breaking news
Heavily
-
ముంబైలో భారీగా 2వేలనోట్లు పట్టివేత
-
భారీ అమ్మకాల్లో మోదీ పుస్తకం!
ప్రధానమంత్రి నరేంద్రమోదీని వ్యంగ్యాస్థాలతో కించిపరుస్తూ ఇటీవల మార్కెట్లో విడుదలైన పుస్తకం అమ్మకాలు భారీగా పెరిగిపోయాయట. 'ఫెకూజీ ఈజ్ ఇన్ ఢిల్లీ నౌ' పేరుతో కాంగ్రెస్ నాయకుడు జయేష్ షా రచించిన పుస్తకానికి అభిమానులు ఎక్కువైపోయారు. గుజరాత్ రాష్ట్రంలోనే కాక, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ లలో కూడ పుస్తకం అమ్మకాలు జోరుగా సాగిపోతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నాయకుడు జయేష్ షా మోదీపై వ్యంగ్యోక్తులు విసురుతూ రాసిన పుస్తకం మార్కెట్లో ప్రాచుర్యం పొందిందట. పలు రాష్ట్రాల్లో ఆ పుస్తకానికి భారీ అమ్మకాలు పెరిగినట్లు వార్తలొస్తున్నాయి. 'ఫెకూజీ ఈజ్ ఇన్ ఢిల్లీ నౌ' అంటూ ఎన్నికల సమయంలో మోదీ చేసిన వాగ్దానాలను నెరవేర్చకపోవడంపై జయేష్ షా ఈ పుస్తకాన్ని రాశారు. అయితే పుస్తకంలోని రచనలు ప్రధానమంత్రిని కించపరిచేలా ఉన్నాయని, దీన్ని వెంటనే నిషేధించాలని కోరుతూ బీజేపీ అభిమాని, సామాజిక కార్యకర్త నర్సింహు సోలంకి అనేవ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, దాన్ని అహ్మదాబాద్ సివిల్ కోర్టు కొట్టేయడం తెలిసిందే. తమ భావాలను తెలిపే హక్కు ప్రతివారికీ ఉంటుందని, పుస్తకంపై నిషేధం విధించడం సరికాదని, అలా చేస్తే వాక్ స్వాతంత్రంపై దాడి చేసినట్లే అవుతుందని న్యాయమూర్తి వివరణ కూడ ఇచ్చారు. అయితే మోదీపై వ్యంగ్యాస్థాలు సంధిస్తూ రాసిన ఆ పుస్తకం గురించి ముందు ఎవరికైనా తెలుసో లేదో గాని, కోర్టు సైతం అభ్యంతరాలను తోసి పుచ్చడంతో ఇప్పుడు ఆ పుస్తకానికి మార్కెట్లో భారీ డిమాండ్ పెరిగిపోయిందట. నిజంగా ఆ పుస్తకంలో ఇంకా ఏం రాశారో చదవాలన్న ఉత్కంఠత జనాల్లో పెరిగిపోయిందికాబోలు. -
‘మూడింతల’ దోపిడీ!
భవనాలకు ‘ఆక్యుపెన్సీ సర్టిఫికెట్’ లేదంటూ భారీగా విద్యుత్ చార్జీలు ఇది అక్రమమని హైకోర్టు, ఈఆర్సీ తేల్చినా పట్టించుకోని ఎస్పీడీసీఎల్ {పతి నెలా రూ.కోటికిపైగా అదనపు వసూళ్లు.. మూడేళ్లలో రూ.40 కోట్లు ఖాతాలోకి ‘ఆక్యుపెన్సీ’ని బూచిగా చూపి దండుకుంటున్న విద్యుత్ సిబ్బంది వినియోగదారుల నుంచి భారీగా మామూళ్లు.. ఇవ్వని వారికి ‘మూడింతల’ వాతలు హైదరాబాద్: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ డివిజన్ పరిధిలో ఉండే కె.పద్మజ అనే మహిళా వ్యాపారవేత్తకు ఏప్రిల్‌లో రూ.2,06,462 విద్యుత్ బిల్లు వచ్చింది. వాస్తవానికి ఆమెకు రావాల్సిన విద్యుత్ బిల్లు రూ.68,814 మాత్రమే.. మాదాపూర్‌కు చెందిన కె.వంశీ కట్టాల్సిన వాస్తవ చార్జీ.. రూ.48,068. కానీ ఇచ్చిన బిల్లు రూ.1,44,203.. ఇవేవీ సిబ్బంది పొరపాటుతోనో, సాంకేతిక తప్పిదాలతోనో వచ్చిన బిల్లులు కాదు. ఆయా భవనాలకు ‘ఆక్యుపెన్సీ’ సర్టిఫికెట్ లేదంటూ.. విద్యుత్ సంస్థలు చేస్తున్న నిలువు దోపిడీ! ముక్కుపిండి మరీ ఒకటికి మూడింతలు వసూళ్లు చేస్తున్న వ్యవహారమిది.. వేల మంది గృహ, వాణిజ్య వినియోగదారులపై గత మూడేళ్లుగా రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) ఇలా మూడింతల చార్జీల మోత మోగిస్తోంది. ఈ ‘ఆక్యుపెన్సీ’ వసూళ్లు అక్రమమని, దాన్ని ఆపేయాలని సాక్షాత్తు హైకోర్టు, ఈఆర్సీ ఆదేశించినా.. ఎస్పీడీసీఎల్ పట్టించుకోవడం లేదు. హైకోర్టునూ లెక్కచేయరా..?’ ‘ఆక్యుపెన్సీ’ బాగోతంపై కొందరు విద్యుత్ వినియోగదారులు హైకోర్టును ఆశ్రయించగా.. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేదంటూ మూడింతల చార్జీలు వసూలు చేయడం అక్రమమని స్పష్టం చేసింది. ఇప్పటికే వసూలు చేసిన అదనపు చార్జీలను సంబంధిత వినియోగదారుల భవిష్యత్ విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేయాలంటూ గత నవంబర్ 11న హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఇక రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) సైతం ఈ ‘ఆక్యుపెన్సీ’ వసూళ్లు అక్రమమని తేల్చి చెప్పింది. హైకోర్టు ఆదేశాలను గృహ వినియోగదారులతో పాటు ఇతర కేటగిరీల వినియోగదారులందరికీ వర్తింపజేయాలని డిసెంబర్ 20న ఎస్పీడీసీఎల్ను ఆదేశించింది. కానీ ఎస్పీడీసీఎల్ ఈ ఆదేశాలను బేఖాతరు చేసి ‘ఆక్యుపెన్సీ’ పేరిట అక్రమ చార్జీల మోతను కొనసాగిస్తోంది. భారీగా మోత.. ఎస్పీడీసీఎల్ ఈ మార్చిలో విద్యుత్ వినియోగానికి సంబంధించి ఏప్రిల్‌లో జారీ చేసిన బిల్లుల్లో సైతం ‘ఆక్యుపెన్సీ’ చార్జీల మోత మోగించింది. వాణిజ్య కేటగిరీలోని 7,974 మంది వినియోగదారుల వాస్తవ చార్జీల కింద రూ.13,41,068 వసూలు చేయాల్సి ఉండగా.. మూడురెట్లు పెంచి రూ.40,23,204కు బిల్లులను జారీ చేసింది. ఇదే రూపంలో గత నెలాఖరు వరకు గృహ, వాణిజ్య వినియోగదారుల నుంచి ప్రతి నెలా దాదాపు రూ. కోటి వరకు ‘ఆక్యుపెన్సీ’ చార్జీలను వసూలు చేసింది. మూడేళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారంతో ఎస్పీడీసీఎల్ ప్రజల నుంచి రూ.40 కోట్ల వరకు అధికంగా వసూలు చేసినట్లు అంచనా. విద్యుత్ సిబ్బంది దందా.. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ నిబంధనను ఆసరాగా తీసుకుని విద్యుత్ అధికారులు, సిబ్బందికి వసూళ్ల దందాకు తెరలేపారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేనందున ఇకపై మూడింతల చార్జీ కట్టాల్సిందేనని భవనాల యజమానులను బెంబేలెత్తిస్తూ.. అందినకాడికి దండుకుంటున్నారు. మామూళ్లు ఇవ్వనివారిపై మూడింతల చార్జీలను వడ్డిస్తున్నారు. మామూళ్లు ఇచ్చిన వారిని తప్పించి, ఆ స్థానంలో కొత్త వినియోగదారుల ను చేర్చి, మూడింతల చార్జీలు వేస్తున్నారు. తద్వారా లెక్కల్లో తేడాల్లేకుండా చూసుకుంటున్నా రు. ‘ఆక్యుపెన్సీ’ లేని జాబితా నుంచి ప్రతి నెలా వందల మంది పేర్లను తొలగించడం, వారి స్థానంలో కొత్తవారిని చేర్చుతుండడమే దీనికి నిదర్శనమనే అభిప్రాయం వస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో క్షేత్రస్థాయి నుంచి పైస్థాయి వరకు వాటాలు వెళుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఏంటి? ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అంటే నివాస యోగ్యత పత్రం. ఏదైన భవన నిర్మాణం పూర్తయిన తర్వాత అందులో ఉండడానికి ముందు సంబంధిత నగర, పురపాలక సంస్థ నుంచి ఈ పత్రాన్ని పొందాల్సి ఉంటుంది. పురపాలకశాఖ 2006లో అమల్లోకి తెచ్చిన ఏకీకృత భవన నిర్మాణ నియమావళి (జీవో నం.86)లో అక్రమ కట్టడాల నియంత్రణ కోసం కొన్ని నిబంధనలను పొందుపరిచారు. ‘ఆక్యుపెన్సీ ధ్రువపత్రం’ లేని కట్టడాలకు విద్యుత్, నీటి సరఫరా, డ్రైనేజీ అండ్ సీవరేజీ కనెక్షన్లపై మూడు రెట్ల చార్జీలను వసూలు చేయాలన్నది అందులో ఒకటి. అయితే వాస్తవానికి ప్రస్తుతం నగర, పట్టణ ప్రాంతాల్లోని 80 శాతం గృహాలకు నివాస యోగ్యత పత్రాలు లేకపోవడం గమనార్హం.