fire proof
-
ఇంటికి ఫైర్ ప్రూఫ్ ఉండాల్సిందే..
నివాసం, వాణిజ్యం, కార్యాలయం.. నిర్మాణం ఏదైనా సరే అగ్ని ప్రమాద నివారణ ఉపకరణాలు తప్పనిసరి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా జరిగే ప్రమాదం వెలకట్టలేనిది. ఆస్తి, ప్రాణ నష్టాన్ని భర్తీ చేయలేనిది. అందుకే ప్రతీ భవనంలోనూ ఫైర్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వాటిని నిర్వహణ చేయాలి లేకపోతే ప్రమాదం జరిగినప్పుడు అవి పనిచేయవు. ఈమధ్య కాలంలో గ్రేటర్ హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్, సిలిండర్ పేలుళ్లు.. ఇలా కారణాలనేకం.🔸 హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, విద్యా, వైద్య సదుపాయాలు, కాస్మోపాలిటన్ కల్చర్, తక్కువ జీవన వ్యయం, అందుబాటు ధరలు, మెరుగైన మౌలిక వసతులు ఇలా రకరకాల కారణాలతో నగరంలో జనాభా, వలసలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నివాస, వాణిజ్య భవనాలలో అగ్ని ప్రమాద భద్రతా నిబంధనలు, ఉత్పత్తులు మనశ్శాంతి ఇవ్వడమే కాకుండా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రాణ నష్టాన్ని కూడా తగ్గిస్తుంది. చిన్న మంట ఒక గదిని దహించేందుకు సగటున మూడు నిమిషాల సమయం పడుతుంది. అందుకే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వేగవంతమైన ప్రతిస్పందన అత్యవసరం. ప్రతిస్పందనలో సెకన్ల సమయం ఆలస్యమైనా.. విపత్తు తీవ్రత పెరుగుతుంది. – సాక్షి, సిటీబ్యూరోఎక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి..? అపార్ట్మెంట్లు: 🔸 ప్రతీ ఫ్లాట్ లోపల స్మోక్ డిటెక్టర్లను ఏర్పాటు చేయాలి. 🔸 మంటలను ఆర్పే పరికరం, యంత్రం ఉండాలి. ముఖ్యంగా వంట గదిలో తప్పనిసరి. 🔸 మంటలను నియంత్రించే తలుపులు, కిటికీలు ఉండాలి. కనీసం 30–60 నిమిషాల పాటుతట్టుకునే శక్తి ఉండాలి.లిఫ్ట్: 🔸 లిఫ్ట్ డోర్లకు అగ్నిని తట్టుకునే శక్తి ఉండాలి. 🔸 15 మీటర్ల కంటే ఎత్తయిన భవనాలలో ప్రత్యేకంగా అగ్నిమాపక సిబ్బందిని నియమించుకోవాలి. 🔸 లిఫ్ట్ ముందు భాగంలో ‘అగ్ని ప్రమాదం జరిగినప్పుడు లిఫ్ట్‌ను వినియోగించరాదు’, ‘మెట్ల మార్గం’.. తదితరాలను సూచించే సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలి.బేస్మెంట్, పార్కింగ్ ఏరియా 🔸 ఆటోమెటిక్ స్ప్రింక్లర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. 🔸 పొగను గుర్తించే పరికరాలు, అలారం ఉండాలి. 🔸 పార్కింగ్, ప్రధాన భవనం మధ్య భాగంలో మంటలను నియంత్రించే తలుపులను ఏర్పాటు చేయాలి. 🔸 ఇంధనం, రంగులు, వార్నిష్ వంటి మండే గుణం ఉన్న వస్తువులను భద్ర పర్చకూడదు. 