breaking news
Earth Observation
-
గమ్యం చేరని నిఘానేత్రం
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ–సీ61 ప్రయోగం లక్ష్యాన్ని సాధించకుండానే అర్ధాంతరంగా ముగిసింది. నిఘా అవసరాలకు ఉద్దేశించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–09)ను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టడంలో రాకెట్ విఫలమైంది. ప్రయోగంలో తొలి రెండు దశలు విజయవంతమైనా మూడో దశలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇస్రో అమ్ముల పొదిలో కీలక అస్త్రంగా భావించే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్) విఫలం కావడం అత్యంత అరుదు. ఇస్రో చరిత్రలో శ్రీహరికోట నుంచి జరిగిన ఈ 101 ప్రయోగం అనుకున్న ఫలితం ఇవ్వకపోవడం శాస్త్రవేత్తలను తీవ్రంగా నిరాశపర్చింది. ఈ వైఫల్యం నేపథ్యంలో మరిన్ని ప్రయోగాలు వాయిదా పడే అవకాశాలున్నాయి. 2018–2023 మధ్య ప్రపంచవ్యాప్తంగా 74 శాతం రాకెట్ ప్రయోగాల వైఫల్యానికి ప్రొపల్షన్, స్టేజ్–సపరేషన్ అంశాలే కారణమని గణాంకాలు చెబుతున్నాయి. గతి తప్పిన రాకెట్ శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్–షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి ఆదివారం ఉదయం 5.59 గంటలకు పీఎస్ఎల్వీ–సీ61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 110 సెకండ్ల వ్యవధిలో తొలి దశలో 70 కిలోమీటర్లు ఎత్తుకు, 261.8 సెకండ్లలో రెండో దశలో 232 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది. 262.9 సెకండ్లకు మూడో దశలో ఘన ఇంధన మోటార్ మండించే సమయంలో రాకెట్ గతి తప్పింది. సరిచేసేందుకు మిషన్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది ప్రయతి్నంచినా లాభం లేకపోయింది. రాకెట్ సముద్రంలో పడిపోయి ఉంటుందని ఇస్రో రిటైర్డ్ అధికారి ఒకరు చెప్పారు. ప్రయోగం విఫలమైనట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ ప్రకటించారు. మోటార్ కేస్‌లోని చాంబర్ ప్రెషర్లో లోపం తలెత్తినట్లు వెల్లడించారు.విచారణకు కమిటీ పీఎస్ఎల్వీ–సీ61 వైఫల్యానికి కారణాలు తెలిస్తేనే భావి ప్రయోగాల విషయంలో మరిన్ని జాగ్రత్తలకు ఆస్కారముంటుంది. అందుకే ఇస్రో నిపుణులు, ఇంజనీర్లు, సైంటిస్టులు, మిషన్ స్పెషలిస్టులతో తొలుత ఫెయిల్యూర్ అనాలిసిస్ కమిటీ(ఎఫ్ఏసీ)ని వేయనున్నారు. ప్రయోగ డేటాను ఇది క్షుణ్నంగా సమీక్షించి వైఫల్యానికి కారణాలను తేలుస్తుంది. కారణం సాంకేతికమా, మానవ తప్పిదమా, ప్రతికూల వాతావరణం వంటి బాహ్య అంశాలా అనేది నిర్ధారిస్తుంది. అవి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేస్తుంది.