five state electinons
-
తుక్డే గ్యాంగ్‌కు మద్దతా?
సిలిగురి: ‘‘ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగతా భూభాగం నుండి వేరు చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. వ్యూహాత్మక సిలిగురి కారిడార్ (చికెన్ నెక్)ను తెంచేస్తామని తుక్డే–తుక్డే గ్యాంగ్ బెదిరించింది. బుజ్జగింపు రాజకీయాలనే నమ్ముకుంటున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ తుక్డే గ్యాంగ్‌కు గల్లీ నుంచి ఢిల్లీ దాకా మద్దతిచ్చింది. ఇదే ఆ పార్టీ అసలు రంగు’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదివారం పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. ఆ పార్టీ యువత, గిరిజనులు, మహిళల వ్యతిరేకి అని ఆరోపించారు. బుజ్జగింపు రాజకీయాల వల్ల బెంగాల్ తీవ్రంగా నష్టపోయిందని, దుర్బర స్థితిలోకి జారుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. సిలిగురి కారిడార్‌ను దేశ రక్షణకు, శ్రేయస్సుకు మధ్య వారధిగా ప్రధాని అభివరి్ణంచారు. ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి, పటిష్టంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. సిక్కింను సిలిగురితో అనుసంధానించే సేవోక్–రాంగ్పో రైల్వే రైల్ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టుతో బెంగాల్, సిక్కిం అనుసంధానం ఏర్పడడమే గాక స్థానికంగా వాణిజ్యం, పర్యాటకం ఊపందుకుంటుందని, యువతకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. దోషులు మూల్యం చెల్లించాల్సిందే బెంగాల్లో అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలని మోదీ అన్నారు. ‘‘ప్రగతిని పక్కనపెట్టి బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్న పార్టీలను చిత్తుగా ఓడించాలి. మదర్సాల కోసం తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో రూ.6,000 కోట్లు ఇవ్వడమేమిటి? ఉత్తర బెంగాల్‌కు నిధులివ్వకుండా మొండిచెయ్యి చూపారు. గత 15 ఏళ్లలో చేసిన ఖర్చులకు మమత సర్కారు సమాధానం చెప్పాలి. బీజేపీ అధికారంలోకి రాగానే తృణమూల్ కాంగ్రెస్ అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరిపిస్తాం. తప్పు చేసినవారు మూల్యం చెల్లించాల్సిందే. 15 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వ పథకాలు బెంగాల్లో అమలు కాకపోవడం దారుణం. తృణమూల్ వైఖరితో ప్రజలు నష్టపోయారు. రాష్ట్రంలో క్రూరమైన ప్రభుత్వం ఉంది. ఆ భయానక పాలన పట్ల జనం విసుగెత్తిపోయారు. దానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు’’ అని చెప్పారు. బీజేపీకి ఒక్క చాన్స్ తృణమూల్ నిర్వాకాల వల్ల బెంగాల్లోకి అక్రమ వలసలు పోటెత్తాయని మోదీ ఆరోపించారు. ‘‘రాష్ట్రంలో చొరబాటుదార్లు తిష్టవేశారు. దాంతో స్థానికంగా జనాభా నిష్పత్తి మారిపోయింది. సామాజిక సమతుల్యం దెబ్బతిన్నది. బెంగాల్ ప్రజల భాష, సంస్కృతుల్లో మార్పులొచ్చాయి. స్థానికుల ఉపాధి, ఉద్యోగాలను చొరబాటుదార్లు కొల్లగొట్టారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే చాలా ఆలస్యం చేసినవాళ్లమవుతాం. అందుకే మన నినాదం ‘కమల్ ఖిలావో, ఘుస్పతియా భగావో (కమలానికి ఓటేద్దాం, చొరబాటుదార్లను గెంటేద్దాం)’. ఉత్తర బెంగాల్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేద్దామని కేంద్రం సంకల్పిస్తే మమత సర్కారు సహకరించలేదు. బీజేపీ అధికారంలోకి రాగానే ఉత్తర బెంగాల్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తాం. