breaking news
Godavari river basins
-
గోదావరి గట్లు.. ఇక దిట్టంగా..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వరదల వేళ గోదావరి నది పరీవాహక ప్రాంతాల ప్రజలు నిశ్చింతగా జీవించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత పాలకుల నిర్లక్ష్యంతో గాలికొదిలేసిన ఔట్‌ఫాల్ స్లూయిజ్‌లు, పంట కాలువ గట్లు, డ్రెయిన్ల గట్లను పటిష్టం చేయాలని నిర్ణయించింది. దాదాపు పదిహేనేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పనులు తప్ప.. తరువాత వచ్చిన పాలకులెవరూ వీటి జోలికి పోలేదు. గోదావరి వరదలతో ముప్పు పొంచి ఉందని తెలిసినా నిర్లక్ష్యం చేశారు. ఫలితంగానే గత నెల వరదలు పరీవాహక ప్రాంతాలతో పాటు గోదావరి లంకల్లోని ప్రజలకు కంటిపై కునుకు లేకుండా చేశాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో అధికారులు నిత్యం అప్రమత్తంగా వ్యవహరించడంతో కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాలకు ముప్పు తప్పింది. ఇటీవల ఆయన స్వయంగా ముంపు బాధిత లంకల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ పర్యటించి, పరిస్థితులు తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఆ సందర్భంలోనే తక్షణం పటిష్టం చేయాల్సిన కాలువ, డ్రెయిన్ గట్లపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పలు మండలాల్లో 23 పనులు అత్యవసరమని గుర్తించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పనులకు రూ.5 కోట్లు మంజూరు చేశారు. పునరావృతం కాకుండా.. గత నెలలో వచ్చిన వరదలతో ఎదురైన కష్టాలు భవిష్యత్తులో ఎదురు కాకుండా అత్యవసర పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఔట్‌ఫాల్ స్లూయిజ్‌లకు లీకేజీలు ఏర్పడి, భారీగా వరదలు వస్తే గట్లు కొట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉంది. అందుకే తాజా పనుల్లో వాటికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇటీవలి వరదలతో గోదావరి పాయల నుంచి నీరు పోటెత్తి పంట కాలువలపై నుంచి పొంగి ప్రవహించి, లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. దెబ్బ తిన్న డ్రైన్ గట్ల వల్ల కూడా దాదాపు ఇదే పరిస్థితి ఏర్పడింది. దీనిని గుర్తించిన ప్రభుత్వం.. తాజా పనుల్లో వీటికి ప్రాధాన్యం ఇచ్చింది. ధవళేశ్వరం హెడ్ వర్క్స్ పరిధిలో.. సఖినేటిపల్లి మండలం గొంది వశిష్ట ఎడమ గట్టు, గోడి అవుట్‌ఫాల్ స్లూయిజ్ మరమ్మతులకు రూ.22 లక్షలు. గోడి వశిష్ట ఎడమ గట్టు నొవ్వ అవుట్‌ఫాల్ స్లూయిస్జ్కు రూ.18 లక్షలు. మామిడికుదురు మండలం లూటుకుర్రు వైనతేయ కుడిగట్టు వాడబోది అవుట్‌ఫాల్ స్లూయిజ్ పునర్నిర్మాణానికి రూ.8 లక్షలు. ఆదుర్రు – వైనతేయ కుడిగట్టు బచ్చలబండ అవుట్‌ఫాల్ స్లూయిజ్ రక్షణకు రూ.5 లక్షలు. గోగన్నమఠం వైనతేయ కుడిగట్టు కడలి అవుట్‌ఫాల్ స్లూయిజ్ రక్షణకు రూ.8 లక్షలు. పి.