ధావన్ అవుట్.. గంభీర్‌కు ఛాన్స్
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా మూడో టెస్టుకు దూరమయ్యాడు. కోల్‌కతాలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ధావన్ వేలికి గాయమైంది. దీంతో 15 రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు అతనికి సూచించారు. ఈ నెల 8 నుంచి ఇండోర్‌లో ఇరు దేశాల మధ్య చివరి, మూడో టెస్టు జరగనుంది.
ధావన్ గాయపడటంతో ఇండోర్ టెస్టులో గౌతమ్ గంభీర్ ఆడే అవకాశముంది. తొలి టెస్టు సమయంలో కేఎల్ రాహుల్ గాయపడటంతో గంభీర్‌ను జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. రెండేళ్ల విరామం తర్వాత గౌతీ మళ్లీ జట్టులోకి వచ్చినా రెండో టెస్టులో ఆడే అవకాశం దక్కలేదు. ఈ మ్యాచ్యలో మురళీవిజయ్, ధావన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. కాగా మూడో టెస్టుకు ధావన్ దూరంకావడంతో అతని స్థానంలో గౌతీని తుది జట్టులోకి తీసుకోనున్నారు.