🔸 అగ్ని ప్రమాదం జరిగే తప్పించుకునే సైన్ బోర్డులు, లైటింగ్‌లను ఏర్పాటు చేయాలి. కారిడార్లు, కామన్ ఏరియాలు: 🔸 ప్రతీ 30 మీటర్ల దూరంలో ఒక మాన్యువల్ కాల్ పాయింట్ల (ఎంసీపీ) ను ఏర్పాటు చేయాలి. 🔸 కారిడార్లలో 2 గంటల పాటు మంటలను తట్టుకునే గుణం ఉన్న గోడలు, తలుపులను ఏర్పాటు చేయాలి. 🔸 ఫైర్ అలారం స్పీకర్లు, అత్యవసర లైట్లు, మెరిసే ఎగ్జిట్ గుర్తులను పెట్టాలి. అసెంబ్లీ ఏరియా 🔸 ఓపెన్ స్పేస్, గ్రౌండ్ ఫ్లోర్లో సురక్షితమైన అసెంబ్లీ జోన్లను గుర్తించాలి. 🔸 లిఫ్ట్, మెట్ల దగ్గర అగ్నిమాపక సంకేతాలు, గుర్తులను ఏర్పాటు చేయాలి. 🔸 బేస్మెంట్, లిఫ్ట్ లాబీలలో పొగ తొలగింపు వ్యవస్థను పెట్టాలి. 🔸 సహజ, యాంత్రిక వెంటలేషన్ తప్పనిసరి. అగ్నిమాపక మౌలిక సదుపాయాలు 🔸 15 మీటర్ల కంటే ఎత్తయిన భవనంలో ప్రతీ అంతస్తులోనూ నీటిని సరఫరాను అందించే పైప్‌లు, హోస్ రీల్ ఉండాల్సిందే. 🔸 ఫైర్ హైడ్రంట్ సిస్టమ్ ఉండాలి. 🔸 అండర్‌గ్రౌండ్, ఓవర్‌హెడ్ ఫైర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్‌లను ఏర్పాటు చేయాలి. 🔸 డీజిల్ లేదా ఎలక్ట్రిక్‌తో నడిచే ఫైర్ పంప్ రూమ్ తప్పనిసరి.రూఫ్, టెర్రర్.. 🔸 అగ్నిమాపక సిబ్బంది వెళ్లేందుకు వీలుగా ఉండాలి. 🔸 మంటలను ఆర్పేందుకు ప్రత్యేకంగా వాటర్ స్టోరేజ్ ట్యాంక్ తప్పనిసరి. 🔸 హైరైజ్ భవనాలతో ప్రతీ 24 మీటర్ల దూరంలో అత్యవసర సమయంలో ఆశ్రయం పొందేందుకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలి. మెట్లు..🔸 15 మీటర్ల కంటే ఎత్తయిన భవనాలకు రెండు మెట్ల మార్గాలు తప్పనిసరి. 🔸 అగ్ని ప్రమాదం జరిగితే తప్పించుకునేందుకు ప్రత్యేకంగా మెట్ల మార్గం ఉండాలి. 🔸 మెట్ల మార్గంలోని తలుపులు కనిష్టంగా 1–2 గంటల పాటు మంటలను నియంత్రించే గుణం ఉన్న వాటినే ఏర్పాటు చేయాలి. 🔸 పొగ ప్రవేశించకుండా నిరోధించే మెట్లను నిర్మించుకోవాలి. చేయాల్సినవి.. 🔸 తప్పించుకునే మార్గాలు, మెట్ల మార్గాలు, అగ్ని ప్రమాద హెచ్చరికలు, సూచికలను గుర్తించుకోవాలి. 🔸 ఇంట్లో లేనప్పుడు విద్యుత్ మెయిన్స్‌ను ఆపివేయాలి. 🔸 ఇంట్లో అగ్ని మాపక యంత్రం ఉంచుకోవాలి. 🔸 ఇసుకతో నిండిన అగ్నిమాపక బకెట్‌ను ఏర్పాటు చేసుకోవాలి.చేయకూడనివి🔸 అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫర్నీచర్ వెనుక లేదా టాయిలెట్లతో దాక్కోకూడదు. 🔸 ఐఎస్ఐ ప్రమాణాలు ఉన్న ఉత్పత్తులను మాత్రమే వాడాలి. 🔸 అనధికారి విద్యుత్ కనెక్షన్లు తీసుకోవద్దు. మీటర్‌ను ఓవర్‌లోడ్ చేయకూడదు. 🔸 ప్రమాదకర పదార్థాలు, ఉత్పత్తులను నిల్వ చేయకూడదు. 🔸 ఫైర్ ఎగ్జిట్ పాయింట్లకు అడ్డంగా ఏమీ పెట్టరాదు. 🔸 విద్యుత్ వ్యవస్థల మరమ్మతులు, నిర్వహణ తప్పనిసరి. -
మరో ఆసక్తికర పరిణామం.. జిరాక్స్ తీస్తే కొంపలు అంటుకుంటాయ్..!?
