breaking news
Gsat-19
-
నిర్దేశిత కక్ష్యలోకి జీశాట్ –19
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జీఎస్ఎల్వీ మార్క్ 3 డీ 1 రాకెట్ ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన జీశాట్–19 ఉపగ్రహాన్ని నాలుగు విడతలుగా కక్ష్య దూరాన్ని పెంచుకుంటూ శనివారం భూమికి 36 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఉపగ్రహం లామ్ ఇంజిన్‌లోని 1,742 కిలోల ఇంధనాన్ని రెండు విడతలుగా వినియోగించి కక్ష్య దూరాన్ని పెంచారు. 8వతేదీ వేకువజామున 2.03 గంటలకు 116 సెకన్ల పాటు ఒకసారి, మళ్లీ అదేరోజు సాయంత్రం 3.44 గంటలకు 5,538 సెకన్ల పాటు లామ్ ఇంజిన్లను రెండోసారి మండించి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంచారు. ఈనెల 5వతేదీన సాయంత్రం 5.28 గంటలకు షార్ నుంచి జీఎస్ఎల్వీ మార్క్3 డీ1 రాకెట్ ద్వారా రోదసిలోకి పంపిన జీశాట్–19 ఉపగ్రహాన్ని 170 కిలోమీటర్లు పెరిజీ (భూమికి దగ్గరగా), 35,975 కిలోమీటర్లు అపోజీ (భూమికి దూరంగా) ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. హసన్‌లోని నియంత్రణ కేంద్రం(ఎంసీఎఫ్) ఉపగ్రహాన్ని తమ అదుపులోకి తీసుకుని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టే ప్రక్రియను చేపట్టింది. శనివారం ఉదయం 7.59 గంటలకు నాలుగోసారి అంటే ఆఖరి విడతగా 488 సెకెన్ల పాటు ల్యామ్ ఇంజిన్లు మండించి ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా స్థిరపరిచారు. ఉపగ్రహం కక్ష్యలోకి చేరిన తరువాత సోలార్ ప్యానెల్స్ విచ్చుకుని చక్కగా పనిచేస్తోందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ ఉపగ్రహం సుమారు పదేళ్ల పాటు సేవలను అందిస్తుంది. -
జూన్ 5న జీఎస్ఎల్వీ మార్క్–3 ప్రయోగం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): జీఎస్ఎల్వీ మార్క్–3 ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెల ఐదున శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి దీన్ని ఇస్రో ప్రయోగించనుంది. ఈ నేపథ్యంలో షార్‌లోని రెండో ప్రయోగ వేదికకు అనుసంధానంగా ఉన్న సాలిడ్ స్టేజ్ అసెంబ్లింగ్ బిల్డింగ్ (ఎస్‌ఎస్‌ఏబీ) మూడు దశల రాకెట్ అనుసంధానాన్ని బుధవారం పూర్తి చేశారు. ఎస్‌ఎస్‌ఏబీ నుంచి రాకెట్‌ను ప్రయోగవేదిక మీద అనుసంధానం చేసేందుకు వెహి కల్ మూమెంట్ కార్యక్రమాన్ని ఈ నెల 27న చేపట్టనున్నారు. ఈ రాకెట్ ద్వారా 4.5 టన్నుల బరువు కలిగిన జీశాట్–19ను రోదసీలోకి పంపనున్నారు. ఇదిలా ఉండగా షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ–38ను జూన్ 23న ప్రయోగించేందుకు ఇస్రో నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పీఎస్ఎల్వీ రాకెట్‌లోని రెండో దశను అనుసంధానం చేసే ప్రక్రియను గురువారం పూర్తి చేశా రు. కాగా, జీఎస్ఎల్వీ మార్క్–3 ప్రయోగం జూన్ 5న ముగియగానే ఎస్ఎస్ఏ బీలో పీఎస్ఎల్వీ సీ–39 రాకెట్ క్యాంపైన్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తు న్నారు. తద్వారా జూన్‌లో ఇస్రో శాస్త్రవేత్తలు 3 ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు.