breaking news
Illegal layout
-
ప్లాట్ల కొనుగోలుదారులూ అదంతా మాయ.. కొంటే నిండా మునిగినట్టే!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: లేఅవుట్లో ఉన్న భూములకు కన్వర్షన్ జరిగిందా? ప్లాన్ అప్రూవల్ వచ్చిందా? వాస్తవంగా ప్లాట్లు వేశారా? రోడ్లు, సామాజిక అవసరాలకు భూమిని మినహాయించారా? ప్రభుత్వ భూములు, సాగునీటి కాలువలున్నాయా..? సొంతింటి కల సాకారం చేసుకోవాలనే ఆతృతతో ప్లాట్లు కొనుగోలు చేస్తున్న ప్రజలు ఇప్పుడవేవీ తెలుసుకోవడం లేదు. స్థలం దొరికిందని ఆదరాబాదరాగా చెల్లింపులు చేసేస్తున్నారు. లొసుగును బయటపెట్టాల్సిన అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కూడా చెక్ పెట్టడం లేదు. దీంతో చివరికి కొనుగోలుదారులు మోసపోవాల్సి వస్తోంది. రణస్థలం మండలం వరిశాంలో ఉన్న రామ్‌నగర్ లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేస్తున్న వారి పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. అంతా మాయ.. వరిశాంలోని రామ్‌నగర్ లే అవుట్లో సర్వే నంబర్.23–7ఎ, 23–11, 23–12, 23–13, 23–14, 23–15లో గల ఏడెకరాల భూమిలో లేఅవుట్ వేసినట్టుగా నిర్వాహకులు కాగితాల్లో చూపిస్తున్నారు. ఎన్ని ప్లాట్లు వేశారో ఎవరికీ తెలియడం లేదు. అక్కడ ల్యాండ్ పొజిషన్ లేదు. దానికి కారణం వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా కన్వర్షన్ చేయించలేదు. లేఅవుట్ వేసేందుకు అనుమతి తీసుకోలేదు. అంతా కాగితాల్లోనే మాయాజాలం ప్రదర్శించి రణస్థలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. ముందస్తు ఒప్పందమో మరేమిటో తెలియదు గానీ అధికారులు కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. తమకు డాక్యుమెంట్ వచ్చిందని రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. పక్కాగా ఉన్న ప్లాట్లపై జరిగే క్రయ, విక్రయాలకు అనేక ప్రశ్నలు, అభ్యంతరాలు తెలిపే రిజిస్ట్రేషన్ అధికారులు.. వరిశాంలోని రామ్‌నగర్ లేఅవుట్‌కు సంబంధించి వస్తున్న అక్రమ డాక్యుమెంట్లపై కనీసం అడగడం లేదు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్ వచ్చీ రాగానే రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. దీనివెనక ఉన్న లాలూచీ ఏంటో వారికే తెలియాలి. ల్యాండ్ కన్వర్షన్, ప్లాన్ అప్రూవల్ లేని రామ్‌నగర్ లేఅవుట్లోని నంబర్.74 ప్లాట్ క్రయ, విక్రయాలకు సంబంధించి జరిగిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కొనుగోలుదారులు మునిగినట్టే.. వ్యవసాయ భూమిని లేఅవుట్‌గా వేయాలంటే ముందుగా ల్యాండ్ కన్వర్షన్ చేయాలి. దాని కోసం రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వానికి భూమి విలువలో 5శాతం చెల్లించి ల్యాండ్ కన్వర్షన్ చేసుకోవాలి. దీని తర్వాత లేఅవుట్ వేసేందుకు వుడా లేదంటే సుడా నుంచి ప్లాన్ అప్రూవల్ తీసుకోవాలి. ఇందుకు భూమి విలువలో 12శాతం చెల్లింపులు చేయాలి. తదననుగుణంగా వచ్చిన అనుమతుల మేరకు రోడ్లు, సామాజిక అవసరాల కోసం స్థలం మినహాయించి మిగతా స్థలాన్ని ప్లాట్లుగా విభజన చేయాలి. కానీ వరిశాంలోని రామ్‌నగర్ లేఅవుట్ భూమికి కన్వర్షన్ గాని, ప్లాన్ అప్రూవల్ గాని తీసుకోలేదు. ప్రభుత్వానికి ఒక్క పైసా చెల్లించకుండానే కాగితాల్లో లేఅవుట్ సృష్టించారు. అందమైన బ్రోచర్లతో ప్లాట్లను అమ్మేస్తున్నారు. వారికి నమ్మకం కలిగేలా కొనుగోలుదారు పేరున సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయించేస్తున్నారు. అంతే తప్ప వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడం లేదు. లేఅవుట్లో విద్యుత్ సౌక ర్యం గాని, కాలువలు గాని ఉండడం లేదు. రోడ్లు, సామాజిక అవసరాల కోసం ఖాళీగా స్థలాన్ని మినహాయించిన పరిస్థితి లేదు. అసలు కొనుగోలుదారుల ప్లాట్ ఎక్కడో భౌతికంగా తెలియదు. దీనివల్ల కొనుగోలు చేసిన స్థలంలో భవిష్యత్‌లో ఇళ్లు కట్టుకోవాలంటే అనుమతి రాదు. ప్లాన్ ఇచ్చేందుకు అవకాశం ఉండదు. ఇవన్నీ రెగ్యులర్ చేస్తే తప్ప ఇంటి నిర్మాణానికి అనుమతి రాదు. కన్వర్షన్, ప్లాన్ అప్రూవల్‌కు మళ్లీ డబ్బులు చెల్లించాలి. రోడ్లు, సామాజిక అవసరాల కోసం కొనుగోలు చేసిన స్థలాల నుంచే కేటాయించాల్సి వస్తోంది. ఫలితంగా కొనుగోలు చేసే స్థలం విస్తీర్ణం కూడా తగ్గిపోనుంది. ఈ పరిస్థితి రాకుండా ముందుగా లేఅవుట్కున్న అనుమతులు పరిశీలించాలి. ప్లాన్ అప్రూవల్తో ఉన్న ప్లాట్లను గుర్తించి కొనుగోలు చేయాలి. ఇలా జరగకపోవడం వల్ల కొనుగోలుదారులు నిండా మునిగిపోతున్నారు. మరో వైపు ఇలాంటి వ్యవహారాలతో ప్రభుత్వ పరంగా ఆదాయానికి గండిపడుతోంది. రెండు తేదీల్లో తొమ్మిది ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు.. వరిశాంలోని అనధికారికంగా వేసిన రామ్‌నగర్ లేఅవుట్లో రెండు తేదీల్లో ఏకంగా తొమ్మిది ప్లాట్లకు రణస్థలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. సర్వే నంబర్ 23–7ఎలో 60, 64, 65, 66, 74, 75, సర్వే నంబర్ 23–14లో 8, 23–14,23–15లో 6 నెంబర్ల గల ప్లాట్లకు గత నెల 25న రిజిస్ట్రేషన్లు చేశారు. సర్వే నంబర్ 23–14, 23–15లో గల 23వ ప్లాట్‌ను ఆగస్టు 3న రిజిస్ట్రేషన్ చేశారు. ఇదంతా పక్కా పథకం ప్రకారం జరిగినట్లు తెలుస్తోంది. -
లే‘ఔట్’..!
