breaking news
domestick voilence
-
'ఆ మంత్రి భార్యను రెండుసార్లు చంపాలనుకున్నాడు'
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమనాథ భారతి మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆయన తన భార్యను రెండు సార్లు హత్య చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. ఇప్పటికే గృహహింసతోపాటు, హత్య చేసేందుకు కూడా తన భర్త ప్రయత్నించారని పోలీసులకు సోమనాథ భారతిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసు పురోగతిని కోర్టుకు వివరించారు. మొట్టమొదటి హత్య యత్నం ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు జరిగిందని, రెండోసారి ఆమె మణికట్టును చీల్చి చంపేయత్నం చేశారని కోర్టుకు పోలీసులు తెలిపారు. అయితే కోర్టు మాత్రం గురువారం కూడా సోమనాథను అరెస్టు చేసేందుకు పోలీసులకు అనుమతి ఇవ్వలేదు. మరోపక్క, ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై నిర్ణయాన్ని కూడా వెలువరించలేదు. ఇక కోర్టుకు హాజరైన భార్య లిపిక ఆయన తన కుక్క డాన్‌తో దాడి చేయించాడని తెలిపింది. తన నగలు ఆయన వద్దే ఉన్నాయని వాటిని తనకు ఇప్పించాలని కోర్టును అభ్యర్థించింది. -
'డాన్, నేను ఏ తప్పూ చేయలేదు'
న్యూఢిల్లీ: 'డాన్‌కు ఏమి తెలియదు. డాన్ ఏ నేరం చేయలేదు. ఇంట్లో వాళ్లను ఎక్కడైనా పెంపుడు జంతువులు హత్య చేస్తాయా' అని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి ప్రశ్నించారు. ఇంతకీ డాన్ అంటే ఏమిటని అనుకుంటున్నారా..? అది సోమనాథ భారతి పెంపుడు కుక్క పేరు. ప్రస్తుతం సోమనాథ భారతిపై ఆయన భార్య లిపికా మిత్రా తనపై హత్యా ప్రయత్నం చేశారని, గృహహింసకు పాల్పడ్డారని కేసు పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో కీలక దర్యాప్తు ప్రస్తుతం ఈ డాన్ చుట్టే తిరుగుతుంది. ఎందుకంటే లిపికా మిత్రా ప్రెగ్నెన్సీగా ఉన్న సమయంలో తన బాస్(సోమనాథ భారతి) ఆదేశాలను పాటించి డాన్ దాడి చేసిందని, మీదపడి కరిచిందని, ముఖ్యంగా తన కడుపుపై తీవ్రగాయాలు చేసిందని, మరికొన్ని చోట్ల కూడా దారుణంగా దాడి చేసి చంపేయత్నం చేసిందని పోలీసులకు వివరించింది. దీనికి సంబంధించిన వీడియో టేపులు కూడా ఉన్నట్లు ఆమె పేర్కొంది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన పోలీసులు ఈ కేసును భిన్న కోణాల్లో విచారిస్తున్నారు. అయితే, ఆ వీడియో టేపులను కావాలనే సోమనాథ భారతి మాయం చేసినట్లు కూడా ఆరోపిస్తున్నారు. ఢిల్లీ కోర్టులో అరెస్టు నుంచి ఉపశమనం పొందిన ఆయన విచారణ కోసం ఇటీవల తరచూ పోలీస్ స్టేషన్‌కు వెళుతున్నారు. ఈ క్రమంలో ఆయన పెంపుడు కుక్కను గురించి పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో తన జీపులోని వెనుక సీట్లో డాన్‌ను తీసుకొచ్చిన ఆయన దానిని మీడియాకు చూపిస్తూ 'పెంపుడు జంతువులు ఎక్కడైనా ఇంట్లో వాళ్లను హత్య చేస్తాయా.. డాన్ కరుస్తాడా? చూడండి అంటూ ప్రశ్నించారు. డాన్గానీ, తాను గానీ ఏ తప్పూ చేయలేదని నిజంగా కావాలంటే తన వద్ద టేపుల ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. బెయిల్ పిటిషన్ కోసం ఆ ఆడియో టేపులను కూడా జత చేసినట్లు చెప్పారు.