breaking news
Eastern India
-
రిటైర్మెంట్ ప్లానింగ్‌లో అక్కడివాళ్లే టాప్
కోల్‌కతా: విశ్రాంత జీవనం (రిటైర్మెంట్ తర్వాత) కోసం సన్నద్ధతతో తూర్పు భారత్ ప్రజలు ఇతర ప్రాంతాల వారితో పోల్చితే ముందున్నారు. ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్‌లో సున్నా నుంచి నూరు వరకు స్కేల్‌పై ఉత్తర భారత్ 54 పాయింట్ల వద్ద ఉంది. అదే దక్షిణాది, ఉత్తరాది ప్రాంతాలు రిటైర్మెంట్ జీవితానికి సన్నద్ధతలో 48 పాయింట్ల వద్దే ఉన్నాయి. పశ్చిమ భారత్ 49 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.జాతీయ సగటు 49 పాయింట్లుగా ఉంది. కాంటార్‌తో కలసి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నిర్వహించిన ‘ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్ అధ్యయనం’ నాలుగో ఎడిషన్ నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. పట్టణ వాసుల్లో రిటైర్మెంట్ సన్నద్ధత ఎలా ఉంది, దీనిపై వారిలో ఉన్న అవగాహన, ఆకాంక్షలు, రిటైర్మెంట్ సమయంలో ఎదుర్కొనే సవాళ్లు, ప్రణాళికల గురించి ఈ అధ్యయనం తెలుసుకునే ప్రయత్నం చేసింది. దేశవ్యాప్తంగా 28 పట్టణాల్లో 25–65 ఏళ్ల వయసులోని వారి అభిప్రాయాలు తెలుసుకుంది.అధ్యయనం వివరాలు.. తూర్పు భారత్‌లో 72 శాతం మంది రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు. గతేడాది ఇది 67 శాతంగా ఉంది. ఇదే ప్రాంతంలో 82 శాతం మంది ఆరోగ్యం కాపాడుకుంటామని నమ్మకంగా చెప్పారు. 67 శాతం మంది లైఫ్ ఇన్సూరెన్స్‌ను రిటైర్మెంట్ భద్రత కోసం ఎంపిక చేసుకుంటున్నారు. ప్రతి నలుగురిలో ఒకరికి ఎన్పీఎస్ ఖాతా ఉంది. ఈ ప్రాంతంలో జీవిత బీమాపై 97 శాతం మందికి, హెల్త్ ఇన్సూరెన్స్‌పై 90 శాతం మందికి అవగాహన ఉంది.పశ్చిమ భారత్‌లో 66 శాతం మంది, ఉత్తర భారత్‌లో 60 శాతం, దక్షిణ భారత్‌లో 58 శాతం మంది రిటైర్మెంట్ కోసం పెట్టుబడులు పెడుతున్నారు.తూర్పు భారత్‌లో 56 శాతం మంది 35 ఏళ్లలోపే రిటైర్మెంట్ ప్రణాళిక మొదలు పెట్టడాన్ని సమర్థించారు. 50 ఏళ్లకు పైబడిన వారిలో 94 శాతం మంది ముందుగా రిటైర్మెంట్ కోసం పెట్టుబడులు ప్రారంభించకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. కనీస అవసరాలను తీర్చుకునే విషయంలో 62 శాతం మంది, పిల్లల భవిష్యత్ విషయమై 64 శాతం మందిలో ఆందోళన కనిపించింది. 94 శాతం మంది కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి సహకారం విషయంలో విశ్వాసాన్ని వ్యక్తం చేయగా, 64 శాతం మంది ఒంటరితనం విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. మారుతున్న పర్యావరణం పట్ల 76 శాతం మందిలో ఆందోళన కనిపించింది. తూర్పు భారత్‌లో ప్రతి నలుగురిలో ఒకరు రిటైర్మెంట్ తర్వాత కుటుంబ సభ్యులపై ఆధారపడాల్సి వస్తుందని చెప్పారు. ప్రతి ముగ్గురిలో ఒకరు వైద్య అవసరాలు, పిల్లల భవిష్యత్‌కూ తమ ప్రణాళికల్లో భాగంగా ప్రాధాన్యం ఇస్తున్నారు.పెరుగుతున్న ప్రాధాన్యత..జీవనకాలం పెరుగుతుండడంతో భారతీయులకు రిటైర్మెంట్ ప్రణాళిక అత్యంత కీలకంగా మారుతోంది. మా అధ్యయనంలో గుర్తించిన అంశాలు మారుతున్న రిటైర్మెంట్ అవసరాలు, ప్రాధాన్యతలను అర్థం చేసుకునేందుకు ఉపకరిస్తాయి. దేశవ్యాప్తంగా రిటైర్మెంట్ విషయమై సమగ్రమైన విధానాన్ని అనుసరించేందుకు ఈ అధ్యయనం స్ఫూర్తినిస్తుంది.– ఈవీపీ రాహుల్ తల్వార్,మ్యాక్స్‌లైఫ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ -
తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
-
ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం
న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాలు అసోం, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లలో శుక్రవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.6 గా నమోదైంది. భూకంపం కేంద్రం అరుణాచల్ ప్రదేశ్ లోని తూర్పు కామెంగ్ జిల్లాలో కేంద్రీకృతమైందని ప్రముఖ సెస్మాలజిస్ట్ వివరించారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక సాధారణంగా రిక్టర్ స్కేల్ సూచి 6 దాటితే తీవ్రమైన దుర్బిక్ష్యం సంభవిస్తుందన్న విషయం తెలిసిందే. -
'కొమన్' విలయం: తూర్పు భారతం కకావికలం
-
'కొమన్' విలయం: తూర్పు భారతం కకావికలం
కోల్‌కతా: ఇప్పటికే దాదాపు ఏడు లక్షల మంది నిరాశ్రయిలయ్యారు. 60 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. తిండికాదు కదా కనీసం గుక్కెడు మంచినీరూ కరువయ్యింది. ఇటు తాత్కాలిక సహాయ శిబిరాల్లో వసతుల లేమి.. చిన్నారులు, వృద్ధుల ఆక్రందనలు.. ఇవీ.. గడిచిన మూడు రోజులుగా తూర్పు భారతంలోని పశ్చిమ బెంగాల్, మణిపూర్, ఒడిశా, అసోం జార్ఖండ్ రాష్ట్రాల్లోని కొన్ని భాగాల్లో కొమన్ తుఫాను సృష్టించిన విలయం తాలూకు ఆనవాలు. జులై 30న తీరం ఇండో- మయన్మార్ సరిహద్దు వద్ద తీరం దాటిన కొమన్ పెనుతుఫాన్.. అటు మయన్మార్ తోపాటు బెంగాల్, మణిపూర్, ఒడిశా రాష్ట్రాల్లో గడిచిన 200 ఏళ్లలో కనీవినీ ఎరుగతి రీతిలో నష్టాన్ని మిగిల్చింది. కోల్ కతా నగరంలో శనివారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం అక్కడ 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఆ రాష్ట్రంలోని మరో 12 జిల్లాల్లో తుఫాను ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నది. భారీ వర్షాల ధాటికి మణిపూర్ లో శనివారం కొండచరియలు విరిగిపడి 20 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. మయన్మార్ సరిహద్దుల్లోని మోరేకు రాజధాని నగరం ఇంఫాల్ తో రవాణా సంబంధాలు తెగిపోయాయి. దీంతో సహాయక చర్యల్లో తీవ్ర అంతరాయం నెలకొంది. ఒడిశాలోని చక్పితోపాటు మరో రెండు ప్రధాన నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ఒక్క ఒడిశాలోనే ఐదు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జార్ఖండ్ లోని గిరిధి, ఛత్రా జిల్లాలు కూడా కొమన్ బారినపడి తీవ్ర ఆస్థి నష్టాన్ని చవిచూశాయి. జాతీయ విపత్తు నిర్వహణా సంస్థ బలగాలు సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నాయి.