breaking news
Europe scientists
-
మా వ్యాక్సిన్‌తో 90శాతం ఫలితాలు..
న్యూయార్క్: కరోనాను ఎదుర్కోవడానికి అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ, యూరోప్‌కు చెందిన బయోఎన్‌టెక్ సంయుక్తంగా తయారు చేస్తున్న వ్యాక్సిన్ 90 శాతం ప్రభావవంతంగా పని చేస్తోందని ఆ కంపెనీ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా చెప్పారు. తమ ఫలితాలు తెలిసిన నేటి రోజు సైన్సుకూ, మానవాళికి చాలా మంచి రోజు అని అభిప్రాయపడ్డారు. మూడో దశ ప్రయోగం వల్ల తమ వ్యాక్సిన్ కరోనాను అడ్డుకుంటోందని తెలుస్తోందని చెప్పారు. ప్రపంచానికి అత్యవసరమైన కరోనా వ్యాక్సిన్ త్వరలోనే తమ నుంచి వచ్చే వకాశం ఉందని తెలిపారు. బయోఎన్‌టెక్ సీఈఓ ఉగుర్ సాహిన్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో దాడి చేస్తున్న నేపథ్యంలో ఈ ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తున్నాయని చెప్పారు. ఫైజల్, బయోఎన్‌టెక్ కంపెనీలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జూలై 27న ప్రారంభమైంది. మొత్తం 38,955 మందికి నవంబర్ 8 నాటికి వ్యాక్సిన్ ఇచ్చారు. రెండో, మూడో దశ ప్రయోగాల్లో వచ్చిన వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించినట్లు తెలిపాయి. అయితే, పరిశీలన పూర్తయ్యే నాటికి ఈ డేటా మారే అవకాశం ఉందని ఫైజర్ కంపెనీ ఉపాధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. ఈ యేడాది చివరి నాటికి టీకా వచ్చే అవకాశాలున్నాయన్నారు. ఫైజర్ భారత్‌కు వచ్చేనా ? తాజా పరిణామంతో ఫైజర్ టీకాను భారత్‌కు రప్పించేందుకు అధికారులు ప్రయస్తున్నారు. ఇప్పటికే కోవిడ్ జాతీయ నిపుణుల బృందం ఫైజర్ ప్రతినిదులను కలసి చర్చించినట్లు సమాచారం. భారత్‌లో దీన్ని డెలివరీ చేయించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను ఈ బృందం పరిశీలిస్తోంది. 45 వేల కేసులు.. భారత్‌లో గత 24 గంటల్లో 45,903 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 85,53,657కు చేరుకుంది. గత 24 గంటల్లో 490 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 1,26,611. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 79,17,373కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం 5,09,673 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన 9 రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, అధికారులతో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ సమీక్ష జరిపారు. అమెరికాలో ఆగమేఘాలపై టీకా తయారీ సాక్షి, హైదరాబాద్: అమెరికాలో ట్రంప్ అధికారంలోంచి దిగిపోయేందుకు ముందుగానే ఓ అద్భుతాన్ని సృష్టించనున్నారా? ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం వస్తోంది. ఎందుకంటే ఎఫ్‌డీఏ అనుమతి రాకమునుపే కోట్లాది కోవిడ్–19 టీకాలు ఫ్యాక్టరీల్లో సిద్ధమైపోతున్నాయి. ‘‘ఆపరేషన్ వార్ప్ స్పీడ్’’ కోవిడ్ టీకా తయారీని వేగవంతం చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన కార్యక్రమం పేరు ఇది. అమెరికన్ పౌరులు 30 కోట్ల మందికి టీకా అందించే లక్ష్యంతో మొదలైన ఆపరేషన్ వార్ప్ స్పీడ్‌కు నేతృత్వం వహించింది ఓ ఆర్మీ జనరల్. ఈ ఏడాది మేలోనే రిటైర్ కావాల్సిన ఓ ఆర్మీ జనరల్! పేరు గస్ పెర్నా. టీకా తయారీకి సంబంధించిన వీడియోలు సీబీఎస్ టీవీ ప్రసారం చేయడంతో ఇప్పుడు గస్ పెర్నా పేరు మారుమోగిపోతోంది. -
ముందే చెప్పేస్తాయి
వర్షమొచ్చినా... ‘వాన రాకడ..ప్రాణం పోకడ’ చెప్పలేమని పాత నానుడి. కానీ ఇప్పుడు కొంచెం అటూఇటుగా రెండింటి అంచనాలు పెద్ద కష్టమేమీ కాదు. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి వాన ఎప్పుడు వస్తుందో పది నిమి షాల ముందే చెప్పేయగల కొత్త టెక్నిక్‌ను సిద్ధం చేసింది. ‘త్రీడీ నౌ కాస్టింగ్’ అనే ఈ కొత్త పద్ధతి ఫేజ్డ్ అరే రాడార్ల సాయంతో పని చేస్తుంది. ఇది దాదాపు 60 కి.మీ విస్తీర్ణంలోని ఆకాశాన్ని వంద కోణాల్లో పరిశీలించి చినుకులు ఎప్పుడు కురుస్తాయో చెప్పేయగలదు. ఇందుకు ఈ రాడార్ తీసుకు నే సమయం కేవలం పది నుంచి 15 సెకన్లు మాత్రమే. దీన్ని మరింత సమర్థంగా పని చేయించేందుకు ఒసాకా వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన అల్గారిథమ్‌ను సిద్ధం చేశారు. ఫలితంగా అతితక్కువ సమయంలో వర్షాలు ఎప్పుడు వస్తాయో కచ్చి తంగా అంచనా కట్టవచ్చని వారు తెలిపారు. ప్రస్తుతం ఈ కొత్త రాడార్ వ్యవస్థను రైకెన్ అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ కంప్యూటేషనల్ సైన్సెస్‌లో ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో టోక్యో మెట్రోపాలిటన్ వర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ తదితరాలు పాల్గొన్నాయి. గుండె జబ్బు వచ్చినా.. గుండె జబ్బులను సాధారణ వైద్యులు కూడా ప్రాథమిక స్థాయిలోనే గుర్తించేందుకు వీలుగా యూరోపియన్ శాస్త్రవేత్తలు ఓ వినూత్న పరికరాన్ని తయారు చేశారు. సూపర్ మార్కెట్లలో బార్‌కోడ్‌లను చదివేందుకు వాడే పరికరాన్ని పోలిన ఈ సరికొత్త గాడ్జెట్ గుండె తాలూకు అతిసూక్ష్మ సంకేతాలను కూడా గుర్తించగలదు. తద్వారా లక్షణాలు కనిపించకముందే గుండె జబ్బులు వచ్చే అవకాశాలను కచ్చితంగా గుర్తించే వీలు ఏర్పడుతుంది. గుండె జబ్బులను గుర్తించేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న పద్ధతులు సంక్లిష్టమైనవి కావడం, ప్రమాదం ముంచుకొచ్చిన తర్వా త గానీ గుర్తించలేకపోవడం వల్ల ఏటా మరణాలు పెరుగుతున్నాయి. దీంతో యూరప్ శాస్త్రవేత్తలు హొరైజన్ 2020 కొలాబరేషన్ ‘కార్డిస్’ పేరుతో ఈ పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఇది లేజర్ డాప్లర్ వైబ్రోమెట్రీ పద్ధతి ఆధారంగా పని చేస్తుంది. ఇది కాంతిని ఉపయోగించి చాతీ, గుండె కంపనాల మ్యాప్‌ను సిద్ధం చేస్తుంది. దీంతో ధమనులు పెళసుగా మారడాన్ని, లోపలి భాగాల్లో గార లాంటిది పేరుకుపోవడాన్ని గుర్తిం చవచ్చు. వినియోగం తేలిక కాబట్టి దీనిని సాధారణ వైద్యులూ వాడవచ్చు.