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, క్యాన్సర్ ఆసుపత్రి, ఫ్యాషన్ డిజైన్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేస్తాం. బెంగాల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, తృణమూల్‌కు అవకాశమిచ్చారు. ఈసారి బీజేపీకి ఒక్క చాన్సిచ్చి చూడండి. ఆడబిడ్డలకు భద్రత కల్పించడానికి, చొరబాటుదార్ల నుంచి విముక్తి కల్పించడానికి, యువతకు ఉద్యోగాలు కల్పించడానికి, పెట్టుబడులు తీసుకురావడానికి, చట్టబద్ధ పాలన స్థాపించడానికి, పేదలకు ఉచితంగా వైద్యం అందించడానికి, ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి, బుజ్జగింపు రాజకీయాల బారి నుంచి బెంగాల్ సంస్కృతిని కాపాడడానికి మాకు అవకాశమివ్వండి’’ అని బెంగాలీలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. -
కూటముల కోలాటం
కేరళలో ఈ అసెంబ్లీ ఎన్నికలు అధికార వామపక్ష కూటమి ఎల్డీఎఫ్కు అగ్నిపరీక్షగా, కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష యూడీఎఫ్‌కు అస్తిత్వ పరీక్షగా మారాయి. దేశంలో మిగిలిన తమ ఏకైక కంచు కోటను వామపక్షాలు ఏ మేరకు కాపాడు కోగలవన్నది ఆసక్తికరం. కేరళలో ఐదేళ్లకోసారి పారీ్టలను గద్దె దింపే 40 ఏళ్ల ఆనవాయితీని బద్దలు కొడుతూ ఎల్డీఎఫ్ ఇప్పటికే వరుసగా రెండుసార్లు గెలిచింది. సీఎం పినరయి విజయన్ సారథ్యంలో ఈసారీ విజయ బావుటా ఎగరేసి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా హ్యాట్రిక్ కొట్టాలని ఆశపడుతోంది. ఆ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడం, ఇటు యూడీఎఫ్ కూటమిని, అటు రాష్ట్రంలో శరవేగంగా విస్తరిస్తున్న బీజేపీని నిలువరించడం అధికార కూటమికి అగి్నపరీక్షే కానుంది.కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార ఎల్డీఎఫ్ తమ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. సామాజిక భద్రత పెన్షన్ పథకం వంటివాటినే ప్రచారంలో ఎక్కువగా ప్రస్తావిస్తూ వస్తోంది. కానీ నిరుద్యోగం, ప్రజల్లో అసంతృప్తి, పదేళ్లుగా అధికారంలో ఉన్నందున ప్రభుత్వ వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. దాంతో ప్రజల్లో సీఎం విజయన్‌కు ఉన్న ఆదరణపైనే గట్టిగా ఆశలు పెట్టుకుంది. విపక్ష యూడీఎఫ్ మరో రకం సవాళ్లకు ఎదురీదుతోంది. వరుసగా రెండుసార్లు అధికారానికి దూరంగా ఉండటంతో కాంగ్రెస్ కూటమి ఆర్థికంగా బాగా బలహీనపడింది. ఇది ప్రచారంపై గట్టి ప్రభావమే చూపుతోంది. ఈసారీ నెగ్గని పక్షంలో కాంగ్రెస్, ఐయూఎంఎల్ అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి. దాంతో యూడీఎఫ్ ఈసారి సర్వశక్తులూ ఒడ్డుతోంది. విజయన్ సర్కారు అవినీతిని ప్రధానాంశంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. నిరుద్యోగం తదితరాలనూ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతపైనా గట్టిగానే ఆశలు పెట్టుకుంది. అయితే నేతల కుమ్ములాటలు కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారాయి. ఇక బీజేపీ కొన్నేళ్లుగా కేరళలో తన బలాన్ని, ప్రతి ఎన్నికల్లోనూ ఓట్ల శాతాన్ని క్రమంగా పెంచుకుంటూ వస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో శరవేగంగా విస్తరిస్తోంది. అధికార, విపక్ష కూటములకు మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. ఎల్డీఎఫ్పై నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకత, యూడీఎఫ్ పక్షాల్లో అనైక్యతకు ప్రధాని మోదీ జనాకర్షణ శక్తి, హిందూత్వ కార్డు తోడై మెరుగైన ఫలితాలొస్తాయని బీజేపీ ఆశలు పెట్టుకుంది. బీజేపీ సానుకూలతలు → రాష్ట్రవ్యాప్తంగా బలపడుతున్న సంకేతాలు → 2016తో పోలిస్తే పెరిగిన ఓట్ల శాతం → మోదీ కరిష్మా, హిందూత్వ కార్డు → ‘డబుల్ ఇంజిన్ సర్కారు’ప్రచారం ప్రతికూలతలు → సానుకూలతను ఓట్లుగా మలచడంలో వైఫల్యం → రాష్ట్రంలో సమర్థమైన నాయకులు లేకపోవడం → కరడుగట్టిన హిందూత్వ ముద్రఎల్డీఎఫ్ సానుకూలతలు → బూత్ స్థాయి దాకా పటిష్ట నిర్మాణం → ప్రజల్లో సీఎం విజయన్‌కు ఉన్న ఆదరణ → సంక్షేమ పథకాలు → యూడీఎఫ్ కూటమి పక్షాల అనైక్యత ప్రతికూలతలు → ఉద్యోగ కల్పన హామీల అమల్లో వైఫల్యం → నానాటికీ పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకత → ద్వితీయ శ్రేణిలో నాయకత్వ లేమి → శబరిమల వివాదాలతో అప్రతిష్టయూడీఎఫ్ సానుకూలతలు → సెంట్రల్ కేరళపై తిరుగులేని పట్టు → క్రైస్తవ, ముస్లిం మైనారిటీ ఓటర్ల దన్ను → తాజా స్థానిక ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన → ఎల్డీఎఫ్పై ప్రభుత్వ వ్యతిరేకత ప్రతికూలతలు→ కూటమి పార్టీల్లో పెచ్చరిల్లిన వర్గ పోరు → ఓమెన్ చాందీ తర్వాత ఆ తరహా మాస్ ఇమేజీ ఉన్న నాయకుడు లేకపోవడం → సీపీఎంతో పోలిస్తే బూత్ స్థాయిలో బలహీన నిర్మాణం → గత అసెంబ్లీ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన → ఎల్డీఎఫ్ వ్యతిరేక ఓట్లను బీజేపీ చీల్చే ప్రమాదం – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీ నూతన సారథికి ‘ఐదు రాష్ట్రాల ఎన్నికల’ సవాలు
సాక్షి, న్యూఢిల్లీ: కాషాయ దళపతిగా బాధ్యతలు చేపట్టిన నలభై ఐదేళ్ల నితిన్ నిబీన్కు తొలి అడుగులే అగ్నిపరీక్షగా నిలవనున్నాయి. కొద్ది నెలల్లో జరగనున్న పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల రూపంలో ఆయన తక్షణ సవాలు ఎదురుకానుంది. ముఖ్యంగా బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బెంగాల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని అధికార తృణముల్‌కు ఎదురొడ్డి పార్టీని అధికారంలోకి తేవడం కత్తిమీద సామే కానుంది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీని విస్తరించే ప్రణాళిక ఏ మేరకు ఫలించేదీ తమిళనాడు, కేరళ ఎన్నికలు తేల్చనున్నాయి. వీటికి తోడు పార్టీపరమైన సమన్వయం, ఎన్డీఏ భాగస్వాములు, ఇతర మిత్రపక్షాలతో సమన్వయం, పంచాయతీ నుంచి పార్లమెంట్ స్థాయి దాకా పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత నబీన్ భుజస్కంధాలపై ఉంది.ఆ మూడు రాష్ట్రాలే అసలు సవాలు కొద్ది నెలల్లో జరగనున్న బెంగాల్, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికలు నబీన్‌కు అత్యంత కీలకం కానున్నాయి. వాటిలో బెంగాల్‌ను బీజేపీ అత్యంత సీరియస్‌గా తీసుకుంటోంది. పదిహేనేళ్లుగా అప్రతిహాతంగా సాగుతున్న తృణముల్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అధికారానికి ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని బీజేపీ భావిస్తోంది. బెంగాల్ అసెంబ్లీలో 294 సీట్లకు గాను మమత పార్టీకి 223, బీజేపీకి కేవలం 65 సీట్లున్నాయి. ఈ పరిస్థితుల్లో 150 సీట్ల మెజారిటీ మార్కును చేరుకోవడం బీజేపీకి గట్టి సవాలేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ బెంగాల్లో బీజేపీ గ్రాఫ్ దిగజారింది. 