హమాలీలకు సమగ్ర చట్టం చేయాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్) : హమాలీలకు సమగ్రమైన చట్టం చేయాలని తెలంగాణ ప్రగతిశీల హమాలీ, మిల్లర్స్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్ డిమాండ్ చేశారు. శనివారం యూనియన్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని, కార్మికులను విస్మరించిందని ఆరోపించారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీన చేపట్టనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నర్సిములు, శేఖర్,సతీష్, రాము, మోగులయ్య, అంజిలయ్య, గోపాల్, బాలయ్య, చెన్నయ్య, చంద్రకళా, మణెమ్మ, నీరజా, లక్ష్మమ్మ, బాగ్యమ్మ, కష్ణ, వెంకటేశ్ పాల్గొన్నారు.