పంచారామాలకు ప్రత్యేక బస్సులు
పట్నంబజారు(గుంటూరు): కార్తీకమాసంను పురస్కరించుకుని ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు పంచారామాలకు, త్రిశైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ రీజియన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి చెప్పారు. ఆర్టీసీ బస్టాండ్‌లోని తిక్కన కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత ఆర్టీసీ పరిస్థితి, నష్టాలు వస్తున్న సర్వీసులు, డిపో పరిధిలో నష్టాలు తగ్గించడం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీకమాసంలో ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 9959229869, 7382892615 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీటీఎంలు వాణిశ్రీ, వెంకటేశ్వరరావు, సీఎంఈలు గంగాధర్, శరత్‌బాబు, డిపో మేనేజర్లు పాల్గొన్నారు.