breaking news
housing for poor people
-
మహిళకు ఇంటి స్థలం ఇస్తే కుటుంబం లబ్ధి పొందినట్లే..
సాక్షి, అమరావతి: మహిళకు ఇంటి స్థలం ఇస్తే కుటుంబం అంతా లబ్ధి పొందినట్లేనని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో 100 శాతం సంతృప్తి సాధ్యం కాదని తెలిపింది. పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇచ్చిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు ప్రభావం ఆ స్థలాలు పొందిన వారందరిపై పడుతుందని స్పష్టంచేసింది.తీర్పునిచ్చే ముందు వారందరికీ సింగిల్ జడ్జి నోటీసులు జారీ చేసి వారి వాదనలు కూడా విని ఉంటే సమంజసంగా ఉండేదని అభిప్రాయపడింది. మహిళల వాదనలు విని ఉంటే సహజ న్యాయ సూత్రాలను అనుసరించినట్లు ఉండేదని వ్యాఖ్యానించింది. వాదనల సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్ శ్రీరామ్ పలు విషయాలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆ వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఏజీని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికే వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద 30 లక్షల మంది పేదలకు ఇచ్చిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపటొద్దంటూ జస్టిస్ సత్యనారాయణమూర్తి గత నెలలో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై జస్టిస్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి వద్ద 128 మంది కలిసి ఓ పిటిషన్ వేశారని, వారిలో 51 మంది మహిళలే ఉన్నారని ఏజీ తెలిపారు. మహిళలకు పట్టాలివ్వడాన్ని మహిళలే సవాలు చేయడం సందేహాస్పదంగా ఉందన్నారు. కుటుంబంలో మహిళలు లేకుంటే పురుషులకు పట్టాలు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని, ఇది తమ హామీ అని ఏజీ చెప్పారు. మహిళలు దరఖాస్తు చేయని కుటుంబాల్లో 77వేల మంది పురుషులకు పట్టాలు ఇచ్చామన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన మార్గదర్శకాలకు లోబడే మహిళలకు పట్టాలు ఇచ్చామని తెలిపారు. ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు భూ సేకరణ కోసం రూ.10 వేల కోట్లు, ఇళ్ల నిర్మాణానికి రూ.1,800 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లు లేవనెత్తని ఎన్నో విషయాలను సింగిల్ జడ్జి తన తీర్పులో ప్రస్తావించారన్నారు. ఇళ్ల పట్టాలు పొందిన వారి వాదనలు వినకుండానే ఏకపక్షంగా తీర్పునిచ్చారన్నారు. పేదలకు బంగ్లా కట్టించాలన్నది ప్రభుత్వ కల అని, అయితే ఆ కల ఆచరణ సాధ్యం కాదని వివరించారు. మహిళలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంలో ఎక్కడా ఎలాంటి వివక్ష గానీ, నిబంధనల ఉల్లంఘన గానీ జరగలేదని చెప్పారు. 24వీఐడబ్ల్యూ40: పడుగుపాడు వద్ద రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపడుతున్న సిబ్బంది -
విశాఖలో పేదలకు ఇళ్ల స్ధలాలు
-
గూడు.. గోడు..!
