Dominated fight
-
చైనా ఆధిపత్యాన్ని అడ్డుకుంటాం
సింగపూర్: ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడం ఇప్పటికీ తమ లక్ష్యంగానే ఉందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. అదేవిధంగా, పసిఫిక్ సముద్ర ప్రాంత దేశాల భద్రతకు అమెరికా కట్టుబడి ఉంటామన్నారు. అమెరికా భద్రతకు వికాసానికి ఈ ప్రాంతం చాలా కీలకమైందని చెప్పారు. పసిఫిక్ రీజియన్‌లో సుస్థిరమైన, సానుకూల అధికార సమతుల్యతను సాధించడమే తమ లక్ష్యమని చెప్పారు. సింగపూర్‌లో జరుగుతున్న షాంగ్రి–లా రక్షణ సదస్సులో శనివారం హెగ్సెత్ మాట్లాడారు. మునుపెన్నడూ లేని విధంగా చైనా సైనిక పాటవాన్ని పెంచుకుంటుండటంపై ఈ ప్రాంతంలోనే కాదు మిగతా దేశాల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందన్నారను. ఇక్కడి భద్రతా వాతావరణంపై తమకు స్పష్టమైన అంచనా ఉందన్నారు. పసిఫిక్ ప్రాంతం ఏదో ఒక దేశం ఆధిపత్యంలోకి వెళ్తే అది ప్రాంతీయ శక్తి సమతుల్యతను దెబ్బతీస్తుందని, మనం పరరిక్షించుకోవాలని ప్రయత్నిస్తున్న సమతుల్యత ప్రమాదంలో పడుతుందన్న విషయం తమకు తెలుసునని హెగ్సెత్ పేర్కొన్నారు. అందుకే, చైనాయే కాదు, మరే దేశమూ ఈ ప్రాంతంపై ఆధిపత్యం నెలకొల్పుకునే అవకాశం తాము ఇవ్వబోమని స్పష్టం చేశారు. అదే సమయంలో చైనాతో తాము ఘర్షణాత్మక వైఖరిని ఆవలంభించబోమని చెప్పారు. ఇటీవల ట్రంప్, జిన్ పింగ్ మధ్య జరిగిన భేటీని ప్రస్తావిస్తూ హెగ్సెత్..అమెరికా, చైనాలు తమ ప్రయోజనాలను కాపాడుకుంటూనే పరస్పర ప్రయోజనాల విషయంలో ఆచరణాత్మకమైన ఒప్పందాలను కుదుర్చుకోవాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. న్యాయబద్ధమైన, పరస్పర సహకారంతో కూడిన వ్యూహాత్మక, నిర్మాణాత్మక సంబంధాలను నెలకొల్పుకునేందుకు అంగీకరించారని చెప్పారు. మిత్ర దేశాలు రక్షణ వ్యయాన్ని పెంచుకోవాలని తమ ప్రభుత్వం కోరుకుంటోందంటూ ఆయన..ఈ విషయంలో పలు ఆసియా దేశాలు చేస్తున్న ప్రయత్నాలను కొనియాడారు. కేవలం ఆదర్శప్రాయమైన సిద్ధాంతాలను కాకుండా దేశ ప్రయోజనాల పరిరక్షణకే ప్రాధాన్యం ఇస్తున్నాయని చెప్పారు. అదే సమయంలో యూరప్ దేశాల వైఖరిని హెగ్సెత్ తప్పుబట్టారు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్(ఐఐఎస్ఎస్) ఆధ్వర్యంలోని సింగపూర్‌లోని షాంగ్రి–లా హోటల్లో 2002 నుంచి జరుగుతున్న ఈ సదస్సుకు భారత్ సహా 30కిపైగా దేశాల నుంచి అగ్ర నేతలు, దౌత్యవేత్తలు, రక్షణ శాఖల అధికారులు హాజరవుతారు.భారత్–పాక్ ఘర్షణను ట్రంప్ ఆపారుగతేడాది భారత్, పాకిస్తాన్ల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతోనే సమసిపోయాయని హెగ్సెత్ పేర్కొన్నారు. అణు సామర్థ్యం ఉన్న ఈ రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడంలో ట్రంప్ చేసిన కృషి అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. భారత్, పాక్‌ల నాలుగు రోజుల సంక్షోభాన్ని తానే నివారించానంటూ ట్రంప్ గతంలో పలుమార్లు ప్రకటించుకోగా, భారత్ ఖండించడం తెల్సిందే. -
‘ఎర్ర’కోటలో కాషాయ కాంతులు!
అగర్తలా: ఈశాన్య రాష్ట్రాల్లో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ.. ఈసారి త్రిపురలో అధికారం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ రాష్ట్రం కోసం ‘కాంగ్రెస్ ముక్త భారత్’ విధానాన్ని మార్చుకుని.. ‘కమ్యూనిస్ట్ ముక్త త్రిపుర’ నినాదంతో దూసుకెళ్తోంది. 1972లో త్రిపుర ఏర్పాటైనప్పటినుంచి తొలిసారిగా ‘లెఫ్ట్–రైట్’ మధ్య పోటీ నెలకొందని ‘పీపుల్స్‌పల్స్’ సంస్థ జరిపిన సర్వేలో వెల్లడైంది. ప్రతి ఊరూ వామ‘పక్ష’మే దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల ప్రాభవం తగ్గుతున్నా వారికి కంచుకోటలా ఉన్న రాష్ట్రాల్లో త్రిపుర చాలా కీలకమైనది. చిన్న రాష్ట్రమైనా 4 దశాబ్దాలుగా (1988–92 దఫా మినహా) అధికారంలో ఉండటంతో ఇంటింటికీ వేళ్లూనుకుపోయిన పరిస్థితి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వామపక్ష ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలదే పైచేయి. ‘ఎర్ర’కోటలో కమ్యూనిస్టులను ఎదుర్కొనేందుకు ఇన్నాళ్లుగా కాంగ్రెస్ చాలా ప్రయత్నించింది. త్రిపురలో రెండే వర్గాలుంటాయి. ఒకటి సీపీఎం అనుకూల వర్గం (దాదాపు 60%), రెండోది వ్యతిరేక వర్గం (మిగిలిన 40%). సీపీఎంను దెబ్బతీస్తూ.. త్రిపురలో బెంగాలీల జనాభా ఎక్కువ. దీనికితోడు కొంతకాలంగా త్రిపురలో గిరిజన తెగల మధ్య (సీపీఎం అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య) ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. ఇన్నిసార్లు మద్దతిస్తున్నా కాంగ్రెస్‌కు అధికారం దక్కకపోవటంతో సీపీఎం వ్యతిరేక వర్గం ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూసింది. ఈ నేపథ్యంలో అధికార వ్యతిరేక వర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు మూడేళ్ల క్రితమే ప్రయత్నాలు మొదలెట్టింది. 25 ఏళ్లుగా అధికారంలో ఉన్న సీపీఎంపై ప్రభుత్వ వ్యతిరేకతను, రాష్ట్రం వెనుకబాటుతనాన్ని ప్రచారాస్త్రాలుగా మలచుకుంది. కమ్యూనిస్టులకు బలమైన అండగా నిలుస్తున్న కార్మిక, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలకు గాలం వేసేందుకు.. ‘అధికారంలోకి వస్తే ఏడో వేతనసవరణ అమలుచేస్తాం’ అని హామీ ఇచ్చింది. దీని ప్రభావం రాష్ట్రంలోని లక్షన్నర మంది ఉద్యోగులపై, వారి కుటుంబాలపై సానుకూల ప్రభావం చూపవచ్చని పీపుల్స్ పల్స్ వెల్లడించింది. అటు, బెంగాలీలు, గిరిజనులను, ప్రభుత్వ అనుకూల వర్గాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్నడూ లేనంతగా త్రిపురలో ప్రముఖులతో ప్రచారం నిర్వహిస్తూనే.. ఇంటింటికి చేరువవుతోంది. అయితే విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ బలమైన కమ్యూనిస్టు కోటను ఈ ఒక్క ప్రయత్నంలోనే దెబ్బకొట్టలేరని పీపుల్స్ పల్స్ తెలిపింది. ఈసారికి ప్రధాన ప్రతిపక్షం హోదా దక్కవచ్చని అభిప్రాయపడింది. అధికారం మాదే ఈ ఎన్నికల్లో త్రిపురలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. 