breaking news
immunoglobulin
-
గాల్లో దీపంలా పేదల ప్రాణాలు
టీడీపీ కూటమి పాలనలో రాష్ట్రంలోని పేదల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల అత్యవసర చికిత్సకు మందులు కరువయ్యాయి. కొద్దిరోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జీబీఎస్ కేసుల నమోదు పెరిగింది. దీంతోపాటు మరికొన్ని ఇమ్యూన్ వ్యాధుల చికిత్సలో వాడే ఇమ్యూనోగ్లోబిలిన్స్ ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో అందుబాటులో ఉండటం లేదు.సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి పాలనలో రాష్ట్రంలోని పేదల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల అత్యవసర చికిత్సకు మందులు కరువయ్యాయి. కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా గులియన్ బారె సిండ్రోమ్ (జీబీఎస్) కేసుల నమోదు పెరిగింది. దీంతోపాటు మరికొన్ని ఇమ్యూన్ వ్యాధుల చికిత్సలో వాడే ఇమ్యూనో గ్లోబిలిన్స్ ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో అందుబాటులో ఉండటం లేదు. సోమవారం నాటికి కర్నూలు, విజయవాడ, ఏలూరు, మచిలీపట్నం, తిరుపతి, నంద్యాల, విజయనగరం, పాడేరు, మరికొన్ని జీజీహెచ్‌ల్లో ఇమ్యునో గ్లోబులిన్ ఇంజెక్షన్ల నిల్వలు “సున్నా’గా ఉన్నాయి. గడిచిన ఐదు, ఆరు నెలల నుంచి ఇదే పరిస్థితి నెలకొందని ఆయా ఆస్పత్రుల్లోని వైద్యాధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వైద్య సదుపాయాల కల్పన అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) నుంచి సరఫరా నిలిచిపోయిందని ప్రభుత్వానికి పలుమార్లు తెలియజేశామని చెబుతున్నారు. రాష్ట్రంలో జీబీఎస్ కేసులు క్రమంగా పెరుగుతుయని, ఈ ఇంజెక్షన్లు అందుబాటులో లేకపోతే తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని ఆస్పత్రుల సూపరింటెండెంట్లు పలుమార్లు చెప్పడంతో ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్న రెండు, మూడు ఆస్పత్రుల నుంచి మిగిలిన వాటికి చాలీచాలనట్టుగా సర్దుబాటు చేసే పనిలో వైద్య శాఖ నిమగ్నమైంది.కేసులన్నీ రిఫర్ ప్రతి వెయ్యి మందిలో ఒకరు ఆటో ఇమ్యూన్ డిసీజెస్‌కు గురవుతారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. జీబీఎస్ బారినపడిన వారిలోను స్వీయ రోగనిరోధక శక్తి దెబ్బతిని ప్రాణాల మీదకు వస్తుంటుంది. ఈ నేపథ్యంలో రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేయడం కోసం చికిత్స సమయంలో ఇమ్యూనో గ్లోబులిన్స్ థెరపీ ఇస్తుంటారు. ప్రైవేట్‌లో ఈ ఇంజెక్షన్ ఖరీదు రూ.40 వేల వరకు ఉంటోంది. ఇంత ఖరీదైన ఇంజెక్షన్లను కొనుగోలు చేసి, చికిత్స చేయించుకోవడం పేద, మధ్యతరగతి ప్రజలకు స్తోమతకు మించిన వ్యవహారం. ఇక జీబీఎస్‌తో పాటు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్‌తో బాధపడే చిన్న పిల్లలు... బోధనాస్పత్రుల్లో చేరిన సందర్భాల్లో చికిత్సకు ఇమ్యూనో