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సంచలనం రేపిన ఫోర్జరీ ఎఫ్ఐఆర్ (సృష్టించిన కాపీ) కేసులో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. 255/2020 నంబరుతో రెండు ఎఫ్ఐఆర్లు బయటికి రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ రోజు స్టేషన్లో జరిగిన మరో ఆసక్తికర పరిణామం పోలీసుల అనుమానాస్పద వైఖరిని బలపరిచేలా ఉందని తెలిసింది. ఆ సమయంలో ఎఫ్ఐఆర్ కాపీ కోసం ఎస్సై వ్యవహరించిన తీరు అనుమానాలకు బీజం వేసిందని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 2020 సెప్టెంబరు 9వ తేదీన స్టేషన్‌కు వచ్చిన నల్లగొపు శ్రీనివాస్‌పై ఎఫ్ఐర్ నంబరు 255/2020తో ఐపీసీ సెక్షన్లు 341, 323, 506 నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీని బాధితునికి ఇచ్చారు. అది చూసి కంగారుపడిపోయిన బాధితుడికి ఏం చేయాలో పాలుపోలేదు. మరోవైపు అరెస్టు చేస్తున్నామని, వైద్యపరీక్షలకు సిద్ధంగా ఉండాలని అప్పటి ఎస్సై, సీఐ బాధితుడిని భయభ్రాంతులకు గురిచేశారు. బెదిరిపోయిన శ్రీనివాసరావు ఇల్లు విక్రయించేందుకు సమ్మతించాడు. దీంతో అరెస్టు చేయడంలేదని, పిలిచినపుడు కోర్టుకు రావాలని ఎస్సై, సీఐలు సూచించడంతో ఎఫ్ఐఆర్ కాపీతో బాధితుడు ఇంటిదారిపట్టాడు. మళ్లీ స్టేషన్‌కి పిలిపించి.. వాసన చూసి బాధితుడు కాపీతో సహా ఇంటికి వెళ్లడంతో కంగారుపడిపోయిన ఎస్సై అతన్ని, ఎఫ్ఐఆర్కాపీని తీసుకురావాల్సిందిగా ఓ వ్యక్తిని పురమాయించాడు. అతడు శ్రీనివాస్‌ని వెంటబెట్టుకుని స్టేషన్‌కు తీసుకొచ్చాడు. అక్కడ బాధితుడి నుంచి ఎఫ్ఐఆర్ కాపీని హడావుడిగా తీసుకున్న ఎస్సై దాన్ని ముక్కువద్ద పెట్టుకుని వాసన చూశాడు. ఇది చూసి శ్రీనివాసరావుకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇంతలో ఎస్సై... ఏరా..? దీన్ని కార్బన్కాపీ (జిరాక్స్) తీశావా? అని అరిచాడు. ‘అలాంటిదేమీ లేదు’’ అని శ్రీనివాస్ సమాధానమిచ్చాడు. ఆ జవాబు విని ఊపిరిపీల్చుకున్న ఎస్సై.. ఒకవేళ ‘జిరాక్స్ తీసి ఉంటే కొంపలు అంటుకుపోయి ఉండేవి’’ అని వ్యాఖ్యానించాడు. ఎస్సై మాటలతో శ్రీనివాసరావు మనసులో అనుమానం బీజం నాటుకుంది. కానీ, అప్పటికే అతను ఒక కాపీని జిరాక్స్ తీసుకున్నాడు. ఆ సమయంలో ఎస్సై కోపం చూసి.. ఆ విషయం అతనితో చెప్పలేకపోయాడు. వాస్తవానికి జిరాక్స్ తీసిన కొద్దిసేపటి వరకు ఆ కాగితాలపై కార్బన్పౌడర్ అంటి ఉంటుంది. తీసిన కొద్దిసేపటి వరకు దాని వాసన చూసి ఆ విషయాన్ని గ్రహించవచ్చు. కానీ, అప్పటికే జిరాక్స్ తీసి చాలాసేపు అవుతుండటంతో