►అందని బిల్లులు..ఆగిన గృహాలు.. ►పేరుకుపోయిన రూ.30 కోట్ల బకాయిలు ►8 నెలలుగా నయాపైసా విడుదల చేయని ప్రభుత్వం ►ఆందోళనలో లబ్ధిదారులు కర్నూలు (అర్బన్) : గృహ వసతి లేని నిరుపేదలందరికి ఉచితంగా మూడు సెంట్ల ఇళ్ల స్థలాలను ఇచ్చి రూ.1.50 లక్షలతో అద్భుతమైన గృహాన్ని నిర్మించి ఇస్తామని ఎన్నికలకు ముందు తెలుగుదేశం కల్లబొల్లి మాటలు చెప్పింది. ఓట్లు దండుకొని అధికారాన్ని చేపట్టిన అనంతరం ఈ ఊసే ఎత్తడం లేదు. అలాగే పట్టణాలు, నగరాల్లో నివశించే పేదలు, మధ్య తరగతి వర్గాలకు అనుకూలమైన స్థలాల్లో కాలనీలు, తక్కువ ధరలో అపార్ట్మెంట్ల నిర్మాణం చేపడతామనే చంద్రన్న ఎన్నికల హామీ నేటికి కార్యరూపం దాల్చలేదు. రోజులు, నెలలు గడిచిపోతున్నా, ఒక్క కొత్త ఇల్లు కూడా మంజూరు చేయలేదు సరికదా, కనీసం కట్టుకున్న ఇళ్లకు కూడా బిల్లులను చెల్లించడం లేదు. గృహ నిర్మాణం పట్ల ఎలాంటి విధానపరమైన నిర్ణయాలను ప్రకటించలేదు. దీంతో గృహ నిర్మాణం పట్ల ప్రజలు నమ్మకాన్ని కోల్పోతున్నారు. నిషేధం ఎత్తివేత ఎప్పుడో... ఎన్నికల సాకుతో బిల్లుల చెల్లింపుపై గత ఏడాది మార్చి నెలలో విధించిన నిషేధాన్ని నేటికి ఎత్తి వేయలేదు. ఆన్లైన్ లెక్కల ప్రకారం జిల్లాలో పూర్తి అయిన, వేర్వేరు దశల్లో కొనసాగుతున్న ఇళ్లకు దాదాపు రూ.30 కోట్లను చెల్లించాల్సి వుంది. బిల్లుల కోసం లబ్ధిదారులు కార్యాలయాల చుట్టు తిరుగుతున్నా ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. అనేక మంది నిర్మాణాలను మధ్యలోనే ఆపేయగా, మరి కొంత మంది అప్పులు చేసి ఇళ్లను నిర్మించుకుంటున్నారు. కట్టుకున్న ఇళ్లకు బిల్లులు రాక, చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక నిరుపేదలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. వేర్వేరు దశల్లో ఆగిన 64,498 గృహాలు... రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణంలో వున్న గృహలకు బిల్లులను నిలిపివేయడంతో జిల్లాలో ఇందిరమ్మ మూడు విడతలు, జీఓ నెంబర్ 171, మూడు విడతల రచ్చబండ కార్యక్రమాల్లోని దాదాపు 64,498 గృహాలు వేర్వేరు దశల్లో కొనసాగుతుండగా, సగానికి పైగా ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది. అన్ని పథకాల్లో భాగంగా జిల్లాకు 3,84,273 గృహాలు మంజూరు అయ్యాయి. వీటిలో నేటికి బీబీఎల్ లెవెల్లో 9970, బీఎల్‌లో 31003, ఎల్ఎల్లో 4986, ఆర్‌ఎల్‌లో 18539 గృహాలు వున్నాయి. వీటన్నింటికి బిల్లులు చెల్లించాల్సి వుంది. ఆధార్ సీడింగ్, జియో ట్యాగింగ్‌తో కాలయాపన... జిల్లాలో వివిధ దశల్లో నిర్మాణంలో వున్న ఇళ్లకు బిల్లులు మంజూరు చేయకుండా, నిర్మించిన గృహాల్లో అవినీతి అక్రమాలను అరికట్టేందుకు అంటు ఆధార్ సీడింగ్, జియో ట్యాగింగ్ కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందనే విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో అవినీతి, అక్రమాలను నిగ్గుతేల్చడంలో ఎవరికి అభ్యంతరం లేదని, అయితే నిరుపేదలు నిర్మించుకుంటున్న గృహాలకు బిల్లులు మంజూరు చేయాలంటున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాలు, వరుస ఎన్నికలతో దాదాపు ఏడు నెలలుగా ఆగిపోయిన బిల్లులు, కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే విడుదల అవుతాయని ఆశించినా ఫలితం కనిపించకపోవడంతో నిరుపేద లబ్ధిదారులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గృహ నిర్మాణంపై దృష్టి సారించి బకాయి పడ్డ బిల్లులను విడుదల చేయాలని లబ్దిదారులు కోరుతున్నారు.