♦ జిల్లా పరిధిలో 102 అక్రమ లేఅవుట్లు రద్దు ♦ గ్రామీణ ప్రాంతాల్లో అనధికారికంగా వెలిసిన వెంచర్లు ♦ అక్రమమని తేలుస్తూ పంచాయతీరాజ్ శాఖకు నివేదిక ♦ వాటిని రద్దు చేస్తూ డీపీఓ ఉత్తర్వులు అక్రమ లేఅవుట్లపై జిల్లా యంత్రాంగం కొరడా ఝళిపించింది. అనధికారికంగా వెలిసిన వెంచర్లపై ఉక్కుపాదం మోపింది. డెరైక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) పరిధిలోని మండలాల్లో పుట్టుకొచ్చిన 102 అక్రమ లేఅవుట్లను రద్దు చేసింది. ఎలాంటి అనుమతుల్లేకుండా అడ్డగోలుగా వెలిసిన వెంచర్ల చిట్టాను సేకరించిన డీటీసీపీ విభాగం అక్రమార్కుల జాబితాను జిల్లా పంచాయతీరాజ్ శాఖకు పంపింది. ఈ మేరకు డీటీసీపీ నిర్ధారించిన 102 అక్రమ లేఅవుట్లను రద్దు చేస్తున్నట్లు డీపీఓ అరుణ ప్రకటించారు. కేసులు పెడతాం.. అనధికారికంగా వెలిసిన లేఅవుట్లను కూల్చేస్తాం. 102 ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తాం. అధికార దుర్వినియోగానికి పాల్పడిన సర్పంచ్‌లు, కార్యదర్శులు, విస్తరణాధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించకుండా అడ్డగోలుగా లేఅవుట్లు చేస్తే ఉపేక్షించేది లేదు. అక్రమమని తేల్చిన లేఅవుట్ల జాబితాను ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపరుస్తాం. ప్లాట్లు కొనేముందు ఆయా వెంచర్లకు అనుమతి ఉందా? లేదా అనేది ఒకసారి సరిచూసుకుంటే మోసాల బారినపడే అవకాశముండదు. - అరుణ , డీపీఓ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : లేఅవుట్లకు అనుమతి ఇచ్చే ఎలాంటి అధికారం గ్రామ పంచాయతీలకు లేదు. హెచ్ఎండీఏ పరిధిలో హెచ్ఎండీఏకు.. ఆ పరిధి దాటిన మండలాల్లో డీటీసీపీకి మాత్రమే లేఅవుట్లకు అనుమతులు జారీ అధికారం ఉంది. అయితే, ఈవిషయాన్ని గుట్టుగా ఉంచుతున్న రియల్టర్లు పంచాయతీ లేఅవుట్ల పేర కొనుగోలుదారులను ఏమార్చుతున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించకుండా.. అభివృద్ధి చేయని వెంచర్లలో కారుచౌకగా ప్లాట్లు విక్రయిస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. అప్రూవ్డ్ లేఅవుట్లతో పోలిస్తే తక్కువ ధరకు స్థలాలు దొరుకుతుండడంతో అల్పాదాయవర్గాలు ఈ వెంచర్లలో ప్లాట్లు కొనేందుకు మొగ్గు చూపుతున్నాయి. మధ్యతరగతి ప్రజల బలహీనతలను సొమ్ముచేసుకుంటున్న స్థిరాస్తి సంస్థలు.. మారుమూల ప్రాంతాల్లో సైతం వెంచర్లు చేశాయి. కనీస రోడ్లు, విద్యుత్ స్తంభాలు కూడా వేయకుండా.. నాలుగు రాళ్లు పాతి ప్లాట్లుగా విక్రయించి చేతులు దులుపుకుంటున్నారు. కొ న్ని సంస్థలయితే.. భూ వినియోగ మార్పి డి చేయకుండానే లేఅవుట్లుగా అభివృద్ధి చేసినట్లు డీటీసీపీ అధికారుల పరిశీలనలో తేలి ంది. అంతేకాకుండా కొన్నిచోట్ల భూ యజ మానికి కొంత మొత్తం చెల్లించి అగ్రిమెంట్ కాపీతోనే ప్లాట్లను అమ్మేస్తున్నట్లు స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే అక్రమ లేఅవుట్లపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో సర్వేచేసిన డీటీసీపీ అధికారుల బృందం జిల్లావ్యాప్తంగా దా దాపు 400 ఎకరాల విస్తీర్ణంలో అక్రమ లేఅవుట్లు (102) వెలిసినట్లు తేల్చి జాబితాను జిల్లా పంచాయతీశాఖాధికారికి అంద జేసింది.