గన్నవరం మండలం వైనతేయ ఎడమ గట్టున కె.ముంజవరం అవుట్‌ఫాల్ స్లూయిజ్ పరిధిలో కోతకు గురైన కట్ట మరమ్మతులకు రూ.10 లక్షలు. ఐ.పోలవరం మండలం పాత యింజరం వద్ద అవుట్‌ఫాల్ స్లూయిజ్ రక్షణకు రూ.40 లక్షలు. జి.మూలపొలం అవుట్‌ఫాల్ స్లూయిజ్ పునర్నిర్మాణానికి రూ.28 లక్షలు. కేశనకుర్రు పీఐపీ వరద గట్టుపై అవుట్‌ఫాల్ స్లూయిజ్ పునర్నిర్మాణానికి రూ.45 లక్షలు. కాట్రేనికోన మండలం గొల్లగరువు అవుట్‌ఫాల్ స్లూయిజ్ రక్షణకు రూ.38 లక్షలు. ఐ.పోలవరం మండలం గుత్తెనదీవి షట్టర్ల మరమ్మతులకు రూ.16 లక్షలు. గౌతమి కుడి గట్టుపై ప్రధాన అవుట్‌ఫాల్ స్లూయిజ్ స్క్రూ గేరింగ్, షట్టర్ మరమ్మతులకు రూ.44 లక్షలు. గోదావరి సెంట్రల్ డివిజన్లో.. 1986 వరద స్థాయికి అనుగుణంగా అన్నంపల్లి అక్విడెక్ట్ వద్ద ఇరువైపులా ఐ.పోలవరం కుడి కాలువ గట్టు బలోపేతానికి రూ.40 లక్షలు. అన్నంపల్లి అక్విడెక్ట్‌కు ఇరువైపులా ఐ.పోలవరం ఎడమ కాలువ గట్టు బలోపేతానికి రూ.25 లక్షలు. అనాతవరం బ్రాంచి కెనాల్‌పై 0.80 కిలోమీటర్ వద్ద కల్వర్టు నిర్మాణానికి రూ.15 లక్షలు. గన్నవరం ప్రధాన కాలువపై వరద గేట్లు, గన్నవరం అక్విడెక్ట్ రెయిలింగ్ మరమ్మతులకు రూ.80 లక్షలు. రాజోలు, అమలాపురం డ్రైనేజీ సబ్ డివిజన్లలో.. ఇందుపల్లి ఎగువ కౌశిక మీడియం డ్రెయిన్ ఎడమ గట్టుకు రూ.6 లక్షలు. బండారులంక ఎగువ కౌశిక కుడి ప్రధాన డ్రెయిన్Œ కుడి గట్టుకు రూ.4 లక్షలు. సాకుర్రు మేజర్ డ్రెయిన్Œపై గట్లకు రూ.12 లక్షలు. బండారులంక ఎగువ కౌశిక మీడియం డ్రెయిన్ కుడిగట్టుకు రూ.10 లక్షలు. సాకుర్రు గున్నేపల్లి, సాకుర్రు మేజర్ డ్రెయిన్ గట్లకు రూ.10 లక్షలు. రాజోలులో నామనపాలెం మీడియం డ్రెయిన్, కోతకు గురైన ఒడ్డుకు రూ.15 లక్షలు. పొన్నమండ–2 డ్రెయిన్ అవుట్‌ఫాల్ స్లూయిజ్ షట్టర్ల మరమ్మతులకు రూ.5 లక్షలు. త్వరలో పనులు మొదలుపెడతాం ఈ రోజే పనులకు ఆమోదం తెలియచేశాం. వీటిని అత్యవసరంగా చేపట్టాల్సి ఉంది. వివిధ శాఖలు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని, వరదల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ పనులకు ఆమోదం తెలియజేశాం. వీటితో పాటు శాశ్వత ప్రాతిపదికన చేపట్టే పనులు కూడా మరికొన్ని ఉన్నాయి. ప్రభుత్వం మంజూరు చేసిన ఈ నిధులతో ముందుగా అత్యవసర పనులు చేపడుతున్నాం. ఈ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలనుకుంటున్నాం. త్వరలో టెండర్లు కూడా పిలిచి పనులు వేగవంతం చేస్తాం. – హిమాన్షు