ఎఫ్ఐఆర్ కాపీపై కార్బన్ వాసనను ఎస్సై గ్రహించలేకపోయాడు. ఏడాది దాటుతున్నా.. తనను కోర్టుకు పిలవకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు శ్రీనివాసరావు ఇటీవల ఓ లాయరును ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. ఇది చాలా తీవ్ర ఆరోపణ: సీపీ సత్యనారాయణ ఈ కేసులో వచ్చిన ఆరోపణ చాలా తీవ్రమైనది. ఒకే నంబరుపై రెండు ఎఫ్ఐఆర్లు ఉండనే ఉండవు. అందులోనూ స్టేషన్లోనే ఎఫ్ఐఆర్ రద్దు అనేది పూర్తిగా అవాస్తవం. ఆ హక్కులు పోలీసులకు ఉండవు. ఘటనపై విచారణ జరుపుతున్నాం. ఫిర్యాదుదారులు, నిందితులు, సిబ్బందిని పిలిపించాం. చదవండి: వీడొక్కడే సినిమాలో లాగా.. మహిళ కడుపులో.. అధికారులు షాక్.. -
ఆరని జ్వాల
-
నిలువెల్లా నిర్లక్ష్యం
ఎన్ని ప్రమాదాలు జరిగినా పాఠాలు నేర్వని వైనం మాటలకే పరిమితమైన ప్రయాణికుల భద్రత అమలుకు నోచుకోని రైల్వే బడ్జెట్ హామీలు సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం గ్రామ శివారులో 45 నిండు ప్రాణాలను బలిగొన్న బస్సు ప్రమాదంపై ప్రభుత్వం ఇప్పటికీ పాఠాలు నేర్చుకోలేదని ప్రజలు గగ్గోలు పెడుతున్న తరుణంలో అదే తరహా ప్రమాదానికి గురైంది బెంగళూరు-నాందెడ్ ఎక్స్‌ప్రెస్. ఏసీ బోగీ మంటల్లో చిక్కుకోవడంతో 26 నిండు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం రాష్ట్రంలో చోటుచేసుకున్న అతిపెద్ద రైలు దుర్ఘటనల్లో ఒకటిగా నమోదైంది. దీనికి కారణాలను ఇప్పటికిప్పుడు స్పష్టంగా చెప్పటం కష్టమే అయినా.. రైల్వే యంత్రాంగం నిర్లక్ష్యాన్ని తోసిపుచ్చలేని పరిస్థితి నెలకొంది. రైలు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రయాణికుల భద్రతకే ప్రథమ ప్రాధాన్యమని ప్రతి రైల్వే బడ్జెట్ సమయంలో మంత్రులు ఘనంగా చెప్పటం పరిపాటి. కానీ అవేవీ ప్రస్తుతం అమలు కావడంలేదు. ప్రమాదానికి కారణాల సంగతి పక్కనపెడితే.. మంటలు వేగంగా వ్యాపించకుండా చూడాల్సిన ఏర్పాట్లపై రైల్వేమంత్రి బన్సల్ గత బడ్జెట్లో పేర్కొన్నారు. ఒక్కసారి వాటిని పరిశీలిస్తే.. రైలు ఏసీ బోగీలోపల నిప్పును గ్రహించలేని మెటీరియల్‌నే వాడాలి. ఫ్లోరింగ్‌పైన నిప్పు అంటుకోని పీవీసీని పరచాలి. రూఫ్ సీలింగ్‌కు లామినేటెడ్ షీట్స్‌ను మాత్రమే వినియోగించాలి. లోపల వినియోగించే వైర్లు, లైటింగ్ మెటీరియల్, టెర్మినల్ బోర్డులు, కనెక్టర్లకు వాడే మెటీరియల్ కూడా ఫైర్ ప్రూఫ్‌తో ఉండాలి. నిప్పును, పొగను ముందుగానే గుర్తించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అలాగే పొగ ఉన్నట్టు గుర్తించగానే అలారం మోగించే