breaking news
Gaus mohiuddin
-
ఆసుపత్రిలోనే లెక్చరర్‌ను విచారిస్తున్న పోలీసులు
ఏలూరు: చీటింగ్ కేసులో కటకటాలపాలైన సీఆర్ రెడ్డి కళాశాల లెక్చరర్ గౌస్ మొయిద్దీన్‌ను ఎట్టకేలకు జిల్లా పోలీసులు శుక్రవారం కస్టడీలోకి తీసుకున్నారు. వైద్యులు, లాయర్ల సమక్షంలో గౌస్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలోని స్పెషల్ రూంలో గౌస్‌ను పోలీసులు విచారిస్తున్నారు. తనకు తీవ్ర అనారోగ్యంగా ఉదంటూ గురువారం అటు పోలీసులను, ఇటు వైద్యులను ముప్ప తిప్పలు పెట్టిన గౌస్‌ను శుక్రవారం ఉదయం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. గౌస్ మొయిద్దీన్ స్థానిక సీఆర్ రెడ్డి కళాశాలలో పోలిటికల్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ఆయన పోలీసు ఉన్నతాధికారులో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడు. అయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వారి వద్ద నుంచి భారీ ఎత్తున్న నగదు తీసుకునే వాడు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పలు మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉద్యోగం ఇప్పించకుండా నగదు అడిగితే బెదిరించడంతో పలువురు నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించార. ఈ నేపథ్యంలో అక్టోబర్ 23న పోలీసులు గౌస్ నివాసంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా పలు విలువైన డాక్యుమెంట్లుతోపాటు నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
లెక్చరర్ కేసులో హైడ్రామా
-
లెక్చరర్ కేసులో హైడ్రామా
ఏలూరు: చీటింగ్ కేసులో కటకటాలపాలైన సీఆర్ రెడ్డి కళాశాల లెక్చరర్ గౌస్ మొయిద్దీన్ కేసులో హైడ్రామా చోటు చేసుకుంది. గౌస్ మొయిద్దీన్ కస్టడీలోకి తీసుకునే ముందు వైద్య పరీక్షలు నిమిత్తం పోలీసులు గురువారం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాదాపు మూడు గంటలపాటు గౌస్‌కు ఆసుపత్రిలో వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. మరింత మెరుగైన వైద్య పరీక్షల కోసం గౌస్‌ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని స్థానిక ఆసుపత్రి వైద్యులు పోలీసులకు సూచించారు. గౌస్‌ను గుంటూరు తరలిస్తే కస్టడి సమయం పూర్తిగా వైద్య పరీక్షలకే సరిపోతుందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో పోలీసులు మళ్లీ మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించనున్నారు. గౌస్ కస్టడీలోకి తీసుకునేందుకు తమకు మరింత సమయం కావాలని పోలీసులు మేజిస్ట్రేట్‌కు విన్నవించనున్నారు. గౌస్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి.... ఈ రోజు సాయంత్రం నుంచి నవంబర్ 1 వతేదీ వరకు కస్టడీలోకి తీసుకోవాలని జిల్లా మేజిస్ట్రేట్ పోలీసులను బుధవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. గౌస్ మొయిద్దీన్ స్థానిక సీఆర్ రెడ్డి కళాశాలలో పోలిటికల్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ఆయన పోలీసు ఉన్నతాధికారులో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడు. అయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వారి