breaking news
Dried crops
-
రైతాంగం సంక్షోభంలో ఉంది: ఉత్తమ్
డిచ్ పల్లి: పంట నష్టాన్ని అంచనా వేయడంలో తెలంగాణ సర్కార్ విఫలమైందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారం నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ముల్లంగిలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించి, వారి సమస్యలు అడిగితెలుసుకున్నారు. రాష్ట్రంలో రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతులకు వెంటనే పంట నష్టపరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఇన్ పుట్ సబ్సిడీ విషయంలో కూడా వారికి పూర్తిగా ఉపశమనం కల్పించి.. పూర్తిగా వారి రుణాలు మాఫీ చేయాలని ఉత్తమ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, పార్టీకి చెందిన నేతలు ఉత్తమ్ తో కలిసి నిజామాబాద్ జిల్లా రైతులను పరామర్శించారు. -
కాంగ్రెస్ పాలనలో.. రైతే రాజు
టీఆర్ఎస్ పాలనలో.. కాంట్రాక్టరే రాజు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపణ పాలమూరు జిల్లాలో ఎండిన పంటల పరిశీలన నవాబుపేట/బాలానగర్: కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ పాలనలో రైతే రాజులా పాలన సాగించి రైతులను ఆదుకుందని, కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టర్‌ను రాజు ను చేసి పాలన సాగిస్తోందని టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట, బాలానగర్ మండలాల్లోని పలు గ్రామాల్లో అతివృష్టి, అనావృష్టితో ఎండిపోయిన పంటలను టీపీసీసీ బృందం పరిశీలించింది. ఆయా చోట్ల ఉత్తమ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, కాకతీయ పథకాలకు నిధులు ఖర్చు చేస్తూ రైతులను విస్మరించిందన్నారు. మిషన్ పథకాల కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ రైతులపై లేదని ఆరోపించారు. ఎన్నికల సందర్భంలో రైతులకు రుణమాఫీ హామీ ఇచ్చి.. నాలుగు విడతల్లో మాఫీ చేస్తామంటూ మాయమాటలు చెప్పారన్నారు. రెండేళ్లు గడిచినా మూడో విడత మాఫీ జరగలేదన్నారు. పాలమూరు జిల్లాలో పంటలను పరిశీలించి పంట నష్టం అంచనా వేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇవ్వకపోవడంతో విడ్డూరమన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తున్నట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరించారు. పంటలను పరిశీలించిన వారిలో గద్వాల, వనపర్తి ఎమ్మెల్యేలు డీకే అరుణ, చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, టీపీసీసీ మీడియా కో-కన్వీనర్ బండి సుధాకర్‌గౌడ్ తదితరులు ఉన్నారు. ఒక్క గ్రూప్‌కూ 15 లక్షల రుణమివ్వలేదు తెలంగాణ గవర్నమెంట్ వస్తే మహిళాగ్రూపులకు రూ.15 లక్షలవరకు వడ్డీలేని అప్పులిస్తామన్నారు. కానీ ఏ ఒక్క గ్రూప్‌నకు రూ.15 లక్షల రుణాలు బ్యాంకులు ఇవ్వలేదు’ అని బాలానగర్ మండలం మల్లేపల్లి గ్రామ శివారులో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బృందానికి ఆ గ్రామ మహిళా రైతులు అంజమ్మ, మంజుల, లక్ష్మి వివరించారు. ‘రాజశేఖరరెడ్డి సారు ఉన్నప్పుడు బ్యాంకుల్లో మేము తీసుకున్న రుణాలు అన్ని ఒకేసారి మాఫీ చేసిండ్రు. ఇప్పుడేమో ఒక్కరికి రూ.లక్ష వరకే అన్నారు. అది కూడా నాలుగు విడతలన్నారు. ఒక్కసారి ఇచ్చిండ్రు’ అంటూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. -
పంటలు ఎండుతున్నాయ్!
