breaking news
femele
-
కాక్‌పిట్‌లోకి గర్ల్‌ఫ్రెండ్.. వరుస వివాదాల్లో ఎయిరిండియా!
ప్రముఖ దేశీయ ఏవియేషన్ దిగ్గజం ఎయిరిండియా (airindia) వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. మధ్యం మత్తులో ప్రయాణంలో తోటి ప్రయాణికులపై తప్పతాగి మూత్రం పోయడం, ఒకరినొకరు కొట్టుకోవడం,కాక్‌పిట్‌లో స్నేహితురాలిని ఆహ్వానించడం వంటి ఘటనలతో తరచు వార్తల్లో కెక్కుతుంది. తాజాగా, గత వారం ఎయిరిండియా విమానానికి చెందిన ఇద్దరు పైలెట్లు తన స్నేహితురాలని కాక్‌పిట్‌లోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఎయిరిండియాకు చెందిన ఏఐ-445 విమానం ఢిల్లీ నుంచి లేహ్‌కు (లద్దాఖ్) వెళ్లిన విమానంలో పైలెట్, కో-పైలెట్ తన స్నేహితురాల్ని కాక్‌పిట్(cockpit)లో కూర్చోబెట్టుకున్నారు. అయితే, ఎంత సేపు కాక్‌పిట్‌లో ఉన్నారనే అంశంపై స్పష్టత రాలేదు. ఈ ఘటనపై క్యాబిన్ క్రూ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో ఎయిరిండియా యాజమాన్యం ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. మరోవైపు, దీనిపై డీజీసీఏ స్పందించింది. నియమ నింబంధనల్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఎయిరిండియా విచారణ నిమిత్తం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ అంశంపై ఎయిరిండియా అధికారిక ప్రకటన చేయలేదు. దేశంలో అత్యంత సున్నిత ప్రాంతమైన లేహ్ వైమానిక మార్గం అత్యంత సున్నితమైంది. క్లిష్టమైనది. ఈ మార్గంలో ప్రయాణించే విమానంలో పైలట్లు నిబంధనలను ఉల్లంఘించడంపై వైమానిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు. ఫిబ్రవరి 27న దుబాయ్ నుంచి ఢిల్లీ మార్గంలో ఎయిర్ ఇండియా విమానం ఏ1-915 కాక్‌పిట్‌లోకి తన మహిళా స్నేహితురాలిని స్వాగతించిన ఎయిర్ ఇండియా పైలట్ లైసెన్స్‌ను డీజీసీఏ సస్పెండ్ చేసింది. కాక్‌పిట్ ఉల్లంఘన ఘటనలో సత్వర, సమర్థవంతమైన చర్య తీసుకోలేదని ఆరోపించినందుకు డీజీసీఏ ఎయిరిండియాకు రూ. 30 లక్షల జరిమానా విధించింది. ఇదీ చదవండి : వాట్సాప్ చాట్ విడుదల, మూత్ర విసర్జన ఘటనలో శంకర్ మిశ్రాను ఇరికించారా? -
మగాళ్లమైతే బాగుండేది..
బీజింగ్: చైనాలో మహిళా ప్రొఫెసర్లు తాము ఎదుర్కొంటున్న లింగవివక్షపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే తాము మగాళ్లుగా పుడితే తమ అకడమిక్ కెరీర్ చాలా బాగుండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీజింగ్ యూనివర్సిటీకి చెందిన లైఫ్ సైన్సెస్ విభాగం.. చైనాలోని ప్రొఫెసర్లలో లింగవివక్షతపై చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. వివిధ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న 1600 మంది ప్రొఫెసర్ల అభిప్రాయాలను సేకరించగా.. వారిలో మహిళా ప్రొఫెసర్లు తాము ఎదుర్కొంటున్న లింగవివక్ష పట్ల తీవ్ర నిరాశలో ఉన్నట్లు వెల్లడైంది. పురుష ప్రొఫెసర్లతో పోలిస్తే మహిళా ప్రొఫెసర్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందని 67 శాతం మంది అంగీకరించారు. అయితే సర్వేలో పాల్గొన్న పురుష ప్రొఫెసర్లలో కూడా 33 శాతం మంది ఒకవేళ మహిళలమై ఉంటే తమ అకడమిక్ కెరీర్ తక్కువ స్థాయిలో ఉండేదనే అభిప్రాయం వ్యక్తం చేయడం అక్కడున్న లింగవివక్షతకు అద్దం పడుతోంది.