పరికరాలను బోగీల్లో ఉంచాలి. ఏసీ బోగీలో,ప్యాంట్రీ కార్లో విధిగా అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయాలి. అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఆటోమేటిక్‌గా కిటికీలు, డోర్లు తెరచుకోవాలి. ఎక్కువ రద్దీ ఉన్నప్పటికీ తొందరగా వెళ్లిపోయేలా రైల్వేస్టేషన్లలో ప్లాట్‌ఫామ్స్, స్టెయిర్ కేసులు ఏర్పాటు చేయాలి. ప్రతి స్టేషన్లో లక్ష లీటర్ల కెపాసిటీ గల వాటర్సంపులు, పంప్ రూమ్లుండాలి. అయితే ఇవేవీ ఆచరణలో అమలుకు నోచుకోలేదు. నిప్పును, పొగను ముందుగానే గుర్తించే పరికరాల ఏర్పాటు హామీ కొత్తది కానప్పటికీ.. బన్సల్ ప్రకటన తర్వాత కూడా ఇవి అందుబాటులోకి రాలేదు. వీటిని రెండు, మూడు రాజధాని లాంటి హైస్పీడ్ రైళ్లకే పరిమితం చేశారు. అలారం ఏర్పాటు కూడా 40 రైళ్లకు మించి లేదు. కొన్ని రైళ్లలో మాత్రం నిప్పును ఆర్పే స్ప్రింక్లర్లు ఎక్స్టింగ్విషర్లు ఉంటున్నాయి. కానీ అవెక్కడున్నాయో ప్రయాణికులకు తెలియదు. శనివారం నాటి ప్రమాదంలో ఏసీ బోగీలో ఇవి ఉన్నా ప్రయాణికులు వినియోగించలేకపోయారు. గతంలో ప్రతి ఏసీ బోగీలో కచ్చితంగా నైపుణ్యం ఉన్న టెక్నీషియన్లు ఉండే విధానం అమలులో ఉండేది. వీరినే ఎస్కార్ట్ టీంగా వ్యవహరిస్తారు. ఓ టెక్నీషియన్, మరో సహాయ టెక్నీషియన్ ఉండేవారు. ప్రతి అరగంటకు ఓసారి ఆ బోగీలో అడుగడుగునా వీరు త నిఖీ చేసేవారు. కొంత కాలం క్రితం ఒక్కో టెక్నీషియన్‌కు ఐదు బోగీల బాధ్యత అప్పగించారు. సహాయ టెక్నీషియన్ మాత్రం ప్రతి ఏసీ బోగీలో ఉండేవాడు. ప్రయాణికులకు దిండు దుప్పట్లతో కూడిన బెడ్ రోల్స్ కూడా ఇతనే అందించేవాడు. కానీ మూడేళ్ల క్రితం ఖర్చును భారీగా తగ్గించుకునే క్రమంలో బెడ్‌రోల్స్ బాధ్యతను ఔట్సోర్సింగ్ సంస్థలకు అప్పగించారు. దీంతో సహాయ టెక్నీషియన్ పోస్టులకు రైల్వే రాంరాం చెప్పేయడంతో ప్రధాన టెక్నీషియన్లపైనే భారం పడింది. దీంతో వారు బోగీలను తనిఖీ చేసే బాధ్యతను ఔట్సోర్సింగ్ సిబ్బందికి అప్పగిస్తున్నారు. సాధారణంగా ప్రతి ఏసీ బోగీలో చల్లదనం కోసం రెండు ఏసీ ప్యానల్స్ ఉంటాయి. నిర్ధారిత సమయాల్లో ఇవి ఒకదాని తర్వాత ఒకటి పనిచేయాలి. ఒక ప్యానెల్ వేడెక్కగానే దాన్ని నిలిపేసి రెండో ప్యానెల్‌ను ఆన్ చేసే బాధ్యత టెక్నీషియన్స్‌పై ఉంటుంది. అందుకే గతంలో సహాయ టెక్నీషియన్ కుర్చీ సరిగ్గా ఈ ప్యానల్ వద్దే ఉండేది. కానీ ప్రస్తుతం టెక్నీషియన్లు ఆ బాధ్యతను బెడ్‌రోల్ సిబ్బందికి అప్పగిస్తున్నారు. సరైన పరిజ్ఞానం లేని వీరు వాటి పరిస్థితిని కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. శనివారం