breaking news
	
		
	
  Gouse Mohiddin
- 
  
    
                
      గౌస్ కేసు నీరుగార్చేందుకు ప్రయత్నాలు?
 - 
      
                    
గౌస్ కేసు నీరుగార్చేందుకు ప్రయత్నాలు?

 ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసిన లెక్చరర్ గౌస్ కేసును నీరుగార్చేందుకు పెద్ద స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. గౌస్ కేసును సీఐడీకి బదలాయిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. హుటాహుటిన సీఐడీ అదనపు డీజీకి గౌస్ కేసు ఫైళ్లను అప్పగించాలని ఆదేశించారు. డీజీపీ ఆదేశాలతో కేసు ఫైళ్లన్నింటినీ పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు సీఐడీ డీజీకి అప్పగించారు.
 
 ఇప్పటికే సీనియర్ ఐపీఎస్ అధికారులతో గౌస్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి సందర్భంలో కేసును సీఐడీకి బదలాయించడంపై పలు అనుమానాలు తలెత్తాయి. ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసం చేసిన కేసులో లెక్చరర్ గౌస్ మొహిద్దీన్ అరెస్టయ్యి రిమాండులో ఉన్న విషయం తెలిసిందే. గౌస్ దాఖలుచేసుకున్న బెయిల్ పిటిషన్‌పై కోర్టులో బుధవారం విచారణ జరిగే అవకాశం ఉంది. - 
      
                   
                               
                   
            లెక్చరర్ నివాసంలో పోలీసులు ముమ్మర తనిఖీలు

 ఏలూరు: సీఆర్ రెడ్డి కళాశాల లెక్చరర్ గౌస్‌మొహిద్దీన్ నివాసంలో గత రాత్రి నుంచి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో రియల్ ఎస్టేట్‌కు వ్యాపారానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన నివాసంలో గురువారం ఉదయం కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. 
 ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తానంటూ ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఓ నిరుద్యోగి నుంచి లెక్చరర్ గౌస్‌మొహిద్దీన్ రూ. 15 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఎస్సై ఉద్యోగం ఇప్పించకపోవడంతో సదరు నిరుద్యోగి గౌస్మొహిద్దీన్పై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. ఆ క్రమంలో తీసుకున్న మొత్తం నగదులో రూ. 3 లక్షలు తిరిగి నిరుద్యోగికి ఇచ్చేశాడు. మిగత సొమ్ము కూడా ఇవ్వాలని నిరుద్యోగి డిమాండ్ చేశాడు. అందుకు గౌస్ ససేమిరా అనడంతో... సదరు నిరుద్యోగి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు సర్చ్ వారెంట్‌తో గౌస్ నివాసాన్ని తనిఖీలు నిర్వహిస్తున్నారు.
 అదికాక ఒంగోలు పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటవుతుందంటూ రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడినట్లు గౌస్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే సీనియర్ ఐపీఎస్ అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. దీనిని అసరాగా చేసుకుని ఎస్ఐ, సీఐ బదిలీలు, ప్రమోషన్లలో గతంలో గౌస్ కీలక పాత్ర షోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీఆర్ రెడ్డి కాలేజీలో గౌస్‌మొహిద్దీన్ పొలిటికల్ సైన్స్ లెక్చరర్‌గా పని చేస్తున్నారు. 