శుక్లా, కలెక్టర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అత్యవసర పనులు చేపడుతున్నారు కలెక్టర్ ఆదేశాల మేరకు అత్యవసర పనులను ప్రతిపాదించాం. గోదావరి హెడ్‌వర్క్స్ డివిజన్లో ఇవి చాలా కీలకమైనవి. ఇటీవలి వరదలతో గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అవుట్‌ఫాల్ స్లూయిజ్‌లు, వాటి షట్టర్లు పటిష్టమైతే వరదల సమయంలో ప్రమాదాలను చాలా వరకూ నియంత్రించవచ్చు. ఇందుకు తగ్గట్టుగానే ఈ పనులు మొదలు పెట్టనున్నాం. – ఆర్.కాశీవిశ్వేశ్వరరావు, ఈఈ, గోదావరి హెడ్‌వర్క్స్, ధవళేశ్వరం నిధుల కేటాయింపు ఇలా.. అవుట్‌ఫాల్ స్లూయిజ్‌లకు : రూ.2.82 కోట్లు పంట కాలువ గట్ల రక్షణకు : రూ.1.60 కోట్లు డ్రెయిన్ల గట్ల పటిష్టతకు : రూ.62 లక్షలు -
6లోగా అదనపు సమాచారమివ్వండి
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీబేసిన్ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లపై ఇతర సమాచారంగానీ, పరిశీలనలనుగానీ తమకు అక్టోబర్ 6వ తేదీలోగా సమర్పించాలని తెలంగాణకు గోదావరి బోర్డు సూచించింది. ఈలోగా అందించిన సమాచారం మేరకే ప్రాజెక్టుల అనుమతుల విషయమై ముందుకు వెళతామని, ఎలాంటి అదనపు సమాచారం ఇవ్వకుంటే తెలంగాణ తరఫున చెప్పడానికి అదనంగా ఏమీ లేదన్నట్లుగానే భావిస్తామని బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు రెండ్రోజుల కిందట బోర్డు సభ్యకార్యదర్శి బీపీ పాండే ఒక్కో ప్రాజెక్టుపై విడివిడిగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. సీతారామ, తుపాకులగూడెం, చిన్న కాళేశ్వరం, మోదికుంటవాగు, చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల, చనాకా–కొరట ప్రాజెక్టుల డీనీఆర్‌లను తెలంగాణ ఇదివరకే సమర్పించగా, దీనిపై బోర్డు స్క్రూటినీ మొదలుపెట్టింది. ఒక్కో ప్రాజెక్టుకు కేటాయించిన నీరు, ప్రాజెక్టు వ్యయం, వృధ్ధిలోకి తెచ్చే ఆయకట్టుతోపాటు తాగు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించనున్న వివరాలను రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌లలో వివరించింది. అయితే సీతారామసహా కొన్ని ప్రాజెక్టులపై గోదావరి బోర్డు అదనపు సమాచారం కోరింది. సీతారామ ప్రాజెక్టు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టుకు నీటి లభ్యత తగ్గే అవకాశాలున్నాయా అంటూ పలు ప్రశ్నిలు సంధించినట్లు తెలిసింది. దీంతోపాటే చనాకా–కొరటకు సంబంధించి మహారాష్ట్రకు దక్కే జలాలు, ఆ ప్రాంతంలో ఆయకట్టు వివరాలను సేకరించినట్లుగా తెలిసింది. తాము కోరుతున్న సమాచారంతోపాటు ఇతరత్రా ఎలాంటి సమాచారాన్నైనా అక్టోబర్ 6లోగా తమకు అం దించాలని కోరింది. ఈ వివరాలను సైతం