breaking news
Donetsek Province
-
రష్యా మరో ఎత్తుగడ.. ఉక్రెయిన్ ప్రాంతాల విలీనానికి ‘రిఫరెండం’
కీవ్: ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగాలను సంపూర్ణంగా విలీనం చేసుకొనే ప్రక్రియను రష్యా వేగవంతం చేసింది. ఆ ప్రాంతాల్లో శుక్రవారం రిఫరెండం మొదలు పెట్టింది. లుహాన్స్క్, ఖేర్సన్‌తోపాటు జపోరిజియా, డోనెట్స్క్లోని కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఇది మంగళవారం దాకా కొనసాగుతుందని ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల వర్గాలు వెల్లడించాయి. రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో రష్యన్ భాష మాట్లాడేవారే ఎక్కువ. వారంతా రష్యాలో చేరడానికి మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. తమకు అనుకూలమైన ఉక్రెయిన్ తిరుగుబాటుదారులతోనే ఈ ప్రక్రియ చేయించింది. శుక్రవారం నుంచి ప్రారంభమైన ఈ ఓటింగ్ ఈనెల 27న ముగియనుంది. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా 4ప్రాంతాలను తమ దేశంలో విలీనం చేసుకుని, సరిహద్దులను సవరించుకుంటే, వాటిజోలికి ఎవరూరారని రష్యా మాజీ అధ్యక్షుడు, ఆ దేశ భద్రతామండలి ఉపాధ్యక్షుడు మెద్వదేవ్ పేర్కొన్నారు. ఈ ప్రాంతాలు రష్యాలో విలీనం అయ్యాక వీటిని కాపాడుకునేందుకు అవసరమైతే ఎలాంటి ఆయుధాలనైనా ఉపయోగిస్తామన్నారు. పరోక్షంగా ఆయన అణు హెచ్చరికలు చేశారు. మరోవైపు.. రష్యా ఆక్రమించుకున్న 4 ప్రాంతాల్లో రెఫరెండం చేపట్టడాన్ని ఒక బూటకపు ప్రక్రియగా ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా అభివర్ణించారు. రిఫరెండంపై పశ్చిమ దేశాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదీ చదవండి: పుతిన్ ప్రకటనతో రష్యాలో అల్లకల్లోలం.. భయాందోళనతో దేశం బయటకు! -
ప్రజాభిప్రాయం స్వాతంత్య్రమే
డోనెట్సెక్ ప్రావిన్స్ రెబెల్స్ ప్రకటన ఉక్రెయిన్ విచ్ఛిన్నం అనివార్యం! డోనెట్సెక్/మాస్కో:ఉక్రెయిన్‌లో అంతర్గత సంక్షోభం ముదిరిపోవటంతో మరో విచ్ఛిన్నం అనివార్యంగా మారింది. ఉక్రెయిన్ నుంచి విడిపోవాలని, స్వతంత్ర దేశంగా మారి రష్యాలో చేరాలని డోనెట్సెక్ ప్రావిన్స్ మెజారిటీ ఓటర్లు రిఫరెండం (ప్రజాభిప్రాయ సేకరణ)లో తీర్పు ఇచ్చారని.. రష్యా అనుకూల తిరుగుబాటుదార్లు ఏర్పాటు చేసిన ఎన్నికల కమిషన్ ప్రకటించింది. డోనెట్సెక్ పొరుగు రాష్ట్రమైన లుగాంస్క్‌లో కూడా ఇదే తరహా రిఫరెండం జరిగినప్పటికీ.. ఆ ఫలితాలను ప్రకటించలేదు. ఈ రిఫరెండం అక్రమమని, బూటకమని ఉక్రెయిన్ సహా అమెరికా, ఐరోపా దేశాలు మండిపడుతుండగా.. స్వీయపాలన కోసం రిఫరెండం ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తున్నామని రష్యా ప్రకటించింది. అయితే రష్యాలో చేర్చుకోవాలన్న డోనెట్సెక్ ప్రకటనపై ఆ దేశం స్పందించలేదు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని డోనెట్సెక్, లుగాంస్క్ ప్రావిన్స్‌లలో తిరుగుబాటుదార్లు స్వాతంత్య్రం కోసం ఆదివారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌లోని 4.6 కోట్ల మంది జనాభాలో ఈ రెండు ప్రావిన్స్‌లలో 70 లక్షల మంది (డోనెట్సెక్‌లో 44 లక్షలు, లుగాంస్క్‌లో 22 లక్షల మంది) ఉన్నారు. రష్యా అనుకూల తిరుగుబాటుదార్లు, ఉక్రెయిన్ సైనిక బలగాలకు మధ్య ఘర్షణలు జరుగుతున్న సమయంలో.. విదేశీ మీడియాకు అనుమతి ఇవ్వకుండా ఈ రిఫరెండాలు నిర్వహించారు. డోనెట్సెక్ రెఫరెండం ఫలితాలను తిరుగుబాటుదార్లు ఏర్పాటు చేసుకున్న ఎన్నికల కమిషన్ చీఫ్ రోమన్ల్యాగిన్ ఆదివారం రాత్రి పొద్దుపోయాక ప్రకటించారు. మొత్తం 75 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొనగా అందులో 89 శాతం మంది స్వాతంత్య్రానికి అనుకూలంగా తీర్పునిచ్చారని.. 10 శాతం మంది మాత్రమే వ్యతిరేకించారని ఆయన డోనెట్సెక్‌లో విలేకరుల సమావేశంలో తెలిపారు. తాజా పరిణామాలతో ఉక్రెయిన్ విచ్ఛిన్నమవుతుందని.. యూరప్ తూర్పు కొసలో అంతర్యుద్ధం రాజుకుంటుందని పాశ్చాత్యదేశాలు ఆందోళన చెందుతున్నాయి.