కారణం అదేనా? పీఎస్ఎల్వీ–సీ 61 వైఫల్యానికి కారణంపై ఇస్రో దృష్టి సారించింది. ప్రొపల్షన్ సిస్టమ్‌లో ఫ్లెక్స్ నాజిల్ కంట్రోల్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్లే రాకెట్ కూలినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నాజిల్‌ను సరిచేసి ఇంధనాన్ని మండించడంలో ఈ వ్యవస్థదే కీలక పాత్ర. దీన్ని పొరలతో కూడిన ఎలాస్టోమెరిక్ మెటీరియల్స్‌తో తయారు చేస్తారు. ప్రయోగం మూడో దశలో హైడ్రాక్సిల్–టెరి్మనేటెడ్ పాలీబ్యుటాడీన్ (హెచ్టీపీబీ) ఇంధనాన్ని ఉపయోగించారు. ఇది 240 కిలోన్యూటన్ థ్రస్ట్‌ను ఉత్పన్నం చేయగలదు.ఇస్రో గెలుపుగుర్రం పీఎస్ఎల్వీ ఉపగ్రహ వాహక నౌక ఇస్రోకు అత్యంత నమ్మకమైనది. ఎర్త్ అబ్జర్వేషన్, జియో–స్టేషనరీ, నావిగేషన్ అనే మూడు రకాల పేలోడ్లను నింగిలోకి పంపేలా పీఎస్ఎల్వీని ఇస్రో అభివృద్ధి చేసింది. దీని ఎత్తు 44.5 మీటర్లు, వ్యాసం 2.8 మీటర్లు. ఒకేసారి 1,750 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. భూమి నుంచి 600 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్‌కు చేరుకోగలదు. ఈ వాహక నౌక ఇస్రోకు ఎన్నో విజయాలు అందించి గెలుపు గుర్రంగా గుర్తింపు పొందింది. 2008లో చంద్రయాన్–1, 2013లో మార్స్ ఆర్బిటార్ స్పేస్‌క్రాఫ్ట్, 2023లో ఆదిత్య ఎల్1 మిషన్లను పీఎస్ఎల్వీ ద్వారానే ప్రయోగించారు. పీఎస్ఎల్వీ శ్రేణిలో ఇప్పటిదాకా చేపట్టిన 63 ప్రయోగాల్లో ఇది కేవలం మూడో వైఫల్యం. 1993 సెపె్టంబర్లో పీఎస్ఎల్వీ–డీ1 రాకెట్ ఐఆర్ఎస్–1ఈ ఉపగ్రహాన్ని, 2017 ఆగస్టులో పీఎస్ఎల్వీ–సీ39 రాకెట్ ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(ఐఆర్ఎన్ఎస్ఎస్)ను కక్ష్యలోకి ప్రవేశపెట్టలేకపోయాయి. -
ISRO: ఆకాశంలో నిఘా నేత్రం
సూళ్లూరుపేట: పహల్గాం ఉగ్ర దాడి, అందుకు ప్రతీకారంగా పాక్ పీచమణచిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేస్తోంది. అత్యంత అధునాతనమైన నిఘా ఉపగ్రహం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–09)ను ప్రయోగించనుంది. పీఎస్ఎల్వీ–సీ61 రాకెట్ ద్వారా దాన్ని కక్ష్యలోకి చేర్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నద్ధమైంది. ఆదివారం ఉదయం 5.59 గంటలకు శ్రీహరికోటలోని మొదటి లాంచ్‌ప్యాడ్ నుంచి ప్రయోగం జరగనుంది. 17 నిమిషాలకు ఉపగ్రహాన్ని 529 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్ (ఎస్ఎస్పీఓ)లో ప్రవేశపెడతారు. ఇది ఐదేళ్లపాటు సేవలందిస్తుందని ఇస్రో తెలియజేసింది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) శ్రేణిలో ఇది 63వ ప్రయోగం. కాగా ఇస్రో చరిత్రలో 101వ ప్రయోగం. ఈ ప్రయోగం ద్వారా టెస్ట్ వెహికల్–డీ2 (టీవీ–డీ2) మిషన్‌ను కూడా రోదసిలోకి పంపుతున్నారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.