నాటి ప్రమాదానికి ఇదీ ఓ కారణం కావొచ్చనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫైర్ సేఫ్టీ అడిట్ ఏమైంది: రైళ్లలో అగ్నిప్రమాదాల సంఖ్య పెరుగుతుండటంతో దాన్ని నివారించే ఉద్దేశంతో కొద్దికాలం క్రితం ‘ఫైర్ సేఫ్టీ అడిట్’ బృందాలను ఏర్పాటు చేశారు. రెండు బృందాలు విడివిడిగా పనిచేసేలా రెండేళ్ల క్రితం రూపకల్పన చేశారు. ఈ బృందాలు ఆయా రైళ్లను పరిశీలించి వాటిల్లో అగ్నిమాపక వ్యవస్థ ఎలా ఉందో, కొత్తగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తేల్చి రైల్వే బోర్డుకు నివేదిక అందజేయాలి. కానీ ఇప్పటి వరకు వాటి పనితీరు ఏంటో మూడో కంటికి తెలియదు. ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేసి ఉంటే ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాల్లో కొన్నింటినైనా నివారించే అవకాశం ఉండేది. బన్సల్ మేనల్లుడికి లంచం ఇవ్వబోయింది ఆ పోస్టుకే.. గత రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన పవన్‌కుమార్ బన్సల్ అవినీతి ఆరోపణల్లో చిక్కుకుని పదవి పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. బన్సల్ మేనల్లుడు విజయ్ సింగ్లా రైల్వే బోర్డులో కీలక పదవి కోసం ఓ అధికారి నుంచి రూ. 10కోట్ల లంచం పుచ్చుకునేందుకు ఒప్పందం చేసుకున్నారనేది ప్రధాన అభియోగం. ఆ అధికారి ఏ పోస్టు కోసం ఈ లంచం ఎరవేశారో తెలుసా? రైల్వే బోర్డులో కీలకమైన ఎలక్ట్రికల్ విభాగం బాధ్యత పొందేందుకే అతను కోట్లలో లంచం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రెండేళ్ల కాలపరిమితి మాత్రమే ఉండే ఈ పోస్టుకు అంత మొత్తం ఇచ్చేందుకు ఎందుకు సిద్ధమయ్యారంటే.. అంతకు ఎన్నో రెట్లు అధికంగా అందులో ‘సంపాదన’ ఉండటమే దీనికి కారణం. అవినీతికి అంతగా అవకాశం ఇచ్చిన ఆ పోస్టు చేసే పనేంటంటే.. రైళ్లలో, స్టేషన్లలో అమర్చే ఎలక్ట్రికల్ పరికరాల కొనుగోలు లావాదేవీలు చూడటం. మరి లంచం ఇచ్చిన సొమ్ముకు కొన్ని రెట్లు అధిక మొత్తం రాబట్టుకోవాలంటే.. కాంట్రాక్టర్లతో లాలూచీ పడాల్సిందే. అదే జరిగితే.. నాసిరకం పరికరాలు రైళ్లలో ప్రత్యక్షమవుతాయి. ఇంకేముంది.. నిప్పు పుట్టడం, బోగీలు తగలబడటం.. అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోవటం.. అన్నీ చకచకా జరిగిపోతాయి. శనివారం నాటి రైలు దుర్ఘటనకు ఇలాంటి నాసిరకం పరికరాలూ ఓ కారణమేనా? అనేది పూర్తి దర్యాప్తులో కాని తేలేవిషయం కాకపోయినా.. రైల్వేలో జరుగుతున్న పరిణామాలు దేన్నీ కొట్టేయలేని పరిస్థితి కల్పిస్తున్నాయి.