2019లో 18 సీట్లు నెగ్గగా పోయినసారి ఆరింటిని కోల్పోయి 12 స్థానాలతో సరిపెట్టుకుంది. తృణముల్ ఎంపీ స్థానాలు 22 నుంచి 27 స్థానాలకు పెరిగాయి. కోల్‌కతాతో పాటు చాలా నగర ప్రాంతాల్లో బిహారీ వలసదారులు ఎక్కువ. కనుక అటు నుంచే నరుక్కు రావాలన్నది నబిన్ యోచన. జాతీయ భద్రత, జీవనోపాధి, శాంతిభద్రతలు, వలసలు తదితరాలపై విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడంతో పాటు తృణమూల్‌కు బలమున్న చోట బీజేపీ ఓటు శాతం పెంచే, గ్రామీణ ఓటర్లతో బీజేపీకి అనుబంధం పెంచే చర్యలపై కొత్త అధ్యక్షుడు దృష్టి పెట్టే అవకాశముంది. ప్రజల్లో గుర్తింపున్న నేతలకే టికెట్లని నబీన్ ఇప్పటికే శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు పంపారు.తమిళనాట... ఇక దక్షిణాదిలో కీలకమైన తమిళనాడులో ఈసారైనా పట్టు సాధించడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. డీఎంకే ప్రభుత్వ అవినీతి, విద్య, ఉద్యోగ రంగాల్లో వైఫల్యాలు, వాగ్దానాల అమలులో వైఫల్యాల వంటి అంశాల్లో ప్రజల్లోకి వెళ్లేలా కొత్త అధ్యక్షుడు ప్రణాళిక రచించారు. రాష్ట్రంలో సొంతంగా విజయం సాధించే పరిస్థితులు లేనందున అన్నాడీఎంకేతో (AIDMK) పొత్తు, ఇతర చిన్న పార్టీల మద్దతు ద్వారా ఓటు బ్యాంకును విస్తరించాలని భావిస్తున్నారు. ఓబీసీ, దళిత వర్గాలతో పాటు యువత, మహిళలను ఆకర్షించేలా కార్యక్రమాల నిర్వహణ, బూత్ స్థాయిలో బలహీనంగా ఉన్న కేడర్‌ను బలోపేతం చేయడం, స్థానిక భాషలో సోషల్ మీడియా ప్రచారానికి ప్రాధాన్యతపై నబీన్ ఫోకస్ చేసే అవకాశముంది.234 అసెంబ్లీ స్థానాలకు గాను పార్టీ గెలవగలిగే అవకాశామున్న 65 స్థానాలను ఇప్పటికే గుర్తించినట్టు తెలుస్తోంది. ఎన్నికల పొత్తు దిశగా అన్నాడీఎంకేతో వారంలో చర్చలు మొదలవనున్నాయి. కేరళలో బీజేపీ ఇప్పటికే ‘మిషన్–2026’పేరుతో భారీ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌లకు దీటుగా రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా దూకుడు పెంచింది. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో, ముఖ్యంగా తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో సాధించిన చరిత్రాత్మక విజయం బీజేపీకి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. అక్కడ 45 ఏళ్ల తర్వాత ఎల్ల్డీఎఫ్కు కమలం పార్టీ చెక్ పెట్టడం తెలిసిందే. ఈ విజయాన్ని అసెంబ్లీ ఎన్నికలకు పునాదిగా మార్చుకోవాలని చూస్తోంది.చదవండి: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామంప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బూత్ స్థాయి కమిటీల పునర్వ్యవస్థీకరణ, కార్యకర్తల శిక్షణ, ముందస్తుగా అభ్యర్థుల ఎంపిక వంటివి మొదలయ్యాయి. గ్రామాల నుంచి నగరాల దాకా ఓటర్లను నేరుగా కలిసే ప్రచారానికి ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర నేతలకు కొత్త అధ్యక్షుడు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. అయితే కేరళలో దశాబ్దాలుగా బలంగా ఉన్న వామపక్ష రాజకీయాలు, జాతీయ పార్టీల పట్ల సంప్రదాయ వ్యతిరేకత బీజేపీకి పెద్ద సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో తొలిసారి ఓటేసే నవ యువతను తమ వైపు తిప్పుకోవడంతో పాటు కీలకమైన విద్య, ఉద్యోగాలపై ప్రచారం చేయాలన్నది కొత్త అధ్యక్షుని వ్యూహమని బీజేపీ నేతలు చెబుతున్నారు. -
సమయం లేదని అలా ఉన్నపళంగా వెళితే ఎలా!..