నారాయణన్ శనివారం చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో పూజలు చేయించారు. సరిహద్దులపై డేగకళ్లు మేఘాలు, దట్టమైన చీకటి కమ్ముకున్నా, తుఫాన్ల వంటివి చెలరేగినా చాలా ఉపగ్రహాలు మూగవోతాయి. కానీ ఈఓఎస్–09 అలా కాదు. అన్ని రకాల అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, రేయింబవళ్లూ బ్రహా్మండంగా పని చేస్తుంది. సాధారణ ఆప్టికల్ శాటిలైట్లకు అడ్డుగోడలుగా నిలిచే మేఘాలు, వర్షాలు, దుమ్మూధూళి, పొగమంచు వంటివాటి గుండా కూడా భూమిని అత్యంత స్పష్టంగా చూడగలుగుతుంది. అత్యాధునిక సి బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ సాయంతో ఒక మీటర్ పరిధిలోని వస్తువులను కూడా కచి్చతత్వంతో ఫొటోలు తీస్తుంది. → రెండు దశాబ్దాల క్రితం రూపొందించిన పూర్తి దేశీయ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ (రిశాట్)–1కు ఈఓఎస్–09 నిఘా ఉపగ్రహం కొనసాగింపు. → చట్టవ్యతిరేక కార్యకలాపాలను, తీవ్రవాదుల ఉనికిని గుర్తించగలదు. వాహనాల కదలికలను కూడా అత్యంత స్పష్టంగా, కచ్చితంగా చిత్రించడం దీని ప్రత్యేకత. → ఇందుకోసం దీనికి హెచ్ఆర్ఎస్ (హై రిజల్యూషన్ స్పాట్లైట్), మీడియం రిజల్యూషన్ స్కాన్ (ఎస్ఏఆర్) వంటి అత్యాధునిక హంగులు అమర్చారు. → వ్యవసాయం, అడవుల పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణ, పట్టణ ప్రణాళిక, జాతీయ భద్రత వంటి అంశాల్లో ఇది కీలకమైన సేవలు అందించనుంది. → దీని డేగకళ్లు పాక్ నుంచి చైనా దాకా మన 15 వేల కి.మీ. విస్తారమైన సరిహద్దులను, 7,500 కి.మీ. పొడవైన సముద్రతీరాన్ని అణువణువూ కాపు కాస్తాయి. ఎలాంటి అనుమానాస్పద కదలికలనైనా ఇట్టే పట్టేస్తాయి. → వరదల వంటి ప్రాకృతిక విపత్తుల వేళ మేఘాలను చీల్చుకుంటూ ఈఓఎస్–09 అందించే రియల్ టైం చిత్రాలు, డేటా నష్ట తీవ్రతను తక్షణం అంచనా వేయడంలో దోహదపడతాయి. -
మన అంతరిక్ష కేంద్రంపై... ఇస్రో కీలక నిర్ణయం
ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారతీయ అంతరిక్ష స్టేషన్ (బీఏఎస్)కు సంబంధించి కీలక ముందడుగు పడింది. దీన్ని భూ స్థిర కక్ష్యలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో దాదాపు సమానంగా 51.5 డిగ్రీల ఆర్బిటల్ ఇంక్లినేషన్ (కక్ష్య తాలూకు వంపు కోణం)లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యోమ నౌకల ప్రయోగం తదితరాల్లో ఆర్బిటల్ ఇంక్లినేషన్ (ఓఐ)ది చాలా కీలక పాత్ర. 51.5 డిగ్రీల ఓఐ వల్ల అంతరిక్షం నుంచి భూమిని సమగ్రంగా పర్యవేక్షించేందుకు అవకాశముంటుంది. ఈ కోణంలో అంతరిక్ష కేంద్రం భూమిపై దాదాపు 90 శాతానికి పైగా జనావాసాలనూ కవర్ చేస్తూ పరిభ్రమిస్తుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అంతరిక్ష పరిశోధన కేంద్రాలతోనూ అనుసంధానం సులభతరం అవుతుంది. అందుకే ఇస్రో ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. ఐఎస్ఎస్ కక్ష్యే ఎందుకు? ఐఎస్ఎస్ భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో స్థిర కక్ష్యకు 51.6 డిగ్రీల వంపు కోణంలో పరిభ్రమిస్తుంది. బీఏఎస్ కోసం ఇస్రో దాదాపు అదే కోణాన్ని ఎంచుకోవడం దూరదృష్టితో కూడిన నిర్ణయమని చెబుతున్నారు. ఈ కోణంలో భూమిని అత్యంత విస్తృతంగా కవర్ చేయడం సులువవుతుంది. అంతేగాక ఐఎస్ఎస్ 2030 నాటికి పూర్తిగా తెరమరుగు కానుంది. తద్వారా అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధనలకు సంబంధించి ఏర్పడే శూన్యాన్ని బీఏఎస్ భర్తీ చేస్తుందని భావిస్తున్నారు. దీనికి తోడు వ్యోమనౌకలు అంతరిక్ష కేంద్రానికి సులువుగా అనుసంధానమయేందుకు ఈ కోణం వీలు కలి్పస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ‘‘తద్వారా ఇంధన వాడకం తగ్గడమే గాక పనితీరుకు సంబంధించిన అనేకానేక సంక్లిష్టతలు తప్పుతాయి. దీనికి తోడు ఐఎస్ఎస్తో కమ్యూనికేషన్, ట్రాకింగ్ కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలన్నింటినీ ఇస్రో యథాతథంగా వాడుకోగలుగుతుంది. కనుక మనకు వ్యయ ప్రయాసలు కూడా బాగా తగ్గిపోతాయి’’ అని ఇస్రో మాజీ ఇంజనీర్ మనీశ్ పురోహిత్ వివరించారు. అయితే బీఏఎస్ ఏర్పాటులో కీలకమైన 51.6 డిగ్రీల ఆర్బిటల్ ఇంక్లినేషన్ను సాధించడం సవాలే కానుందని ఆయన అభిప్రాయపడ్డారు. బీఏఎస్ కొన్ని విశేషాలు... → భారతీయ అంతరిక్ష స్టేషన్ అంతరిక్షంలో మన సొంత పరిశోధన కేంద్రం → ఐఎస్ఎస్ మాదిరిగానే ఇది కూడా భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పాటు కానుంది → బీఏఎస్ ప్రస్తుతం డిజైన్ దశలో ఉంది → దీన్ని 2035కల్లా పూర్తిస్థాయిలో నిర్మించాలన్నది లక్ష్యం → బీఏఎస్ నమూనాను 2029 కల్లా ప్రయోగాత్మకంగా పరీక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
భూమి గుండ్రంగా కాదు.. దీర్ఘవృత్తంగా ఉండును!
భూమి గుండ్రంగా ఉండును. ఇది చిన్నప్పటి నుంచీ మనమంతా వింటున్నదే. నిజానికి పూర్తిగా గుండ్రంగా కాకుండా ఓ మాదిరి దీర్ఘవృత్తాకారంలో ఉందట. అసలు ఆ మాటకొస్తే భూమి ఇంకా పూర్తి రూపాన్ని సంతరించుకునే క్రమంలోనే ఉందట. దీర్ఘవృత్తాకారం రావడానికి కారణమైన గురుత్వాకర్షణ శక్తే భూమికి ఓ నిశ్చిత రూపాన్నిచ్చే పనిలో మునిగి ఉందని సైంటిస్టులు చెబుతుండటం విశేషం! భూమిపై నుంచి అంతరిక్షంలోకి జారిపోకుండా మనల్ని కాపాడుతున్నది, భూమిపై పట్టి ఉంచుతున్నది గురుత్వాకర్షణ శక్తేనన్నది తెలిసిందే. భూమికి ఉన్న ఆ శక్తే భూమిని లోలోపలి నుంచి సమ్మెట పోట్లను తలపించేలా ఒత్తిడి చేసీ చేసీ దీర్ఘవృత్తాకారానికి తీసుకొచ్చిందట. భూమి కేంద్రానికి, ఉపరితలానికి మధ్య దూరం భూమధ్యరేఖ వద్ద ఒకలా, ధ్రువాల వద్ద ఇంకోలా ఉండటానికి ఈ దీర్ఘవృత్తాకారమే కారణమట. భూమి