గ్లోబులిన్స్ అందుబాటులో లేక ఆ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్న ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. కేవలం ఈ కారణంతో గడిచిన ఐదారు నెలలుగా అనేక కేసులను విజయవాడ, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, మచిలీపట్నం ఆస్పత్రుల నుంచి గుంటూరు జీజీహెచ్‌కు రిఫర్ చేసినట్టు వెల్లడైంది. ఇక ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పాడేరు ఆస్పత్రుల నుంచి విశాఖకు, కర్నూలు ఆస్పత్రికి అనంతపురం, కడప తదితరాల నుంచి రిఫరల్ కేసులు పెరగడంతో ఈ ఆస్పత్రుల్లో ఇంజెక్షన్ల కొరత నెలకొన్నట్టు తెలుస్తోంది. ప్రాణాలతో చెలగాటంవైద్యశాఖలో ఏఐ వినియోగం పెరగాలి.. రోగులకు వైద్య సేవలు మరింత చేరువవ్వాలి... అంటూ సీఎం చంద్రబాబు ఊదరగొడుతుంటారు. అయితే, ఆయన చెబుతున్న మాటలకు.. చేతలకు అస్సలు పొంతన కుదరట్లేదు. అనారోగ్యంతో ప్రభుత్వాస్పత్రులకు వెళితే కనీసం మందులు కూడా అందుబాటులో లేని దీనావస్థలో ఆస్పత్రులను నెట్టేశారు. మెరుగైన వైద్యం కోసం కాకుండా.. కేవలం ఇంజెక్షన్లు, మందులు లేవన్న కారణంతో రోగులను ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి రిఫరల్ పేరిట ప్రభుత్వమే బంతాట ఆడుతున్న దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. దీంతో చికిత్సల్లో కాలయాపన జరుగుతోంది. వెరసి రోగులు ప్రత్యక్ష నరకం చవిచూస్తున్నారు. మరోవైపు సకాలంలో చికిత్సలు అందక అమాయకులు మృత్యువాత పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.నెట్వర్క్ ఆస్పత్రులు ఆ ఇంజక్షన్ ఇవ్వడంలేదుగులియన్ బారె సిండ్రోమ్ (జీబీఎస్) అంటువ్యాధి కాదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు. సోమవారం జీబీఎస్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది జనవరిలో 43 కేసులు నమోదు కాగా వారిలో 17 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వివరించారు. ప్రస్తుతం పలు ఆస్పత్రుల్లో 749 ఇమ్యూనో గ్లోబులిన్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.అయితే ఎన్టీఆర్ వైద్యసేవ కింద నెట్ వర్క్ ఆస్పత్రులు ఈ ఇంజక్షన్‌ను ఇవ్వడానికి ముందుకురావడంలేదన్నారు. గత ఏడాది 10 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 301 కేసులు నమోదు కాగా, వీటిలో అధిక మొత్తంలో 115 కేసులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నమోదయ్యామని వెల్లడించారు. -
కరోనాను ఢీకొట్టే యాంటీబాడీస్‌పై విశ్లేషణ
