breaking news
hasina begum
-
హసీనాపై హత్యాభియోగాలు
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, మరో ఆరుగురిపై హత్యాభియోగాలు నమోదయ్యాయి. ఆరుగురిలో ఇద్దరు ఆమె కేబినెట్లో మంత్రులు, పదవి కోల్పోయిన పోలీస్ చీఫ్ తదితరులున్నారు. వీరు కోర్టు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని మంగళవారం అధికారులు తెలిపారు. ఈ నెల 5వ తేదీన పదవికి రాజీనామా చేసి, భారత్‌కు పలాయనమైన తర్వాత హసీనాపై నమోదైన మొదటి కేసు ఇదే. జూలైలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఘర్షణల్లో ఓ దుకాణం యజమాని అబూ సయ్యద్ మరణించారు.ఈ ఘటనపై ఢాకాలోని మహ్మద్‌పూర్ ఏరియాకు చెందిన అబూ సన్నిహితుడు అమిర్ హంజా షతిల్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయాలంటూ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ రాజేశ్ చౌదురి పోలీసులను ఆదేశించారని అధికారులు తెలిపారు. కాగా, ఫిర్యాదు చేసినందుకుగాను తనకు ఫ్రాన్స్ నుంచి బెదిరింపు కాల్ వచ్చిందని అనంతరం షతిల్ చెప్పారు. కాగా, హత్యాభియోగాలు నమోదైన మంత్రులిద్దరూ రహస్యంగా ఇప్పటికే దేశం వీడగా మిగతా పోలీసు అధికారుల ఆచూకీ తెలియడం లేదని చెబుతున్నారు. హిందువులతో యూనుస్ సమావేశం బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనుస్ మంగళవారం శక్తిపీఠాల్లో ఒకటిగా పేరుగాంచిన ప్రఖ్యాత ఢాకేశ్వరి ఆలయం ఆవరణలో హిందూమత పెద్దలతో సమావేశమయ్యారు. ప్రజలందరి హక్కులకు రక్షణ కలి్పస్తామని ఈ సందర్భంగా యూనుస్ హామీ ఇచ్చారు. దాడులకు కారకులను గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత పాలకుల విధానాలే దేశంలో ప్రస్తుత పరిస్థితులకు కారణమని ఆయన పేర్కొన్నారు.తమ ప్రభుత్వం పనితీరును బేరీజు వేసే ముందు సంయమనంతో వ్యవహరించాలని హిందూమత పెద్దలను ఆయన కోరారు. ‘అందరికీ సమాన హక్కులున్నాయి. అందరం ఒకే హక్కు ఉన్న ప్రజలం. మన మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు కలి్పంచవద్దు. దయచేసి, మాకు సహకరించండి ఓపిక పట్టండి. ఆ తర్వాత తీర్పు చెప్పండి. చేయగలిగి ఉండీ చేయడంలో విఫలమైతే మమ్మల్ని విమర్శించండి’అని యూనుస్ చెప్పినట్లు ‘ది డైలీ స్టార్’పేర్కొంది. -
ఇదీ రిమాండ్ రిపోర్టు!
-
ఇదీ రిమాండ్ రిపోర్టు!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ అనంతరం ఏమి జరిగింది.. పోలీసులు ఏయే వస్తువులు.. ఎంత డబ్బును స్వాధీనం చేసుకున్నారు. తదితర ప్రశ్నలు ఇంకా తలెత్తుతూనే ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు పేర్కొన్న రిమాండ్ రిపోర్ట్ ఇలా ఉంది. జరిగింది ఇలా.. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందిన ఓ రియల్టర్‌ను గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఫోన్ చేసి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు డిచ్పల్లి సీఐ తిరుపతయ్య నయీమ్ ఫోన్‌కాల్‌పై దృష్టి సారించాడు. ఈ క్రమంలో నయీమ్ షాద్‌నగర్‌లోని తన ఇంటికి వస్తున్నాడని తెలుసుకున్న సీఐ తిరుపతయ్య సిబ్బందితో నయీమ్ వాహనాన్ని వెంబడించాడు. అదే సమయంలో గ్రే హౌండ్స్ బలగాలను ముందుగానే నయీమ్ ఇంటి వద్దకు పంపించారు. నయీమ్ భార్య అసీనా బేగం, అక్క సలీమా బేగం ముందు హోండా అమేజ్ కారులో షాద్‌నగర్ ఇంటికి చేరుకున్నారు. వెనుక ఫోర్డ్ ఇండీవర్ కారులో నయీమ్ అతని అనుచరులు నలుగురితో కలసి షాద్‌నగర్ వస్తుండగా ఇంటీ సమీపంలోనే గ్రే హౌండ్స్ బలగాలు అడ్డుకున్నాయి. విషయం గ్రహించిన నయీమ్ పోలీసులపై కాల్పులు జరుపుతూ పారిపోవడానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన బలగాలు ఎదురు కాల్పులు జరుపగా నయీమ్ అక్కడికక్కడే మృతిచెందాడు. నయీమ్ వెంట ఉన్న అనుచరులు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. లభించిన వస్తువులు.. అనంతరం పోలీసులు నయీమ్ ఇంట్లో, బయట సోదాలు చేశారు. తుపాకులు, డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. సలీమా బేగం వద్ద ఒక స్టెన్‌గన్, అసీనా బేగం వద్ద రెండు ఏకే 47లు, అబ్దుల్ మతీన్ వద్ద రివాల్వర్, నయీమ్ వద్ద 1 పిస్టల్, 1 ఏకే 47తో పాటు మూడు మ్యాగజెన్లు స్వాధీనం చేసుకున్నారు. వెపన్ ఆర్మ్స్(బుల్లెట్లు) ఏకే 47వి 250, పిస్టల్‌వి 132, రివాల్వర్‌వి 60, చిన్న రివాల్వర్‌వి 80, 3.8 రివాల్వర్‌వి 50 స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా 17 సెల్ఫోన్లు, 54 ఒరిజినల్ డాక్యుమెంట్లు, లింకు డాక్యుమెంట్లు 121 వరకు స్వాధీనం చేసుకున్నారు. జిలిటెన్ స్టిక్స్, డిటోనేటర్లతో పాటు రూ. 3,74,660 నగదు, ఐదున్నర తులాల బంగారం, హోండా అమేజ్, ఫోర్ట్ ఇండీవర్ కారు, ఒక స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన డాక్యుమెంట్లకు సంబంధించి మార్కెట్లో వాటి విలువ రూ.14 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. భువనగిరి, గడ్డి అన్నారం, జూపార్కు, శంషాబాద్, దిల్సుఖ్నగర్ ప్రాంతాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నట్లు సమాచారం.