సర్కార్ సై.. తగ్గిన గుజ్జర్లు
జైపూర్: ఎట్టకేలకు గుజ్జర్లు తమ ఆందోళణ విరమించుకున్నారు. ప్రభుత్వంతో తాము జరిపిన చర్చలు విజయవంతం కావడంతో ఎనిమిది రోజులుగా చేస్తున్న ఆందోళనకు తెరదించారు. మొత్తానికి ప్రభుత్వం మెడలు వంచి వారి డిమాండ్ సాధించుకున్నారు. చివరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో తమకు ఐదుశాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదిస్తామని హామీ ఇవ్వడంతో గుజ్జర్లు తమ ఆందోళన ఆపేశారు. గుజ్జర్ల ఆందోళన కారణంగా తీవ్ర ప్రభావం పడింది. పూర్తిగా రవాణ వ్యవస్థ స్తంభించిపోయింది. ముఖ్యంగా రైల్వే వ్యవస్థ దీని ప్రభావం అధికంగా పడింది. రోజుకు దాదాపు రూ.25 కోట్ల రూపాయల నష్టం ఏర్పడింది. దీంతో చివరకు దిగొచ్చిన ప్రభుత్వం చర్చలకు పిలిచి విజయం సాధించింది.