20వ బీజేపీ పాలిత రాష్ట్రంగా త్రిపుర మారనుందని ఆయన అగర్తలాలో సోమవారం పేర్కొన్నారు. పార్టీ మేనిఫెస్టోను పూర్తిగా అమలుచేసి రాష్ట్రాభివృద్ధికి పాటుపడతామని ఓటర్లకు భరోసానిచ్చారు. మణిపూర్, అస్సాంలలోనూ గతంలో ఒక్కసీటు కూడా లేని పరిస్థితినుంచి ఏకంగా అధికారాన్ని అందుకున్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. -
టీ‘ఢీ’పీ
జిల్లా తెలుగుదేశంలో గ్రూపుల పోరు పనులు, పదవుల కోసం పోటీ పరాకాష్టకు చేరుతున్న వివాదాలు తలపట్టుకుంటున్న అధిష్టానం జిల్లా టీడీపీలో గ్రూపుల పోరు పెరిగింది. నేతల మధ్య ఆధిపత్య పోరాటం తారస్థారుుకి చేరింది. పదవుల కోసం, పనుల కోసం నాయకులు కుమ్ములాడుకుంటున్నారు. పరస్పరం అధిష్టానానికి ఫిర్యాదు చేసుకుంటున్నారు. ఇటీవల పలు నియోజకవర్గాల్లో వర్గ పోరు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పలు చోట్ల మంత్రుల ముందే ‘నువ్వెంతంటే..నువ్వెంతన్న’ స్థారుులో మాటల యుద్ధాలు, వాగ్వాదాలు నెలకొన్నారుు. జనచైతన్య యాత్రల్లోనూ ఇవి బయటపడ్డారుు. దీంతో పార్టీ అధిష్టానం ఆలోచనలో పడిం ది. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమని జిల్లా పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. తిరుపతి : గత ఎన్నికల్లో టీడీపీ ఆరు అసెంబ్లీ స్థానాల్లోనూ, వైఎస్సార్సీపీ 8 చోట్లా గెలుపొందారుు. సత్యవేడు, శ్రీకాళహస్తి, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో కొద్ది మెజార్టీతోనే టీడీపీ గట్టెక్కింది. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించాక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సొంత జిల్లాపై దృష్టి పెట్టారు. నామినేటెడ్ పదవులిస్తాననీ, పార్టీ పరంగా సముచిత స్థానం కల్పిస్తాననీ, కాంట్రాక్టు పనులిప్పిస్తామని హామీలిచ్చారు. చాలా నియోజకవర్గాల్లో ఇలాంటివేమీ జరగలేదు. దీంతో పట్టణ, మండల స్థారుు నాయకుల్లో పార్టీపై అసంతృప్తి మొదలైంది. పదవులున్న వారు ఏదో ఒక రకంగా ఎదుగుతుంటే తొలినుంచీ పార్టీ జెండా మోసిన నాయకులకు ప్రాధాన్యత లేకపోవడం అసంతృప్తికి కారణమైంది. ఈ నేపథ్యంలో కుమ్ములాటలు మొదలయ్యారుు. చిత్తూరు, నగరి, మదనపల్లి, తంబళ్లపల్లి, శ్రీకాళహస్తి, తిరుపతి, సత్యవేడు నియోజకవర్గాల్లో ఇవి స్పష్టంగా కనిపిస్తున్నారుు. చిత్తూరులో టీడీపీ నాయకుల మధ్య వర్గ రాజకీయాలు నెలకొన్నారుు. ప్రధానంగా ఇక్కడున్న ఎమ్మెల్యే ప్రజాప్రతినిధికి, మరో సామాజిక వర్గానికి చెందిన నాయకులకూ నడుమ సఖ్యత లేకుండా పోరుుంది. కార్పొరేషన్ కార్యాలయాన్ని వేదికగా చేసుకుని కుమ్ములాడుకుంటున్నారు. కార్పొరేషన్ లోని పలు పనులను తాము చెప్పిన వాళ్లకే ఇవ్వాలని ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. కార్పొరేషన్లో ఇటీవల డిప్యూటీ ఇంజనీరును టీడీపీ చెందిన ఓ సామాజిక వర్గ నాయకులు మాతృశాఖకు సరెండర్ చేరుుంచారు. తనకు తెలియకుండా వ్యవహారం నడవడంతో ఆగ్రహించిన ప్రజాప్రతినిధి, సదరు డీఈఈని మళ్లీ చిత్తూరు కార్పొరేషన్‌కే తెప్పించుకున్నారు. గంగనపల్లె డివిజన్ ఉప ఎన్నికల విషయంలోనూ ఇది ప్రస్ఫుటమవుతోంది. నగరిలో ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమ నాయుడుతో పాటు ఆయన కుమారులు నియోజకవర్గంలో తిరుగుతున్నా పార్టీ నాయకుల మధ్య ఉన్న విభేదాలను అదుపు చేయలేకపోతున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాతినిధ్యం ఇస్తున్నారని తమకు ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని సీనియర్ నాయకులు అలకవహించిన సందర్భాలు కూడా ఉన్నారుు. పట్టణ టీడీపీ అధ్యక్షునికీ, ఎమ్మెల్సీకి మధ్య విభేదాలు ఏర్పడి పార్టీ పట్టణ అధ్యక్షున్ని తొలగించినట్లు ఆ పార్టీ పరిశీలకుడు ప్రకటించడం, ఆ తర్వాత కొందరు నాయకుల సంప్రదింపులతో వారిని పార్టీలో కలుపుకోవడం లాంటి సంఘటనలు కూడా చోటుచేసుకున్నారుు. పుత్తూరు మున్సిపాలిటీ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్, కో-ఆప్షన్ సభ్యులు తమ వార్డులకు నిధులు కేటారుుంచలేదంటూ తలుపులు వేసుకొని చైర్మన్‌తో కాంట్రాక్టుల విషయంలో వాగ్వాదాలకు దిగడం పార్టీలో క్రమశిక్షణ రాహిత్యాన్ని తెలియజేస్తోంది. మున్సిపల్ పీఠంపై ఒప్పందాన్ని కాదని ఒకరినే కొనసాగిస్తుండటం విభేదాలకు ఆజ్యం పోస్తోంది. తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలంలో ముదివేడుకు చెందిన ఓ మాజీ సర్పంచు, ఓ మండలస్థారుు ప్రజాప్రతినిధి, పార్టీ మండల నేత ఈ ముగ్గురే అభివృద్ది పనులన్నీ చేస్తుండటంతో టీడీపీలో వర్గపోరు భగ్గుమంటోంది. బి.కొత్తకోట మండలంలో అభివృద్ధి పనులన్నీ కొందరికే కట్టబెట్టారంటూ నెలక్రితం జరిగిన పార్టీ మండలస్థారుు సమావేశంలో పార్టీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి తిట్టుకుంటూ.. ఆరోపణలు చేసుకున్నారు. పెద్దమండ్యం మండలంలో పార్టీ మండల నేత, మరో నాయకుడి మధ్య వర్గపోరు సాగుతోంది. ములకలచెరువు మండలంలో ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య పోరు సాగుతోంది. అంగన్ వాడీ పోస్టులు, నీరు-చెట్టు పనుల కోసం గొడవలు పడ్డారు. తంబళ్లపల్లె మండలంలోనూ ఇదే తీరు. ఎమ్మెల్యే శంకర్‌పై పార్టీ అధినేత తనయుడు లోకేష్ బాబుకు ఫిర్యాదు చేసేందుకు అసంతృప్తి నాయకులు నిర్ణరుుంచారు. పలమనేరులో ఎమ్మెల్యే అమరనాథరెడ్డి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. తొలినుంచీ ఈయన ఆగమనాన్ని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ సుభాష్ చంద్ర బోస్ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. వీరిద్దరి మధ్య సఖ్యత కుదరడం లేదు.


