breaking news
Federal Bank chief
-
ప్రపంచ మార్కెట్లు కుదేల్
ట్రంప్ సుంకాల విధింపు ‘అంచనాలకు మించి’ ఉన్నాయంటూ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ పేర్కొంటూ ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణంపై గణనీయమైన ప్రభావం చూపొచ్చంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్మన్ శాక్స్ ట్రంప్ టారిఫ్ విధించిన తర్వాత అమెరికాలో మాంద్యం వచ్చే అవకాశాలను 60%కు పెంచింది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరింత తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని తెలిపింది. దీంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. అమెరికా మార్కెట్లు ఢమాల్ అమెరికా స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ట్రంప్ టారిఫ్ల బాంబ్తో గత వారాంతంలో భారీ నష్టాల మూటగట్టుకున్న సూచీలు.. తాజా సోమవారమూ భారీ నష్టాలబాట పట్టాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే యూఎస్ మార్కెట్ 5% మేర కుదేలైంది. భారత వర్తమాన కాలం ప్రకారం రాత్రి 10 గంటలకు నాస్డాక్ ఒకటిన్నర నష్టంతో 15,366 వద్ద, డోజోన్స్ రెండున్నర శాతం క్షీణతతో 37,462 వద్ద, ఎస్అండ్పీ 2% పతనంతో 4,993 వద్ద ట్రేడవుతోంది. కోవిడ్ తర్వాత ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. ఇటీవల గరిష్టం నుంచి 20 శాతానికి పైగా క్షీణించి నాస్డాక్ శుక్రవారం అధికారికంగా ‘బేర్ మార్కెట్’ జోన్లో ప్రవేశించింది. -
అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇంకా కుదుటపడలేదు: యెలెన్
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇంకా కుదుటపడలేదని ఆ దేశ ఫెడరల్ బ్యాంక్ చీఫ్ జనెత్ యెలన్ పేర్కొన్నారు. అయితే త్వరలో పరిస్థితులు కుదుటపడతాయన్న విశ్వాసం ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీకి (ఎఫ్ఓఎంసీ) ఉందని వివరించారు. సెనేట్ కమిటీ ముందు ఆమె దేశ ఆర్థిక పరిణామాలపై మంగళవారం వివరణ ఇచ్చారు. ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... మరికొంత కాలం ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0.50 శాతం) ఇదే ధోరణిలో కొనసాగే వీలుంది. అమెరికా పరపతి విధానం పరిస్థితులకు తగిన విధంగా స్పందించడానికి వీలుగా కొనసాగుతోంది. కొన్ని కీలక సమస్యలు చైనాకు పొంచి ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోతే (బ్రెగ్జిట్ )ఆ ప్రతికూల ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై, ఫైనాన్షియల్ స్థిరత్వంపై ఉంటుంది. ఇక వేతన వృద్ధిలో ఇంకా మందగమనం ఉంది. మందగమనం తరువాత గృహ ఆదాయాలు ఇంకా తగిన స్థాయిలో పెరగలేదు. పారిశ్రామిక ఉత్పత్తిలో మందగమనం మరి కొంతకాలం కొనసాగే వీలుంది.