breaking news
DJ duvvada jaganatham
-
నేను కాదు.. నా సినిమానే మాట్లాడుతుంది: బన్నీ
తిరుచానూరు : ‘దువ్వాడ జగన్నాథం (డీజే)’ సినిమా విడుదల కోసం తాను కూడా ప్రేక్షకుడిలాగే ఎదురుచూస్తున్నానని యువ హీరో అల్లు అర్జున్ అన్నారు. తాను ఇప్పుడేమీ మాట్లాడేది లేదనీ, రెండ్రోజుల్లో సినిమానే అన్నీ మాట్లాడేస్తుందని ఆయన నవ్వుతూ చెప్పారు. అల్లు అర్జున్, పూజా హెగ్డేలు జంటగా నటించిన దువ్వాడ జగన్నాథం చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ చిత్ర యూనిట్ బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అనంతరం నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు హరీశ్ శంకర్‌తో కలిసి అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. అభిమానుల అంచనాలకు మించి దువ్వాడ జగన్నాథం(డీజే) సినిమా ఉంటుందని నిర్మాత దిల్‌రాజ్ తెలిపారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన 25వ చిత్రం డీజే అని తెలిపారు. శ్రీవారి ఆశీస్సులు, అభిమానులు, ప్రేక్షకుల ఆదరణతో ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ అల్లు అర్జున్ నుంచి అభిమానులు కోరుకునే డ్యాన్స్, ఫైట్స్, వినోదం వంటి అన్ని అంశాలతో ఈ సినిమా ప్రతి ఒకరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు. హీరోయిన్ పూజా హెగ్డే మాట్లాడుతూ అందరూ మెచ్చేలా ఈ సినిమా ఉంటుందన్నారు. ఈ సినిమాను ఇంటిల్లిపాది చూసి ఆనందించేలా దర్శకుడు హరీష్ శంకర్ ఎంతో చక్కగా తీర్చిదిద్దారని తెలిపారు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ నిర్మాత దిల్‌రాజుకు శ్రీవారిపై అచంచలమైన భక్తి ఉందని, తను నిర్మించిన ప్రతి సినిమా రిలీజ్ చేయడానికి ముందు శ్రీవారిని దర్శించుకుంటారని తెలిపారు. ఈ సినిమాలోని ఓ పాటను బ్రాహ్మణ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో లిరిక్స్‌ను మార్చినట్లు ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు నిర్మాత దిల్‌రాజు, డైరెక్టర్ హరీష్ శంకర్ తెలిపారు. -
కొడుకు ఫోజు చూసి.. బన్నీ విస్మయం!
బన్నీ తాజా సినిమా ‘డీజే దువ్వాడ జగన్నాథం’ కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాటలు ఆదివారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను అల్లు అరవింద్ మనవడు, బన్నీ కొడుకు అయాన్ , ‘దిల్’ రాజు మనవడు ఆరాన్ష్ కలిసి విడుదల చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ పాటల వేడుకలో ఓ ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. ఈ వేడుకలో అయాన్ జనాలను చూసి ఇచ్చిన ఓ పోజు తల్లిదండ్రులు అల్లు అర్జున్-స్నేహరెడ్డిలను ఆశ్చర్యంలో ముంచెత్తితే.. అక్కడే ఉన్న తాత అల్లు అరవింద్‌ను పొట్టచెక్కలయ్యేలా నవ్వించేసింది. ఇంతకూ బుజ్జీ అయాన్ ఏం చేశాడంటే.. ఆడియో వేడుకకు వచ్చిన అభిమానులు చూసి.. ఓ చిన్నపాటి రాజకీయ నాయకుడి రీతిలో అభివాదం చేశాడు. చూడటానికి ఎంతో క్యూట్‌గా ఉన్న ఈ ఫొటోను బన్నీ ట్విట్టర్లో షేర్ చేశాడు. కొడుకు జనాలకు అభివాదం చేస్తుంటే విస్మయంగా చూస్తూ ఉండిపోయిన బన్నీ.. అవును అయాన్ తీరు చూసి నేనూ ఆశ్చర్యపోయానంటూ పేర్కొన్నాడు. I have to admit this gesture of Ayaan Surprised me