శ్రీసిటీలో ‘పేక్స్ ఎన్విరాన్మెంటల్’ ప్లాంటు
శ్రీసిటీ(వరదయ్యుపాళెం): పారిశ్రామిక నీటి వ్యర్థాలను శుద్ధి చేసే పరికరాల తయూరీలో పేరొందిన నెదర్లాండ్స్ సంస్థ పేక్స్ ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీ... తన కొత్త ఉత్పత్తి కేంద్రాన్ని వుంగళవారం శ్రీసిటీలో ప్రారంభించింది. భారతదేశంలోని నెదర్లాండ్స్ అంబాసిడర్ అల్ఫోన్సెస్ స్టోలింగ చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రవుంలో పేక్స్ హోల్డింగ్ సీఈఓ స్టీఫెన్ బోకెన్, ఫౌండర్ జాన్ పేక్స్, పేక్స్ ఇండియూ ఎండీ సుదీప్ సంగమేశ్వరన్, శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వ్యర్థ జలాల శుద్ధితో పాటు వాటి నుంచి వినియోగానికి పనికొచ్చే విలువైన పదార్థాలను ఈ యంత్రాలు వేరు చేస్తాయి.
శుద్ధి ప్రక్రియులో ఉత్పన్నవుయ్యే బయోగ్యాస్.. కాలుష్య రహిత ఇంధనంగా ఉపయోగపడుతుంది. పేక్స్ సంస్థ తయూరు చేసిన 2వేల పైచిలుకు యుంత్రాలను 60 దేశాలలో పలు పారిశ్రామిక సంస్థలు, పురపాలక సంస్థలు ఉపయోగిస్తున్నట్లు నెదర్లాండ్స్ అంబాసిడర్ చెప్పారు. నెదర్లాండ్స్ భారీగా భారత్లో పెట్టుబడులు పెడుతున్నట్లే భారత్ నుంచి కూడా టాటా స్టీల్స్, అపోలో టైర్స్ తదితర సంస్థలు తవు దేశంలో పెట్టుబడులు పెట్టాయుని చెప్పారు. యుూరప్కు భారత్ ఎగువుతుల్లో 20శాతం నెదర్లాండ్స్కే వెళుతోందన్నారు. శ్రీసిటీ వసతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.