breaking news
Ganta rinivasa Rao
-
తర్జనగర్జన
తెలుగుదేశం పార్టీ నిర్వహించనున్న ప్రజా గర్జన వేదిక మారింది. ఏయూ మైదానం నుంచి ఆర్కే బీచ్‌కు తరలింది. కాంగ్రెస్‌ను వీడిన మాజీ మంత్రి గంటా శ్రీని వాసరావు బృందాన్ని తెలుగుదేశంలోకి ఆహ్వానిస్తూ చంద్రబాబు నాయు డు సమక్షంలో ఈ నెల 12న నిర్వహించతలపెట్టిన ఈ గర్జన మొదటినుంచి వివాదాస్పదంగానే తయారైంది. నిజానికి ఈ నెల 8న మహిళా దినోత్సవ సభను భారీగా నిర్వహించి గంటా బృందాన్ని చేర్చుకోవాలని పార్టీ పెద్దలు భావించారు. కానీ మహిళా దినోత్సవ సభలో తాము చేరడం బాగోదని గంటా బృందం భావించింది. ఆధికారంలో ఉండగా మూడు నెలల క్రితం తన కుమార్తె వివాహాన్ని, నెల రోజుల క్రితం సహచర శాసన సభ్యుడు ముత్తంశెట్టి శ్రీనివాస్ కుమార్తె వివాహాన్ని భారీగా నిర్వహించిన ఏయూ మైదానంలో గర్జన సభను పెట్టాలని గంటా నిర్ణయించారు. గంటా కుమార్తె వివాహ సమయంలో ఆయన మంత్రిగా ఉండడంతో ఏయూ మైదానానికి దారితీసే రహదారులను జీవీఎంసీ రెండు కోట్ల రూపాయలతో పునర్నిర్మించింది. ఏయూ పాలకవర్గం కూడా వీరికి దాసోహమై సకల సదుపాయాలు కల్పించింది. అదే రీతిలో ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతాయని అనుకొన్న గంటాకు పోలీసు కమిషనర్ షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా మైదానం ఇవ్వడానికి ఏయూ వీసీ, సంబంధిత అనుమతులివ్వడానికి జీవీఎంసీ ముందుకు రాగా పోలీసు కమిషనర్ శివధర్‌రెడ్డి మాత్రం ఎన్నికల నిబంధనల మేరకు వ్యవహరించారు. ఎన్నికల సమయంలో విద్యా సంస్థల ప్రాంగణంలో సభలు నిర్వహించడం చట్టవిరుద్ధమంటూ స్పష్టం చేసి పోలీసు అనుమతిని నిరాకరించారు. దీంతో ఏం చేయాలో తెలియక హడావుడిగా వన్‌టౌన్‌లోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియాన్ని సందర్శించిన నేతలు ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా వద్దనుకొన్నారు. చేసేది లేక తొలుత వద్దకుకొన్న ఆర్కే బీచ్‌లోనే సభ పెట్టాలని నిర్ణయించారు. గంటా బృందం 2009 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి ప్రజారాజ్యంలో చేరినప్పుడు ఆర్కే బీచ్‌లోనే సభ జరిగింది. గంటా తదితరులు 2009 ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ ప్రజారాజ్యం పూర్తిగా విఫలమైంది. ఆ తర్వాత గంటా ప్రోద్భలంతో బీచ్‌లో నిర్వహించిన సమైక్యాంధ్ర సభ కూడా విఫలమైంది. సెంటిమెంట్‌గా బీచ్‌లో సభ నిర్వహిస్తే మంచిజరగదన్న అభిప్రాయం వీరిలో నాటుకొంది. పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇష్టం లేకపోయినా బీచ్‌లోనే సభ జరపాల్సి వస్తోంది. బీచ్‌లో సభ విజయవంతం కావాలంటే లక్షల్లో జనాన్ని తరలించాలని, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి అంత సీన్ లేదని స్థానిక దేశం నేతలు సోమవారం ఏర్పాట్లను పర్యవేక్షించిన సీనియర్‌నేత యనమల రామకృష్ణుడుకి స్పష్టం చేశారు. 12 వ తేదీన సెలవు దినం కూడా కానందున బీచ్‌లో పెద్దగా జనం ఉండరని, పూర్తిగా తాము తీసుకువచ్చేవారితోనే సభ నిర్వహించడం కష్టమని వారు అవేదన వ్యక్తం చేశారు. ఇంతకాలం అధికారంలో ఉండి తమను వేధింపులకు గురిచేసిన గంటా బృందం కోసం ఏర్పాటు చేస్తున్న సభకు తాము దూరంగా ఉంటామని మొదటి నుంచి పార్టీలో ఉన్న క్యాడర్ భీష్మించుకుకూర్చోవడం కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. ఆరునూరైనా బీచ్‌లో భారీగా సభ జరపాల్సిందేనని అధిష్టానం అదేశించడంతో చేసేది లేక ఏర్పాట్లలో నేతలు నిమగ్నమయ్యారు. -
దేశంలో లుకలుకలు!