కడప అగ్రికల్చర్/ రాజుపాళెం: రబీ సీజన్లో సాగు చేసిన పంటలు ఎండిపోతుండడంతో రైతుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఈ రబీ సీజన్లో జిల్లాలో మొత్తం అన్ని రకాల పంటలు కలిపి 2.05 లక్షల హెక్టార్లలో సాగవుతాయని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. పంటల సాగు ప్రారంభంలో పదునుపాటి వర్షాలు పడడంతో రైతులు ఎంతో ఆశతో పంటలను సాగు చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 1,13,387 హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగయ్యాయి. అక్టోబరు నెల మొదటి వారం నుంచి రబీ సీజన్ ప్రారంభమైంది. ఆ నెలలో 131.9 మిల్లీమీటర్ల వర్షపాతానికి గాను 73.7 మి.మీ. కురిసింది. నవంబరులో 93.4 మి.మీ. వర్షపాతానికి గాను 22.9 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఈ డిసెంబరు నెలలో 25.7 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు చుక్క చినుకు కూడా భూమి మీద పడలేదు. నవంబరు 13వ తేదీ నుంచి ఇప్పటికి దాదాపు 25 రోజులుగా వర్షాలు లేకపోవడంతో అన్ని పంటలు వాడుదశకు చేరుకున్నాయి. జిల్లాలో ప్రధాన పంట అయిన బుడ్డశనగ 52022 హెక్టార్లలోనూ, ధనియాలు 17,200 హెక్టార్లు, పొద్దుతిరుగుడు 5944 హెక్టార్లు, మినుము 5020 హెక్టార్లు, పెసర 4476 హెక్టార్లు, ఉలవ 2447 హెక్టార్లు, మొక్కజొన్న 1490 హెక్టార్లు, జొన్న 7065 హెక్టార్లలో సాగైంది. వర్షాభావంతో ఆయా పంటలన్నీ ఎండిపోతుండడంతో రైతన్న లబోదిబోమంటున్నాడు. గతనెల చివరి వారంలో తుపాను ప్రభావంతో కొంతవరకైనా వర్షపు జల్లులు కురుస్తాయని రైతులు ఎంతగానో ఆశించారు. కానీ ఆశలన్నీ నిరాశలయ్యాయి. జమ్మలమడుగు, పెద్దముడియం, రాజుపాలెం, చాపాడు, ముద్దనూరు, ఎర్రగుంట్ల, దువ్వూరు, మైదుకూరు ప్రాంతాలలో అధిక విస్తీర్ణంలో సాగు చేసిన బుడ్డశనగ, మినుము,కడప అగ్రికల్చర్/ రాజుపాళెం: రబీ సీజన్లో సాగు చేసిన పంటలు ఎండిపోతుండడంతో రైతుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఈ రబీ సీజన్లో జిల్లాలో మొత్తం అన్ని రకాల పంటలు కలిపి 2.05 లక్షల హెక్టార్లలో సాగవుతాయని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. పంటల సాగు ప్రారంభంలో పదునుపాటి వర్షాలు పడడంతో రైతులు ఎంతో ఆశతో పంటలను సాగు చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 1,13,387 హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగయ్యాయి. అక్టోబరు నెల మొదటి వారం నుంచి రబీ సీజన్ ప్రారంభమైంది. ఆ నెలలో 131.9 మిల్లీమీటర్ల వర్షపాతానికి గాను 73.7 మి.మీ. కురిసింది. నవంబరులో 93.4 మి.మీ. వర్షపాతానికి గాను 22.9 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఈ డిసెంబరు నెలలో 25.7 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు చుక్క చినుకు కూడా భూమి మీద పడలేదు. నవంబరు 13వ తేదీ నుంచి ఇప్పటికి దాదాపు 25 రోజులుగా వర్షాలు లేకపోవడంతో అన్ని పంటలు వాడుదశకు చేరుకున్నాయి. జిల్లాలో ప్రధాన పంట అయిన బుడ్డశనగ 52022 హెక్టార్లలోనూ, ధనియాలు 17,200 హెక్టార్లు, పొద్దుతిరుగుడు 5944 హెక్టార్లు, మినుము 5020 హెక్టార్లు, పెసర 4476 హెక్టార్లు, ఉలవ 2447 హెక్టార్లు, మొక్కజొన్న 1490 హెక్టార్లు, జొన్న 7065 హెక్టార్లలో సాగైంది. వర్షాభావంతో ఆయా పంటలన్నీ ఎండిపోతుండడంతో రైతన్న లబోదిబోమంటున్నాడు. గతనెల చివరి వారంలో తుపాను ప్రభావంతో కొంతవరకైనా వర్షపు జల్లులు కురుస్తాయని రైతులు ఎంతగానో ఆశించారు. కానీ ఆశలన్నీ నిరాశలయ్యాయి. జమ్మలమడుగు, పెద్దముడియం, రాజుపాలెం, చాపాడు, ముద్దనూరు, ఎర్రగుంట్ల, దువ్వూరు, మైదుకూరు ప్రాంతాలలో అధిక విస్తీర్ణంలో సాగు చేసిన బుడ్డశనగ, మినుము,పెసర పంటలు వర్షాభావంతో ఎండిపోతున్నాయని ఆయా ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో వర్షాలు గనుక కురవకపోతే పంట దిగుబడులను మరిచిపోవాల్సిందేనని రైతులు మదన పడుతున్నారు. కేసీ చాపాడు, కుందూనది పరిధిలోని రైతులు ఆయిల్ ఇంజన్లు, ట్రాక్టర్ల పంపుల సహాయంతో ఎకరాకు రూ.1 నుంచి 3 వేల వరకు ఖర్చు చేసి నీటితుడులు అందించుకుంటున్నారు. పర్లపాడు, అర్కటవేముల, పొట్టిపాడు, చిన్నశెట్టిపల్లె, సోమాపురం, రాజుపాళెం తదితర గ్రామాల్లోని రైతులకు ఏనీరు రాక పంటలు ఎండుముఖం పడుతున్నాయి. నాలుగు రోజుల కిందట మైలవరం నీటిని వరిలామని అధికారులు చెబుతున్నా ఇంకా ఇంతవరకు మండలంలోని గ్రామాల పొలాలకు రాలేదని రైతులు వాపోతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టామని ఎండుముఖం పట్టడంతో ఆందోళన చెందుతున్నామన్నారు. పెట్టుబడులన్నీ నేలపాలు కాక తప్పదని అంటున్నారు.