breaking news
Gurnadha reddy
-
చంద్రబాబు డైరెక్షన్లోనే టీడీపీ దాడులు'
అనంతపురం: టీడీపీ దాడులపై ఆదివారం అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్రపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే దాడులు జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఈ దాడుల నేపథ్యంలో అనంతపురం జిల్లాలో ధర్నా చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ దౌర్జన్యాలను నిరసిస్తూ అనంతపురం జిల్లాలో నేడు వైఎస్ జగన్ ధర్నా చేయనున్నట్టు వెల్లడించారు. అయితే వైఎస్ జగన్ ధర్నాను భగ్నం చేసేందుకు పోలీసులు, టీడీపీ నేతలు కుట్ర పన్నుతున్నారంటూ అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ దౌర్జన్యాలను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, వై. విశ్వేశ్వర్ రెడ్డి ఎండగట్టారు. తాగుబోతులతో వైఎస్ జగన్ యాత్రకు ఆటంకం కలిగించే యత్నం చేస్తున్నారంటూ వారు దుయ్యబట్టారు. చంద్రబాబు దౌర్జన్యాలపై పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నిర్వాకం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. రైతుల్లో మనోస్థైరం కల్పించేందుకు వైఎస్ జగన్ చేస్తున్న రైతు భరోసా యాత్రను టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని గుర్నాథ్ రెడ్డి విమర్శించారు. -
ప్రసాదరెడ్డిది కచ్చితంగా రాజకీయ హత్యే..
రాప్తాడు(అనంతపురం): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రసాద్ రెడ్డిది కచ్చితంగా రాజకీయ హత్యేనని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి అన్నారు. టీడీపీ నేతలు ఎమ్మార్వో కార్యాలయాన్ని ఆక్రమించుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కార్యాలయాలు ఆపార్టీ నేతలకు అడ్డాగా మారాయని గుర్నాథరెడ్డి విమర్శించారు. కాగా రాప్తాడు ఎమ్మార్వో కార్యాలయంలో ప్రసాద్ రెడ్డిపై దుండగులు వేటకొడవళ్లతో దాడి చేసి పాశవికంగా హతమార్చిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న గుర్నాథరెడ్డి హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్‌రెడ్డి మృతదేహాన్ని చూసి ఆయన కంటతడి పెట్టారు. గతంలో తనకు ప్రాణహాని ఉందని ప్రసాద్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని గుర్నాధరెడ్డి ఆరోపించారు.మరోవైపు ప్రసాద్‌రెడ్డి హత్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. వైఎస్ఆర్ సీపీ నేతలపై దాడులు, హత్యలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.