పార్టీలో చేరే కాంగ్రెస్ నేతలపై మండిపడుతున్న తమ్ముళ్లు ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయం అధినేత చంద్రబాబు ఎదుట పంచాయతీకి సిద్ధం ఆధిపత్య పోరు తెలుగుదేశం పార్టీని కుదిపేస్తోంది. కొత్తగా పార్టీలో చేరే కాంగ్రెస్ నాయకుల వల్ల అసమ్మతి పెరిగిపోతోంది. తమకు ప్రాధాన్యం తగ్గిపోతోందంటూ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వచ్చేవారి దూకుడుకు అడ్డుకట్ట వేయకపోతే పార్టీని వీడతామంటూ బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: గ్రూపు రాజకీయాలు, అసమ్మతి సెగలతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ రగిలిపోతోంది. కొత్తగా పార్టీలో చేరి అధికారం చెలాయించాలన్న నాయకులకు, ఆది నుంచీ పార్టీలో ఉంటూ అవకాశం కోసం ఎదురు చూస్తున్న మునుపటి నేతలకు మధ్య తలెత్తుతున్న సరికొత్త విభేదాలతో అతలాకుతలమవుతోంది. ఒకపక్క అయ్యన్న, గంటా వివాదం సృష్టిం చిన కలకలం ప్రకంపనలు సృష్టిస్తూ ఉంటే, మరోపక్క కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల పెత్తనం పాత నేతల్లో ఆగ్రహావేశాలు సృష్టిస్తోంది. ఇప్పటికే పార్టీలో ఉన్న పాత నేతలు పరిస్థితి చక్కదిద్దాలని కోరడానికి ప్రజాగర్జనకు ముందే బాబు వద్ద పంచాయతీ పెట్టనున్నారంటే పరిస్థితి అర్ధమవుతుంది. గొడవకు ‘గంటా’రావం! నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చంద్రబాబు సమక్షంలో హైదరాబాద్‌లో పార్టీలో చేరనున్న నేపథ్యంలో రగడ ముదురుపాకాన పడింది. ఈ పరిణామం నియోజక వర్గాల్లో క్యాడర్లో, నేతల్లో చిచ్చుపెడుతోంది. పెందుర్తి, భీమిలి, గాజువాక, ఎలమంచిలి నియోజకవర్గాల్లో పార్టీని ఏళ్లతరబడి నమ్ముకుంటే ఇప్పుడు వీరొచ్చి ఆ సీట్లు తమవేనని ప్రకటిస్తూ ఉండడం పార్టీలో చిచ్చు రేపుతోంది. గంటా బృందం ఏకపక్షంగా చేస్తున్న ప్రకటనలతో ప్రస్తుత పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు కారాలు మిరియాలు నూరుతున్నారు. భీమిలి ఎమ్మెల్యే అవంతి టీడీపీలో చేరినప్పటినుంచి విశాఖ ఉత్తరం సీటు తనదేనని చాటుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం అక్కడ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి భరణికాన రామారావు మండిపడుతున్నారు. తమను సంప్రదించకుండానే చేస్తున్న ప్రకటనలపై అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. గంటా వైఖరిపై ఇన్చార్జిలు, కొందరు మాజీ మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటినుంచే తమపై పెత్తనాన్ని వీరంతా సహించలేకపోతున్నారు. భరణికాన బుధవారం క్యాడర్‌తో సమావేశమై అవంతి వైఖరిపై చర్చిం చారు. గంటా బృందాన్ని అలాగే కొనసాగనిస్తే భవిష్యత్తులో తమకు ప్రాధాన్యం ఉండదని, క్యాడర్‌కూ నష్టమని తీర్మానించారు. భీమిలిలో సీనియర్ నేత, మాజీ మంత్రి అప్పలనరసింహరాజు కూడా అవంతి వైఖరిపై గుర్రుగా ఉన్నారు. పెందుర్తిలోనూ అదే పరిస్థితి. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న పంచకర్ల చేరికతో అక్కడున్న సీనియర్ నేత బండారు సైతం లోలోపల గుబులు చెందుతున్నారు. బాబు వద్ద గంటా చక్రం తిప్పి పంచకర్లకు సీటు ఇప్పించుకుంటారేమోనని క్యాడర్ అనుమానాలు వ్యక్తం చేస్తుండడంతో బండారు కలత చెందుతున్నారు. పాయకరావుపేటలోనూ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. ఎమ్మెల్యే కన్నబాబురాజు పదేళ్లపాటు పార్టీ కార్యకర్తలను, నేతలను ఇ బ్బందులకు గురి చేశారని వీరు ఆరోపిస్తున్నా రు. అటువంటి వ్యక్తిని పార్టీలో ఎలా చే ర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. గంటా బృందాని కి వ్యతిరేకంగా నేతలంతా ఈ నెల 12న ప్ర జాగర్జన సభకు హాజరుకానున్న బాబు ముం దు పంచాయతీ పెట్టాలని నిర్ణయించారు.