సమయం లేదని అలా ఉన్నపళంగా వెళితే ఎలా!.. -
డ్యాన్స్‌తో అదరగొట్టిన స్మృతిఇరానీ..
ఇంఫాల్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి స్మృతిఇరానీ మణిపూర్‌లో పర్యటించారు. అందులో భాగంగా శుక్రవారం వాంగ్ఖీ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అక్కడి మహిళలు వేసుకునే వస్త్రాలను ధరించి.. సంప్రదాయ నృత్య కళాకారులతో డ్యాన్స్ స్టెప్పులు వేశారు. దీంతో అక్కడ ఉన్న స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రిని మరింత ఉత్సాహపరిచారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. మణిపూర్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 28, మార్చి 5న రెండు దశల్లో పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. #WATCH | Union Minister Smriti Irani joins artists performing traditional dance at an event in Wangkhei area of Imphal East, Manipur pic.twitter.com/jQtqKMkOJW — ANI (@ANI) February 18, 2022 -
4 గంటలు.. 300 శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రకటన ఏ నిమిషమైనా రావచ్చు. ప్రకటించిన తక్షణం ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. ఇక అప్పటినుంచి ఎలాంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి వీలుండదు. అందుకే యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ జాగ్రత్త పడ్డారు. కేవలం నాలుగంటే నాలుగే గంటల్లో.. ఒక ఐటీ సిటీ, కేన్సర్ ఆస్పత్రి, ఒలింపిక్స్ సైజు స్విమ్మింగ్ పూల్.. వీటన్నింటినీ ఆవిష్కరించారు. ఇంతకుముందు ఎక్కడా, ఎప్పుడూ లేనట్లుగా ఒకేసారి ఏకంగా 50 వేల కోట్ల విలువైన 300 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎడాపెడా చేసిపారేశారు. 100 ఎకరాల్లో ఐటీ సిటీ, 983 కోట్లతో కేన్సర్ ఆస్పత్రి, 850 కోట్లతో అంతర్జాతీయ కేంద్రం.. వీటన్నింటి ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. గత నెలలోనే లక్నో నుంచి ఆగ్రా వరకు 302 కిలోమీటర్ల పొడవైన ఎక్స్‌ప్రెస్ వేను ఆయన ప్రారంభించారు. అయితే 10 వేల కోట్ల విలువైన ఆ ప్రాజెక్టు ఇంతవరకు ప్రజలకు అందుబాటులోకి మాత్రం రాలేదు. లక్నో మెట్రో మొదటి దశ ట్రయల్ రన్‌ను ఆయన ప్రారంభించారు గానీ, అది జనానికి అందుబాటులోకి రావడానికి మరికొన్ని నెలలు పడుతుంది. ఈ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీపై ఆయన మండిపడ్డారు. పెద్దనోట్ల రద్దు వల్ల మనం బాగా వెనకబడిపోయామని, యూపీలో అభివృద్ధి శరవేగంగా సాగుతూ.. ఒక్కసారిగా అంతా ఆగిపోయిందని అన్నారు. ప్రజలకు డబ్బులు అందట్లేదని, దాంతో ప్రాణాలు కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు.