పరిశీలనలోకి తీసుకొని డీపీఆర్‌లను మదింపు చేస్తామని తెలిపింది. చనాకా–కొరటపై సీడబ్ల్యూసీకి ప్రజెంటేషన్ చనాకా–కొరట ప్రాజెక్టుపై శుక్రవారం హైదరాబాద్‌లోని కేంద్ర జలసంఘం ఇంజనీర్లకు ఆదిలాబాద్ సీఈ శ్రీనివాస్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బ్యారేజీ నిర్మాణం, ఇప్పటివరకు చేసిన పనులు, వ్యయం, భూసేకరణ, మహారాష్ట్ర సహకారం, తెలంగాణ, మహారాష్ట్రలో వృద్ధిలోకి వచ్చే ఆయకట్టు తదితరాలపై వివరణ ఇచ్చారు. 28న కృష్ణా బోర్డు సబ్ కమిటీ మరోమారు భేటీ గెజిట్ నోటిఫికేషన్ అంశాల అమలుపై చర్చించేందుకు కృష్ణాబోర్డు సబ్‌కమిటీ మంగళవారం మరోమారు భేటీ కానుంది. ప్రాజె క్టుల సమాచారం, సిబ్బంది, భద్రత వంటి అంశాలపై కమిటీ చర్చించనుంది. తెలంగాణ ఇప్పటికే కొంత సమాచారాన్ని బోర్డుకు అందించగా, మరికొంత సమాచారాన్ని మం గళవారం నాటి భేటీలో సమర్పించనుంది. -
మళ్లింపు జలాల లెక్క తేలుస్తారా?
పట్టిసీమ, పోలవరం వాటాలపై చర్చించనున్న బజాజ్ కమిటీ సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తూ ఆంధ్రప్రదేశ్ చేపట్టి న పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులతో.. ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటాల అంశం మళ్లీ చర్చనీయాంశమైంది. గతేడాది పట్టిసీమ ద్వారా ఏపీ చేసిన వినియోగంలో వచ్చే వాటాలు ఇప్పటికీ తేలకపోవడం, ఈ ఏడాది మళ్లీ వినియోగాన్ని ప్రారంభించడం తెలం గాణకు మంట పుట్టిస్తోంది. ఈ ఏడాదైనా వాటాలు తేల్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి పెంచింది. ఈ నేపథ్యంలో వివాదాన్ని తేల్చేందుకు కేంద్ర జల వనరుల శాఖ ఏర్పాటు చేసిన ఏకే బజాజ్ కమిటీ గడువును మరో ఆరు నెలలు పొడగించడం, ఆ కమిటీ వచ్చే నెల మొదటి వారం రాష్ట్రం లో పర్యటించనుండటంతో మళ్లింపు లెక్కలు తేలుతాయా అనేది ప్రశ్నార్థంగా మారింది. ఏటా వాటర్ ఇయర్‌కు ముందుగా అపెక్స్ కౌన్సిల్ సమావేశాలను నిర్వహిస్తూ వస్తున్నా ఇంతవరకు గోదావరి మళ్లింపు జలాల వివా దం తేలలేదు. ఈఏడాది ఫిబ్రవరిలో ఒకసా రి రాష్ట్రానికి కమిటీ రాగా.. పట్టిసీమ, పోల వరం ప్రాజెక్టుల ద్వారా ఎగువ రాష్ట్రానికి దక్కే 90 టీఎంసీల వాటాలో గరిష్టంగా 73 (పోలవరం 43 టీఎంసీలు, పట్టిసీమ 30 టీఎంసీలు) టీఎంసీలు తమకు దక్కేలా చూడాలని తెలం గాణ కోరింది. కమిటీ స్పందిస్తూ, మళ్లింపు జలాల అంశం తమ పరిధిలో లేదని, ఇది ట్రిబ్యునళ్లు తేల్చాల్సి ఉందని చెతులెత్తేసింది. దీనిపై అభ్యంతరం తెలిపిన తెలంగాణ.. కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీంతో బజాజ్ కమిటీతో కేంద్రం చర్చించి మళ్లింపు జలాలపై మధ్యేమార్గాన్ని సూచించాలని ఆదేశించింది.