breaking news
diluted
-
రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన.. ఐదుకు చేరిన మరణాలు
సాక్షి, తూర్పుగోదావరి: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరుకుంది. ఈ ఘటనలో తాజాగా దివాన్ చెరువుకు చెందిన మంచి రాధాకృష్ణమూర్తి, లాలా చెరువు ప్రాంతానికి చెందిన యాళ్ళ శేషగిరిరావు మృతి చెందగా.. అంతకుముందు, చౌడేశ్వరి నగర్‌కు చెందిన తాడి కృష్ణవేణి, లాలా చెరువు చెందిన కనక రత్నం సహా మరొకరు చనిపోయారు. మరో నలుగురు చిన్నారులు.. రాజమండ్రి పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఇద్దరు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వారికి వెంటిలేషన్‌పై చికిత్స అందిస్తున్నారు. వీరికి ఒక్కసారిగా మూత్రం బంద్ కావడం, వాంతులు కావడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. వీరిలో మూడేళ్ల చిన్నారికి డయాలసిస్ చేస్తున్నారు. మరో ఇద్దరు ప్రైవేటు ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురితోపాటు, కొంతమంది చిన్నారులకు డయేరియా, కిడ్నీ ఫెయిలైన సమస్యలు తలెత్తినట్టు వైద్యాధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. ఈ ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పరీక్షలు నిర్వహించారు. వారికి సరఫరా అవుతున్న పాల వల్లే ఈ సమస్య తలెత్తిందని గుర్తించారు.గణేష్ అరెస్ట్..ఈ నేపథ్యంలో ఆ కుటుంబాలకు పాలు పోస్తున్న కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన గణేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఎవరు సరఫరా చేస్తున్నారు.. ఎన్ని ఇళ్లకు పాలు అందజేస్తున్నారు.. ఎవరి ఆధ్వర్యంలో సరఫరా జరుగుతోంది.. ఏయే గ్రామాల నుంచి రాజమహేంద్రవరానికి పాలు వస్తున్నాయనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.గణేష్ రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో 150కి పైగా ఇళ్లలో పాలు పోస్తున్నట్టు తెలిసింది. ప్రజలు అస్వస్థతకు గురైన కాలనీల్లో వైద్యాధికారులు ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు చేసున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందని,అక్కడ పరిస్థితులను లోతుగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ల్యాబ్‌కు నమూనాలుకల్తీ పాలతో నలుగురు మృతి చెందడం, పలువురు అస్వస్థతకు గురవడంతో అధికారులను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అప్రమత్తం చేశారు. ఆహారం, నీరు, మల నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు, ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించారు. అనుమానిత పాల వనరును ఫుడ్ సేఫ్టీ అధికారి పరిశీలించి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తోంది.5 రోజుల్లో 12 మంది బాధితులు?చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, రెవెన్యూ కాలనీ పరిసర ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి గడచిన 5 రోజుల్లో సుమారు 12 మంది ఆస్పత్రుల పాలైనట్టు తెలిసింది. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అనధికారిక సమాచారం. లాలాచెరువు, హౌసింగ్ బోర్డ్ కాలనీ, చౌడేశ్వరి నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానికులు కోరుతున్నారు. -
పెట్రోల్ కల్తీని ఎలా గుర్తించాలంటే..
రాజు మూడు నెలల కిందట షోరూమ్‌లో బైక్ కొనుగోలు చేశాడు. కానీ కంపెనీ ఇచ్చిన హామీ మేరకు బైక్ మైలేజీ రావడంలేదు. కనీసం అందులో సగమైన మైలేజీ రాకపోవడంతో నిరాశ చెందాడు. అయితే బైక్ కొన్నప్పటి నుంచి తాను ఒకే పెట్రోల్ పంపులో పెట్రోల్ కొట్టించేవాడు. అనుకోకుండా ఇటీవల వేరే పంపులోని పెట్రోల్ వాడాడు. అప్పటివరకు సరిగా మైలేజీ రాని తన బైక్ ఈసారి మెరుగైన మైలేజీ నమోదు చేసింది. దాంతో తాను గతంలో వాడిన పెట్రోల్ కల్తీ అయిందని గుర్తించాడు.మీకూ ఇలాంటి సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. అందుకు కొన్ని ఏజెన్సీలు పెట్రోల్‌ను కల్తీ చేయడమే కారణం. భారత్ భారీగా పెట్రోల్‌ను దిగుమతి చేసుకుంటోంది. అందుకు పెద్దమొత్తంలో డాలర్లు ఖర్చు చేస్తోంది. దీని ప్రభావం ఆయిల్ మార్కెటింగ్ సంస్థలపై పడుతుంది. వీటికి అనుబంధంగా ఉన్న కొన్ని ఏజెన్సీలు అక్రమంగా డబ్బు పోగు చేసుకోవాలనే దురుద్దేశంతో పెట్రోల్‌ను కల్తీ చేస్తున్నాయి. అయితే మనం వాహనాల్లో వాడే పెట్రోల్ కల్తీ అయిందా..లేదా..అనే విషయాన్ని ఎలా కనుగొనాలో తెలుసుకుందాం.ఇదీ చదవండి: ఇళ్ల అమ్మకాల తగ్గుదలకు కారణాలు..రెండు నిమిషాల్లో కల్తీ గుర్తించండిలా..నిబంధనల ప్రకారం ప్రతి పెట్రోల్ పంపు సిబ్బంది విధిగా తమ వద్ద ఫిల్టర్ పేపర్ ఉంచుకోవాలి. మనం వాహనాల్లో పెట్రోల్ కొట్టించాలనుకున్నప్పుడు పెట్రోల్ పంపు సిబ్బంది నుంచి ఫిల్టర్ పేపర్ అడిగి తీసుకోవాలి. దానిపై పెట్రోల్ గన్ ద్వారా 2-3 డ్రాప్స్ పెట్రోల్ వేయాలి. 2-3 నిమిషాలు ఆ ఫిల్టర్ పేపర్‌ను ఆరనివ్వాలి. తర్వాత పెట్రోల్ పోసినచోట పేపర్‌పై ఎలాంటి మచ్చలు ఏర్పడకపోతే అది స్వచ్ఛమైన పెట్రోల్‌గా పరిగణించవచ్చు. అలాకాకుండా ఏదైనా మచ్చలు ఏర్పడితే కల్తీ జరిగినట్లు భావించాలి. -
'సమైక్య ఉద్యమం కొంతమంది చేతుల్లో నీరుగారింది'
సమైక్యాంధ్ర ఉద్యమం కొంతమంది చేతుల్లో నీరుగారుతుందని మాలమహానాడు రాష్ట్ర నాయకుడు కారెం శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన విశాఖపట్నంలో మాట్లాడుతూ... అధికార కాంగ్రెస్ పార్టీకి కొంత మంది సమైక్యాంధ్ర ఉద్యమ నేతలు అమ్ముడు పోయారని ఆరోపించారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రజాసంఘాలే భుజస్కంధాలపైకి తీసుకోవాల్సిన బాధ్యతను ఈ సందర్భంగా కారెం శివాజీ గుర్తు చేశారు. సీమాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవశ్యకత ప్రజా సంఘాలకు ఉందని ఈ సందర్భంగా కారెం శివాజీ పేర్కొన్నారు.