వద్ద నుంచి భారీ ఎత్తున్న నగదు తీసుకునే వాడు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పలు మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉద్యోగం ఇప్పించకుండా నగదు అడిగితే బెదిరించడంతో పలువురు నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించార. ఈ నేపథ్యంలో అక్టోబర్ 23న పోలీసులు గౌస్ నివాసంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా పలు విలువైన డాక్యుమెంట్లుతోపాటు నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
పరిచయాలే పెట్టుబడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : చీటింగ్ కేసులో కటకటాల పాలైన లెక్చరర్ గౌస్ మొహియిద్దీన్ బాగోతాలు తవ్వేకొద్దీ బట్టబయలవుతున్నాయి. కాలేజీలో పాఠాలు చెప్పుకునే ఉద్యోగానికి బదులు పైరవీలు, బ్రోకరేజీ పనుల్లో ఆరితేరిన గౌస్ సమాంతరంగా పోలీస్ వ్యవస్థనే నడిపించినట్టు తేటతెల్లమవుతోంది. ఐపీఎస్ అధికారులతో గల సన్నిహిత సంబంధాలే పెట్టుబడిగా సెటిల్మెంట్లు, దందాలకు పాల్పడినట్టు స్పష్టమవుతోంది. తాజాగా పోలీసుల దర్యాప్తులో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. పైసా పెట్టకుండానే ‘సిరిసంపద’లో పావలా వాటా ప్రకాశం జిల్లా సింగరాయకొండ కేంద్రంగా సిరిసంపద ప్రాపర్టీస్ పేరుతో గతంలో బోర్డు తిప్పేసి కేసులు ఎదుర్కొంటున్న సంస్థ గతేడాది తిరిగి సిరిసంపద ఎస్టేట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ప్రకాశం జిల్లాకు చెందిన వ్యాపారులతోపాటు పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన బిల్డర్ వెంకటరత్నం కూడా పెట్టుబడులు పెట్టారు. గత అనుభవాల దృష్ట్యా సంస్థ ద్వారా జరిగే క్రయ విక్రయాల సందర్భంగా ఏర్పడే సమస్యలను పరిష్కరించడానికి పోలీస్ శాఖలో పలుకుబడి కలిగిన ఓ పైరవీకారుడి అవసరాన్ని గుర్తించారు. ఇందులో భాగంగానే పోలీస్ బాస్‌లకే బాస్‌గా వ్యవహరించిన గౌస్ మొహియిద్దీన్కు పైసా పెట్టుబడి లేకుండానే ఆ సంస్థలో 25 శాతం వాటాతోపాటు మేనేజింగ్ పార్టనర్ హోదా, చెక్ పవర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సంస్థ ఒంగోలులో రాష్ట్ర రాజధాని ఏర్పాటవుతుందంటూ 50 ఎకరాలకు పైగా భూములను విక్రయించి పలువుర్ని ముంచే సినట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారాలపై ‘పశ్చిమ’ పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ‘సిరిసంపద’ పేరుతో చేసిన మోసాలపై ఆరా తీస్తున్నారు. ఇందుకోసం పోలీస్ కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాట వినని పోలీసులకు ముప్పుతిప్పలు ఏలూరు రేంజ్ పరిధిలో ఏ పని కావాలన్నా గౌస్‌ను ఆశ్రయించని పోలీస్ అధికారులు లేరంటే నమ్మశక్యం కాదు. తన దగ్గరకు రాకపోయినా.. తాను చెప్పిన కేసులు నమోదు చేయకపోయినా ఆ అధికారులను గౌస్ ముప్పుతిప్పలు పెట్టేవాడని అంటున్నారు. ఒక ఎస్సై పదోన్నతికి అడ్డుగా ఉన్న చార్జి మెమోను అప్పటి ఎస్పీ తొలగిస్తే.. వెంటనే లా అండ్ ఆర్డర్ డీజీకి చెప్పి ఆ ఎస్సైకు చార్జి మెమో కొనసాగేలా చేశారంటే గౌస్ హవా ఏవిధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఓ సీఐ పదోన్నతి ప్యానెల్లో చేరే సమయంలో రేంజి డీఐజీ చేత అకస్మికంగా ఆ సీఐ పనిచేస్తున్న స్టేషన్‌ను తనిఖీ చేయించి.. ఓ కేసు వ్యవహారాన్ని బయటకు తీయించి సస్పెండ్ చేయించారు. ఏలూరు డీఎస్పీగా చే రిన ఓ అధికారి తన దగ్గరకు రాకపోవడంతో డ్రాప్ అయిన ఎస్సీ, ఎస్టీ కేసును బయటకు తీయించి.. ఆకాశరామన్న ఉత్తరాల ద్వారా డీజీపీకి అతనిపై ఫిర్యాదులు చేసి 5నెలలు కూడా కాకుం డానే ఏలూరు నుంచి బదిలీ చేయించారన్న ఆరోపణలున్నాయి. ఇక తన వర్గానికి చెందిన ఓ అధికారి ఏలూరు రేంజ్ డీజీఐగా పనిచేసిన కాలంలో పోలీస్ శాఖలో గౌస్ ఆడింది ఆట.. పాడింది పాటగా సాగిందని చెబుతారు. ఆ అధికారి ద్వారా ఎంతో మందికి పనిష్మెంట్లు ఇప్పించడం, వాటిని తొల గింప చేయడం, పదోన్నతులు, బదిలీలు ఇలా ఒకమేమిటి అన్ని తానై పోలీస్ బాస్‌గా వ్యవహరించేవాడని పోలీస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కాల్‌డేటాతో బయటపడనున్న జాతకాలు గౌస్‌కు ఇద్దరు మాజీ డీజీపీలతో సన్నిహిత సంబంధాలున్నట్టు ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారత దేశానికి చెందిన ఓ మాజీ డీజీపీ రాష్ట్ర పోలీస్ బాస్‌గా ఉన్నప్పుడు పోలీస్ శాఖలో గౌస్ చక్రం తిప్పేవాడని చెబుతారు. సదరు అధికారిని మిల్క్‌బాయ్ అని పలకరించేంతటి చనువుందంటే గౌస్ హవా ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక మన రాష్ట్రానికే చెందిన ఓ మాజీ డీజీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో సన్నిహితంగా మెలిగినా.. ఆ తర్వాత ఆయన కుటుంబ విషయాలపై తప్పుడు ప్రచారం చేయడంతో గౌస్ నిజ స్వరూపాన్ని గుర్తించి చివరకు దూరం పెట్టారని అంటారు. కొంతకాలం వరకు లా అండ్ డీజీగా కీలకంగా వ్యవహరిం చిన తన సామాజిక వర్గానికే చెందిన మరో డీజీ కూడా గౌస్‌కు అత్యంత సన్నిహితుడిగా చెబుతారు. వీరే కాకుండా గతంలో రాయలసీమ ఐజీగా పనిచేసిన ఒక సీనియర్ ఐపీఎస్, గుంటూరు రేంజ్ ఐజీగా పనిచేసిన మరో ఐపీఎస్, ప్రకా శం, నెల్లూరు జిల్లాల్లో పనిచేసిన ఐపీఎస్ అధికారులు మొత్తం సుమారు 15 మంది ఐపీఎస్‌లు ఇతనికి అత్యంత సన్నిహితంగా ఉంటూ వివిధ పనులు చేసినట్టు ఆరోపణలున్నాయి. పనులు చేయించుకోవడానికి గౌస్ వారి బలహీనతలపై దృష్టి సారించి అడ్డదారులు తొక్కినట్టు చెబుతున్నారు. గౌస్ అరెస్ట్ తరువాత సదరు ఐపీఎస్ అధికారులంతా ‘పశ్చిమ’ పోలీసులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. కేసునుంచి గౌస్‌ను బయట పడేసేందుకు విశ్వప్రయత్నాలు సాగిస్తున్నారని అంటున్నారు. మరోవైపు ఐపీఎస్‌లతో పరిచయాల పేరుతో మోసగించిన గౌస్ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసేందుకు జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి అతడి కాల్ డేటాను సేకరించే పనిలో పడ్డారు. రెండు, మూడేళ్ల కాల్ డేటాను సేకరించడం ద్వారా గౌస్ ఏ ఐపీఎస్ అధికారితో మాట్లాడి పనులు చేయించుకున్నాడో బయటకు రానుంది. తమ కేసు పరిధి వరకు విచారించి.. మిగిలిన కాల్ డేటా అంశాలపై ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఎస్పీ డాక్టర్ కె.రఘురామ్‌రెడ్డి చెబుతున్నారు.