breaking news
free hugs
-
హగ్ మీ ప్లీజ్..
సాక్షి, ఖైరతాబాద్: ‘అందరిలాగే మేము కూడా మనుషులమే.. మమ్మలను అందరితో సమానంగా చూడండి. మాతో మాట్లాడినంత మాత్రాన, మమ్మల్ని కౌగిలించుకున్నంత మాత్రాన ఏమీ కాద’0టూ హిజ్రాలు, గే, లేస్బియన్స్ వినూత్న ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. తమతో స్నేహం చేయాలంటూ ఆదివారం సాయంత్రం మోబీరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘క్వీర్ కౌగిలి’ పేరుతో నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో ప్రచారం చేశారు. ప్రేమ అనేది మనసుకు చెందినదని, శరీరానికి కాదని, తమను ఓ సారి కౌగిలించుకుంటే ఏమీ కాదని ప్లకార్డులు ప్రదర్శించారు. తాము సమాజంలో మనుషులమేనని గుర్తించాలని కార్యక్రమాన్ని నిర్వహించినట్లు శాండీ, అనిల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో రేయిన్బో ప్లాగ్ను ప్రదర్శిస్తూ ర్యాలీ తీశారు. -
కౌగిలింతలు ఇస్తా.. రండి ప్లీజ్!
ఆస్ట్రేలియా వాసులకు ఇప్పటివరకు ఎప్పుడూ ఎదురుకాని ఓ సరికొత్త అనుభవం ఎదురవుతోంది. అక్కడ పర్యటిస్తున్న ఇటాలియన్ జంట.. ఆస్ట్రేలియన్లకు కౌగిలింతలు ఇస్తూ వారిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఎరికా డెల్లా మురా (20), ఆమె భర్త నికోలో మార్మిరోలి (21) అనే ఈ ఇద్దరూ బాగా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కళ్లకు గంతలు కట్టుకుని రెండు చేతులూ ముందుకు చాచి.. వచ్చి మమ్మల్ని కౌగిలించుకోండి అని పిలుస్తున్నారు. ఇందుకోసం వాళ్లు అక్కడ ఒక కార్డుబోర్డు మీద తమ విజ్ఞప్తిని రాసి ఉంచడంతో పాటు.. చిన్నపాటి హుండీ కూడా అక్కడ పెట్టారు. ''నేను మిమ్మల్ని నమ్ముతున్నా.. మీరు నన్ను నమ్ముతారా? వచ్చి కౌగిలించుకోండి. ఈ కౌగిలింతలు ఉచితమే. కానీ మేం ఈ అందమైన దేశంలో పర్యటించడానికి మీరు సాయం చేయాలనుకుంటే, చేయండి. థాంక్యూ సో మచ్' అని ఆ కార్డుబోర్డు మీద రాశారు. గడిచిన ఏడు నెలలుగా ఈ దంపతులిద్దరూ వర్కింగ్ వీసాలు తీసుకుని ఆస్ట్రేలియాలో తిరుగుతున్నారు. అరగంట పాటు అక్కడ నిలబడి కౌగిలింతలు ఇస్తే.. భోజనానికి సరిపడ డబ్బులు వచ్చేస్తున్నాయి. అయితే, తాము ఇదంతా డబ్బుల కోసమే చేయట్లేదని ఎరికా చెప్పింది. చాలామంది వచ్చి థాంక్స్ అని, జాగ్రత్తగా వెళ్లిరండి అని చెబుతున్నారని ఆమె తెలిపింది. మరికొందరు ఏమీ చెప్పకుండా ఊరికే కౌగిలించుకుని వెళ్లిపోతున్నారట. ఇప్పటివరకు అడిలైడ్, మెల్బోర్న్, సిడ్నీ, బైరన్ బే, బ్రిస్బేన్ నగరాల్లో అపరిచితులను వాళ్లు కౌగిలించుకున్నారు.