రూపాన్ని తీర్చిదిద్దే ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉందని తాజాగా కనిపెట్టామంటున్నారు అంతరిక్ష శాస్త్రవేత్తలు. భూమి ఆకారాన్ని నిర్దేశించడంలో గురుత్వాకర్షణ శక్తితో పాటు ఎగుడుదిగుడు ఉపరితలం, లోపలి పొరల్లో ఉన్న వనరుల అసమతుల విస్తృత వంటి పలు ఇతర కారకాల ప్రమేయమూ ఉందని పరిశోధన తేల్చింది. ఒకప్పుడు భూమిపై 30 కిలోమీటర్ల పైచిలుకు ఎత్తు దాకా ఉన్న పర్వతాలు గురుత్వాకర్షణ శక్తి వల్లే క్రమంగా తగ్గుతూ వచ్చాయట. భూమిపై ఉన్న విభిన్న స్థలాకృతులు, పై పొరల కదలికలు తదితరాలు కూడా ఇందుకు కారణమయ్యాయని తేలింది. భూమి ఎలా ఏర్పడిందో అర్థం చేసుకునే ప్రయత్నానికి ఈ తాజా ఆవిష్కరణలు కొత్త కోణాలను అందిస్తున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఇదీ చదవండి: IPCC: వాతావరణ మార్పులతో దేశాలన్నీ అతలాకుతలం -
థర్మల్ ప్లాంట్ కోసం పోలాకిలో భూ పరిశీలన
పోలాకి: జిల్లాలో థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటులో భాగంగా జపాన్‌కు చెందిన సుమితొమొ సంస్థ ప్రతినిధులు జిల్లాలోని పలు ప్రాంతాలను మంగళవారం పరిశీలించారు. పోలాకిలోని తోటాడ గ్రామం వద్ద ప్రతిపాదిత స్థలాన్ని బుధవారం పరిశీలించనున్నారు. ఇందులో భాగంగా జెన్కో అధికారులు తోటాడ గ్రామానికి చేరుకుని భూముల వివరాలపై ఆరా తీశారు. ఇక్కడ నుంచి రైల్వేస్టేషన్, సముద్రతీరం, జాతీయ రహదారికి గల దూరాలను అంచనా వేశారు. భూముల పరిశీలనకు వచ్చిన వారిలో ఏపీ జెన్కో సంస్థ ఈఈ కె.సూర్యనారాయణ, కన్సల్టెన్సీ ప్రతినిధి ఎం.మనోహర్, తహశీల్దార్ జె.రామారావు, ఆర్ఐలు అనిల్‌కుమార్, బాలకృష్ణ, మండల సర్వేయర్లు ఉన్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో మండల సలహాదారు తమ్మినేని భూషణరావుతో సదరు అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జెన్కో ఈఈ సూర్యనారాయణ మాట్లాడుతూ ఇక్కడ ప్లాంట్ నిర్మాణానికి అనుకూలతలను జాపాన్ బృందం పరిశీలించనుందన్నారు. ఇది ప్రాథమిక పరిశీలన మాత్రమేనని, సాంకేతిక నిపుణుల పరిశీలన మేరకు అనుకూలమైతే తుదినిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అధికారులు గుర్తించిన భూములు వివరాలు ఇవే.. మండలలోని గత వారం రోజులుగా ప్లాంట్ కోసం రెవెన్యూ అధికారులు కసరత్తు చేసి తోటాడ పరిసర గ్రామాల్లో 2227.620 ఎకరాల భూములు గుర్తించారు. ఇందులో 1050 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా మిగిలినది అక్కడి రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. ఈ భూములు చీడివలసలో472 ఎకరాలు, యాట్లబసివలస-138, కొండలక్కివలస-407, ఓదిపాడు-605, కుసుమపోలవలస-25, ధీర్ఘాశి-204, తోటాడ-336, చెల్లాయివలస గ్రామ పరిధిలో 338 ఎకరాలు ఉన్నట్టు గుర్తించారు.