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని దేశాలు వ్యాక్సిన్ ప్రయోగాల్లో నిమగ్నమైనా, ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో కరోనాను జుయించే యాంటీబాడీస్‌పై డాక్టర్లు దృష్టి పెట్టారు. యాంటీబాడీస్ మానవ శరీరంలో ఏ విధంగా వస్తుందో విశ్లేషిద్దాం. మానవ శరీరంలో ప్రవేశించే వైరస్(కరోనా), బ్యాక్టేరియాలను ఢీకొట్టి శరీరానికి రక్షణ వ్యవస్థ లాగా యాంటీబాడీస్(వ్యాధి కారకాన్ని ఎదుర్కొనే రక్షక దళాలు,) పనిచేస్తాయి. రెండు రకాల ఇమ్యునోగ్లోబులిన్ యాంటీబాడీస్(ఐజీఎమ్), (ఐజీజీ)లు మానవులకు రక్షణ కల్పిస్తాయి. రెండు రకాల యాంటీబాడీస్ గురించి తెలుసుకుందాం. ఐజీఎమ్ యాంటీబాడీస్: మానవులలో వైరస్ ప్రవేశించిన మొదటి వారంలో ఐజీఎమ్ యాంటీబాడీస్ రక్షణ కలిగిస్తాయి. కానీ ఆరు వారాల తరువాత శరీరం నుంచి నిష్క్రమిస్తాయి. కాగా ఐజీఎమ్ యాంటీబాడీస్ మానవుల్లో ప్రవేశించాక వైరస్ లేదా బ్యాక్టేరియా ప్రవేశించినట్లు తెలిపే మొదటి సూచన అని అపోలో శ్వాస వ్యాధి నిపుణులు రవీంద్ర మెహతా తెలిపారు ఐజీజీ యాంటీబాడీస్: మానవుల్లో వ్యాధి కారకం(వైరస్, బ్యాక్టేరియా) ప్రవేశించాక మూడు వారాల తరువాత ఐజీజీ శరీరానికి సూచిస్తుంది. లేట్‌గా వచ్చిన లేటేస్ట్ అన్నట్లుగా ఐజీజీ యాంటీబాడీస్ చాలా కాలం పాటు మానవుల రోగనిరోధకశక్తిని కాపాడుతుంది. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో యాంటీబాడీస్ పరీక్షలవైపు డాక్టర్లు మొగ్గు చూపుతున్నారు. కాగా యాంటీబాడీస్ పరీక్ష, రక్తపరీక్ష మాదిరిగా సులభంగా చేయొచ్చు. కేవలం యాంటీబాడీస్ పరీక్ష రూ.500లతో చేసి, అరగంటలో ఫలితం ఇస్తారు. చదవండి: ప్రాణం తీసిన భయం -
కుక్క కాటుకు మందేది?
సిద్దిపేట/సిద్దిపేట రూరల్, న్యూస్‌లైన్: సిద్దిపేట అనగానే ఫుల్లుగా డెవలప్ అవుతున్నదంటారు. రానున్న రోజుల్లో మెడికల్ కాలేజీ రావొచ్చని ఆశిస్తున్నారు. అదేమో కానీ కుక్క కరిస్తే మాత్రం సర్కారీ సూది మందు (ఇమ్యూనోగ్లాబ్లిన్) దొరకదు. బాధితులు సిటీకి పరుగులు పెట్టాల్సిందే. ఈ మధ్య శునకాలు తరుచూ స్వైరవిహారం చేస్తున్నాయి. దుబ్బాక మండలం దుంపలపల్లిలో ఇటీవలే ఓ చిన్నారి సహా ముగ్గురు వ్యక్తులను కుక్క కరిచిన సంఘటన మరువకముందే మరోటి చోటుచేసుకుంది. ఈసారి సిద్దిపేట మండలం బుస్సాపూర్‌లో.. అభం శుభం తెలియని పసివాళ్లను శునకం కొరికేసింది. సోమ, మంగళవారాల్లో వరుసగా రెండ్రోజులు ఆ కుక్క స్వైరవిహారం చేసి తీవ్రంగా గాయపర్చింది. కుక్కకాటుకు గురైన మద్దూరి పుష్పలత(10), సాజీద్(5), రాజు(7), మన్నే శశికుమార్(6), గిరి(9) అనే చిన్నారులు తల్లడిల్లారు. వారిలో కండలు తేలిన సాజీద్, రాజు, పుష్పలతలకు కుటుంబీకులు హైదరాబాద్‌లోని నారాయణగూడ ఐపీఎం, ఫీవర్ ఆస్పత్రిల్లో చికిత్స చేయించారు. ఇక్కడున్నది యాంటీ రాబీస్ వ్యాక్సినే సిద్దిపేట ప్రాంతీయ వైద్యశాలలో యాంటీ రాబీస్ వ్యాక్సిన్ మాత్రమే అందుబాటులో ఉంది. కుక్కలు మామూలుగా కరిస్తే ఈ సూది ఇస్తారు. అదే తీవ్రంగా గాయపరిస్తే మాత్రం కచ్చితంగా ఇమ్యూనోగ్లాబ్లిన్ అనే సూది ఇవ్వాల్సిందే. అదిక్కడ లేదు. ఒక్కోటి రూ.ఐదారు వేల విలువైనది కావడంవల్ల ఆ సదుపాయం ఏర్పాటు చేయలేదని వైద్యశాల వర్గాలంటున్నాయి. అందుకే అనివార్యంగా హైదరాబాద్‌కు పంపించాల్సి వస్తోందని తెలిపాయి.