breaking news
Indonesia Super Series
-
PV Sindhu: 37 నిమిషాల్లో ఓడించి క్వార్టర్స్‌కు
PV Sindhu Enters Quarterfinals Indonesia Open Super 1000.. ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగుతేజం పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. టోర్నీలో మూడోసీడ్‌గా బరిలోకి దిగిన సింధు గురువారం జరిగిన రెండో రౌండ్లో జర్మనీకి చెందిన బాలిలో వైవోన్ లీని 21-12, 21-18తో వరుస సెట్లలో ఓడించింది. రెండుసార్లు ఒలింపిక్ విజేత అయిన సింధు వైవోన్ లీని కేవలం 37 నిమిషాల్లోనే మట్టికరిపించి క్వార్టర్స్‌కు చేరుకుంది. ఇక క్వార్టర్స్‌లో స్పెయిన్‌కు చెందిన 55వ సీడ్ బీట్రిజ్ కొర్రల్స్, కొరియాకు చెందిన 54వ సీడ్ సిమ్ యుజిన్ మధ్య విజేతతో తలపడనుంది. -
క్వార్టర్స్‌లో సైనా
జ్వాల జోడికి చుక్కెదురు ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ జకర్తా: అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్... ఇండోనేసియా సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్ సైనా 21-11, 21-10తో ప్రపంచ 53వ ర్యాంకర్ ఫిట్రేని (ఇండోనేసియా)పై విజయం సాధించింది. 32 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాదీ పూర్తి ఆధిపత్యాన్ని చూపెట్టింది. తొలి గేమ్‌లో 9-7 ఆధిక్యంలో ఉన్న దశలో వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 14-7తో నిలిచింది. ఆ తర్వాత కూడా అదే జోరుతో గేమ్‌ను చేజిక్కించుకుంది. ఇక రెండో గేమ్‌లోనూ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 10-3 ఆధిక్యాన్ని సాధించింది. తర్వాత ఫిట్రేని ఒకటి, రెండు పాయింట్లు నెగ్గినా... హైదరాబాద్ అమ్మాయి దూకుడుకు అడ్డుకట్ట వేయలేకపోయింది. మహిళల డబుల్స్ రెండో రౌండ్లో జ్వాల-అశ్విని జోడి 9-21, 18-21తో హుయాంగ్ యోక్వియాంగ్-టాంగ్ జినుహా (చైనా) చేతిలో పరాజయం పొందారు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి-సుమీత్ రెడ్డి 18-21, 13-21తో ఆరోసీడ్ కో సుంగ్ యున్-షిన్ బీక్ చియోల్ (కొరియా) చేతిలో ఓడారు.