breaking news
director venkateshwar rao
-
‘చదువుకోవాలి’కి అన్యాయం జరిగింది
హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో ‘చదువుకోవాలి’ చిత్రానికి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో సినీవారం కార్యక్రమంలో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సినిమాను రూపొందించిన ఎం. వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి దేశరాజు లలిత, కో డైరెక్టర్ సాయిశ్వేతను రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ తరఫున సత్కరించి, అభినందించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘చదువుకోవాలి’ వంటి సందేశాత్మక చిత్రం వల్ల సమాజంలో మంచి మార్పులు వస్తాయి. పాత్రికేయునిగా అపార అనుభవం ఉన్న ఎం. వెంకటేశ్వరరావు సామాజిక బాధ్యతగా సినిమా తీయడం అభినందనీయం’’ అన్నారు. ‘‘సినిమా తీసి ఐదేళ్లవుతున్నా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో చోట విద్యార్థుల కోసం ఇంకా ప్రదర్శించబడుతోంది. విద్యపై చెతన్యంతో తీసిన సినిమా కావడమే ఇందుకు కారణం. ఐదు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన మా చిత్రానికి ఏపీ నంది అవార్డుల్లో అన్యాయం చేశారు’’ అన్నారు దర్శక నిర్మాత ఎం.వెంకటేశ్వరరావు. -
కార్మికుల ఉపాధిని దెబ్బతీయొద్దు
సిరిసిల్ల, న్యూస్‌లైన్ : సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగంపై ఆధారపడిన కార్మికుల ఉపాధిని దెబ్బతీయొద్దని చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ వెంకటేశ్వర్రావు కోరారు. ఆర్డీవో కార్యాలయంలో బుధవారం వస్త్రోత్పత్తిదారులతో జౌళి శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. పాలిస్టర్ పరిశ్రమకు సరఫరా అవుతున్న యారన్ రేట్ ఒక్కసారిగా పెరగడంతో ఆ మేరకు ఉత్పత్తైన గుడ్డకు ధర రాకపోవడంతో వస్త్రోత్పత్తిదారులు గుడ్డ ఉత్పత్తిని తగ్గించారు. దీంతో సగానికిపైగా సాంచాలు ఆగిపోయాయి. కార్మికులకు పనిలేని పరిస్థితి నెలకొంది. యారన్ ధరతగ్గిస్తే వస్త్రోత్పత్తి గిట్టుబాటవుతుం దని, లేకుంటే బట్ట ఉత్పత్తి చేయలేమని యజమానులు అధికారులకు విన్నవించుకున్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని, కార్మికులు రోడ్డున పడకుండా యజమానులు పరిశ్రమను నడపాలని సూచిం చారు. కాటన్ పరిశ్రమలో పెద్దగా ఇబ్బంది లేకపోగా, పాలిస్టర్ పరిస్థితి దయనీయంగా ఉందని యజమానులు వివరించారు. ఇక్కడి పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు సూచించారు. ఆర్డీవో కె.శ్రీనివాస్, జౌళి శాఖ డెవలప్మెంట్ అధికారి అశోక్‌రావు, ఏడీవో రశీద్, ఎన్ఫోర్స్మెంట్ ఏడీఈ నారాయణ, వస్త్రోత్పత్తిదారులు సుదర్శన్, సత్యం, భాస్కర్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.