breaking news
Government Advisor Vivek
-
అంబేడ్కర్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ లెజిస్లేటర్లు, పార్లమెంటేరియన్ల ఫోరమ్ ఆధ్వర్యంలో డాక్టర్ అంబేడ్కర్ చాంబర్ ఆఫ్ కామర్స్(డాక్) పేరుతో జాతీయ స్థాయిలో ఒక నూతన వేదిక ఏర్పాటైంది. ఢిల్లీలో మంగళవారం డాక్ ప్రారంభసభలో డాక్ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు జి.వివేకానంద ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి దళిత పారిశ్రామిక వేత్తలు, ఎస్సీ, ఎస్టీ లెజిస్లేటర్లు, పార్లమెంటేరియన్ల ఫోరం సభ్యులు హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామిక వేత్తలుగా తయారుచేయడం ఈ చాంబర్ ఉద్దేశమని వివేక్ మీడియాకు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల అభివృద్ధికి పథకాలు అమలుచేస్తున్నా సరైన ప్రచారం లేకపోవడం వల్ల ఉపయోగించుకోలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ చాంబర్ ద్వారా ఔత్సాహిక దళిత పారిశ్రామిక వేత్తలకు శిక్షణ ఇచ్చి, ప్రభుత్వాలతో చర్చించి దళితుల అభివృద్ధికి కృషిచేయనున్నట్టు తెలిపారు. -
వేతనం తీసుకోకుండా పనిచేస్తా: వివేక్
సాక్షి, హైదరాబాద్: తనకు నెలసరి వేతనం వద్దని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి.వివేక్ ప్రభుత్వానికి లేఖ రాశారు. జీతం, హెచ్ఆర్ఏ లేకుండానే సలహాదారుగా కొనసాగేందుకు సమ్మతి తెలిపారు. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా ఉన్న వివేక్ నియామక ఉత్తర్వుల్లో ప్రభుత్వం పలు సవరణలు చేస్తూ బుధవారం జీవో నం.468ను జారీ చేసింది. నెల జీతం రూ.లక్ష, హెచ్ఆర్ఏ రూ.50 వేలను మినహాయిస్తున్నట్లు ఇందులో స్పష్టం చేసింది. నెలసరి కన్వేయెన్స్ అలవెన్స్ రూ.30 వేలు, ఇంధన ఖర్చు రూ.15 వేలు చెల్లిస్తా మని నిబంధనల్లో మార్పులు చేసింది. మెడికల్ రీయింబర్స్మెంట్ కల్పించింది.