breaking news
former chairpersons
-
ఫోక్స్‌వాగన్ మాజీ చైర్మన్ కన్నుమూత
బెర్లిన్: ఫోక్స్‌వాగన్‌ను ప్రపంచ ఆటోమొబైల్ దిగ్గజంగా మార్చడానికి ఎంతో కృషి చేసిన, మాజీ చైర్మన్ ఫెర్డినార్డ్ పీచ్(82) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఫోక్స్‌వాగన్ కంపెనీ ప్రతినిధులు మంగళవారం అధికారికంగా ధృవీకరించారు. ప్రపంచంలోనే అదిపెద్ద కార్ల తయారీదారు, విలాసవంతమైన, ఖరీదైన కార్లకు పెట్టింది పేరైన ఫోక్స్ వ్యాగన్. రెండు దశాబ్దాల పాటు జర్మన్ ఆటోమోటివ్ దిగ్గజ కంపెనీలో అనేక పదవులు చేపట్టి విశిష్ట సేవలందించారు. కంపెనీ అభివృద్ధికి ఎనలేని కృషిచేసి ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయికి ఎదిగేలా చేసిన ఘనత ఆయన సొంతం. పీచ్ కెరీర్ విషయానికి వస్తే ప్రఖ్యాత కార్ల తయారీదారు ఫెర్డినార్డ్ పోర్షే మనమడైన పీచ్... ప్రఖ్యాత కార్ల కంపెనీ ఆడిలో తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు. అక్కడి నుంచి ఫోక్స్వాగన్లో 1993 లో సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2002 లో చైర్మన్‌గా ఎదిగారు. ఆ తర్వాత లంబోర్ఘిని, బెంట్లే లాంటి బ్రాండ్లను కలుపుకొని ఫోక్స్‌వాగన్ కంపెనీని ప్రపంచ ఆటోమొబైల్ దిగ్గజంగా తయారు చేశారు. ప్రస్తుతం పీచ్ కుటుంబం వాటాలు ఫోక్స్‌వాగన్ గ్రూపులో 53 శాతంగా ఉన్నాయి. సీఈఓ మార్టిన్ వింటర్కాన్ విషయంలో వివాదం కారణంగా పీచ్ 2015 ఏప్రియల్ లో చైర్మన్ పదవి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కంపెనీ బోర్డ్ విశ్వాసం కోల్పొయినందునే పీచ్ తన పదవి నుంచి తప్పుకున్నారని ఫోక్స్‌వాగన్ కంపెనీ ప్రకటించింది. అయితే పీచ్ తప్పుకున్న కొన్ని రోజులకే ఫోక్స్‌వాగన్ వివాదాలు చుట్టుముట్టాయి. డీజిల్ ఉద్గారాల స్కాంలో కంపెనీ చిక్కుకుంది. ఈ వివాదం నేటీకీ కొనసాగుతున్నా ఇప్పటీకీ ఫోక్స్‌వాగన్ కార్ల అమ్మకం విషయంలో ప్రధమ స్ధానంలోనే కొనసాగుతోంది. అయితే కంపెనీని ఈ స్థాయికి తీసురావడంలో కీలక భూమిక పోషించిన పీచ్ మృతి పట్ల కంపెనీకి చెందిన పలువురు ఆటో పరిశ్రమ పెద్దలు, ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆటోమోటివ్ పరిశ్రమలో నాణ్యత, పర్ఫెక్షన్ను తీసుకురావడానికి ఫెర్డినాండ్ పిచ్.. ఎంతో కృషిచేశారని కంపెనీ ప్రస్తుత సీఈఓ హెర్బర్ట్ డైస్ అన్నారు. పీచ్ జీవితం నుంచి ఎంతో నేర్చుకోవచ్చని, ఆయన చేసిన కృషి పట్ల తనకెంతో గౌరవం ఉందని తెలిపాడు. -
స్వాతీ.. ఇదేం పని?
స్వయంగా ఏసీబీ కేసులో చిక్కుకున్న ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్.. పాత చైర్పర్సన్లపై ఏసీబీకి ఫిర్యాదు చేయడం మీద నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తన పదవీ కాలం ముగిసిన ఇన్నాళ్ల తర్వాత తనపై అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేయడం ఏంటని మాజీ చైర్పర్సన్ బర్ఖా శుక్లా సింగ్ ప్రశ్నించారు. ఏసీబీ విచారణ అంటే తాను భయపడేది లేదని ఆమె చెప్పారు. మహిళా కమిషన్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను ఇబ్బడి ముబ్బడిగా నియమించడం, అందులోనూ అక్రమాలకు పాల్పడటంతో స్వాతి మలివాల్‌పై ఇటీవలే ఏసీబీ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. మహిళా కమిషన్‌లో జరిగిన అవినీతిపై ఏసీబీ ఇప్పటికే కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తోందని, తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందేనని బర్ఖా శుక్లా సింగ్ అన్నారు. అక్రమాలు జరిగితే.. తనపై ఆమె అప్పుడే కేసు పెట్టాల్సిందని చెప్పారు. బర్ఖాతో పాటు అంతకుముందు పనిచేసిన కిరణ్ వాలియా, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కూడా ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని, అందువల్ల ఏసీబీ అధికారులు వాళ్లందరినీ అరెస్టుచేసి జైలుకు పంపాలని స్వాతి మలివాల్ శుక్రవారం ఆరోపించిన విషయం తెలిసిందే. స్వాతి చేసినవన్నీ నిరాధార ఆరోపణలని, అందుకు ఆమె క్షమాపణలు చెప్పాలని కిరణ్ వాలియా అన్నారు. ముగ్గురు మహిళలు చేసిన అక్రమాలకు ఆధారాలు కూడా చూపిస్తానంటూ 128 పేజీల పత్రాన్ని స్వాతి మలివాల్ ఏసీబీకి సమర్పించారు.