breaking news
Dr. raviraju
-
ఏప్రిల్ మొదటి వారంలో పీజీ మెడికల్ కౌన్సెలింగ్
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): 2017–18 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ డిగ్రీ/డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లకు కౌన్సెలింగ్ ప్రక్రియ ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమవుతుందని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ టి.రవిరాజు తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. నీట్ పీజీ మెడికల్ ర్యాంకుల ఆధారంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్లిస్టును తయారు చేస్తామన్నారు. అనంతరం ఏప్రిల్ మూడో వారంలో మొదటి విడత వెబ్ ఆప్షన్లకు గడువిచ్చి, అనంతరం 25వ తేదీ నుంచి 28వ తేదీలోపు సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తామని వెల్లడించారు. మే 1వ తేదీ నాటికి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. -
నిలకడగా కంచి పీఠాధిపతి ఆరోగ్యం
అస్వస్తతకు గురై ఆస్పత్రిలో చేరిన కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వత్రి ఆరోగ్యం నిలకడగా ఉంది. జయేంద్ర సరస్వత్రిని ఐసీయూ నుంచి మెడికల్ వార్డకు తరలించినట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రవిరాజు తెలిపారు. జయేంద్ర సరస్వతి షుగర్ లెవెల్స్ సాధారణ స్థితికి వచ్చాయన్నారు. గురువారం ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వివరించారు.