడయ్యాడు. నేను ఆయనకి మామనయ్యాను. చట్టం ప్రకారం నా కూతురు నాకు తల్లయింది. నా పెళ్లాం నా అమ్మ మ్మ అయింది. నా కొడుకు పుట్టాక సమస్యలు మిన్ను ముట్టాయి. నా కొడుకు మా నాన్నకి తమ్ముడ య్యాడు. కనుక నాకు మేనల్లుడ య్యాడు. ఇప్పుడు మా నాన్నకి కొడుకు పుట్టాడు. నాకు తమ్ముడు కావలసిన ఆ కుర్రాడికి నేను తాతన య్యాను. మొత్తానికి నేను నాకే తాతని, నాకే మనుమడిని అయ్యాను. మరి మా సంగతేమిటి? భారతీయుడు స్పృహతప్పి పడిపోయాడట! ఇది షీనా బోరా హత్య గురించిన కాలమ్ కాదు. ఇప్పుడు ఇండియా మార్కు అమెరికా కథ. ఇంద్రాణి ముఖర్జీకి ముగ్గురు భర్తలు. మొదటి భర్తకాని భర్త దాస్‌కి ఇద్దరు పిల్లలు - మిఖయిల్, షీనా. రెండో భర్త సంజీవ్ ఖన్నాకి ఒక కూతురు. వృద్ధి. మూడో భర్త పీటర్ ముఖర్జీకి మొదటి భార్య ద్వారా ఒక కొడుకు. రాహుల్. ఇంద్రాణి తన మొదటి భర్త పిల్లల్ని తన తల్లిదండ్రులకి అప్పగించింది. వారిద్దరూ తనకి తమ్ముడు, చెల్లె ళ్లని చెప్పింది. కాని ఆమె తండ్రి 'బాబోయ్, నేను వారి తండ్రిని కాదు. తాతని' అన్నాడు. ఇప్పుడు మూడో భర్త కొడుకు (తనకి పుట్ట నివాడు) తన చెల్లెలని చెప్పిన కూతురు ప్రేమలో పడ్డాడు. ఇది ఇంద్రాణికి నచ్చలేదు. ఈలోగా రెండో భర్తని పిలిచింది. ఆయన కూతురు 'వృద్ధి' ని ఆయనకి చూపిస్తానని మాటిచ్చింది. చెల్లెలని చెప్పిన కూతుర్ని హత్య చేసింది. తననీ హత్య చేయబోయిందని కొడుకు అంటున్నాడు. అంటే- మూడో భర్త యొక్క రెండో పెళ్లాం రెండో భర్త సాయంతో మొదటి భర్త యొక్క చెల్లె లని చెప్పే కూతురుని- మూడో భర్త యొక్క మొదటి పెళ్లాం కొడుకుతో ప్రేమ వ్యవహారం నడిపిన కారణంగా చంపింది. ఇది వార్త. ఓ పోలీసు ఆఫీసరు అడిగాడు: ఎందుకమ్మా నీ కూతుర్ని నువ్వే చంపుకున్నావు? ఇంద్రాణి సమాధానం: నా మూడో భర్త నా చెల్లెలని భావిస్తున్న నా కూతుర్ని నేను చంపించ కపోతే నా సవతి కొడుకు పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు నా కూతురు నా కోడలవుతుంది. అంటే తన మరదలని నమ్మే నా మూడో భర్త కళ్ల ముం దే నా కూతురు తన కోడలిగా కాపురం చేస్తుంది. పోలీసు ఆఫీసరు మూర్ఛపోయాడు. ఇంత ముదరకపోయినా కొంత ముదిరిన కథ మనం ఈ మధ్య విన్నాం. కేంద్ర మంత్రి అం దాల శశి థరూర్గారు సునందా పుష్కర్ అనే ఆవి డని రెండో పెళ్లి చేసుకున్నారు. అమెకీ అది రెండో పెళ్లి. ఆమెకి పెళ్లీడు వచ్చిన కొడుకున్నాడు. తీరా ఆమె హత్యా (ఆత్మహత్యా?)కి గురయింది. మన దేశం కూడా పెళ్లిళ్ల విషయంలో అమెరి కాకి ఏవిధంగానూ తీసిపోదని నిరూపిస్తున్నం దుకు నాకు గర్వంగా ఉంది. మనకి నచ్చినా నచ్చకపోయినా ఈ దేశంలో వివాహ వ్యవస్థ శతాబ్దాల నాటిది. పెళ్లికి నాలుగు లక్ష్యాలను ఆ వరసలో పెద్దలు చెప్పారు - ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ. సమాజ హితం -భార్యాభర్తలు తమ విధుల్ని నిర్వర్తించుకోవ డంలో, పది మందికి అండగా నిలవడంలో బాధ్యత వహిస్తారు. వహించాలి. అది ధర్మం. తర్వాత ఆర్థికంగా ఈ వ్యవస్థ ఆరోగ్యానికి, తమ జీవనానికి దోహదకారులవుతారు. అవాలి. అది అర్థం. అప్పుడు మూడో కారణం- కోరిక. ఆ కోరి క లక్ష్యం ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన, సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకోగలిగిన సంతా నాన్ని పొందుతారు. పొందాలి. చీకటి గదిలో కేవలం కోరికని దులుపుకోవడం కాదు. ఇప్పుడు రోజులు మారాయి. పెళ్లికి కార ణాలు తిరగబడ్డాయి. కామేచ, అర్థేచ- మూడోది ఎవడిక్కావాలి? ధర్మం అంటే ఎందరికి తెలుసు? దమ్ముంటే ఇంద్రాణిని అడగండి. పార్కుల్లో ప్రేమించి, ఆఫీసుల్లో కలిసి దాన్ని ప్రేమనుకొని పెళ్లిళ్లు చేసుకుని నెలలు తిరగకుం డా విడాకులు పుచ్చుకున్న ప్రేమికుల కథలు వం దలున్నాయి. వారంతా 'కామేచ, అర్థేచ' పెళ్లిళ్లు చేసుకున్న వారే కనుక. మరి 'ధర్మం?' పోవ య్యా, తాటిచెట్టుకీ తాత పిలకకీ ముడివేస్తారు - ధర్మం ఎవడిక్కావాలి?