breaking news
gnana saraswati
-
కోటీకి జ్ఞాన సరస్వతి విశిష్ట పురస్కారం
ప్రముఖ సినీ, సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు సాలూరు కోటేశ్వరరావుకు జ్ఞాన సరస్వతి విశిష్ట పురస్కారాన్ని ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి గురువారం ప్రదానం చేశారు. కోలగట్ల మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శారదా సేవా సంఘం ఆధ్వర్యంలో సంగీత దర్శకుడు కోటిని గౌరవించుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. పురస్కార గ్రహీత కోటి మాట్లాడుతూ.. విజయనగరంలో జ్ఞాన సరస్వతి విశిష్ట పురస్కారం లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో గాయకుడు మధుబాబు, శారదా సేవా సంఘం అధ్యక్షుడు జి.శ్రీనివాస్, చెరుకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
బాసరలో పోటెత్తిన భక్తులు
అదిలాబాద్: అదిలాబాద్ జిల్లా బాసరలో కొలువైన జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతమంతా జనసంద్రంగా మారి పోయింది. ప్రస్తుతం అమ్మవారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.