సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు డబ్బింగ్ సినిమా
గత నెలలో దీపావళికి తెలుగులో పలు సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో 'కె ర్యాంప్' ఉన్నంతలో ఆకట్టుకుంది. ఇదే పండగకు తమిళంలో 'డ్యూడ్'తో పాటు బైసన్, డీజిల్ అనే మూవీస్ వచ్చాయి. వీటిలో మొదటి రెండు హిట్ కాగా 'డీజిల్' మాత్రం బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. ఇప్పుడీ చిత్రమే ఎలాంటి ప్రకటన ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే ఇక్కడే ఓ ట్విస్ట్.(ఇదీ చదవండి: రజనీ, చిరంజీవి యాక్టింగ్ గురువు కన్నుమూత)తెలుగులో నాని 'జెర్సీ'లో చిన్న పాత్రలో నటించిన హరీశ్ కల్యాణ్.. ప్రస్తుతం తమిళంలో హీరోగా సినిమాలు చేస్తున్నాడు. 'డీజిల్' ఇతడి లేటెస్ట్ మూవీ. క్రూడ్ ఆయిల్ స్మగ్లింగ్ అనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర జస్ట్ యావరేజ్ అనిపించుకుంది. థియేటర్లలో కేవలం తమిళంలో మాత్రమే రిలీజ్ కాగా.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం యూకేలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వారమే మనదేశంలో కూడా రిలీజయ్యే అవకాశముంది. సడన్ స్ట్రీమింగ్ ఉండొచ్చు. మరోవైపు బయట దేశాల్లో సింప్లీ సౌత్ ఓటీటీలో ఈ శుక్రవారం (నవంబరు 21) రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు.'డీజిల్' విషయానికొస్తే.. వాసు (హరీశ్ కల్యాణ్) తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతారు. దీంతో మనోహర్ అనే క్రూడ్ ఆయిల్ స్మగ్లర్, వాసుని పెంచి పెద్ద చేస్తాడు. కొడుకులా చూసుకుని కెమికల్ ఇంజినీరింగ్ చదివిస్తాడు. వాసు పెద్దయిన తర్వాత మనోహర్‌కి సాయపడుతుంటాడు. క్రూడ్ ఆయిల్‌ని వైట్ పెట్రోల్‌గా మార్చి, వాటిని చేపల కోసం ఉపయోగించే ఐస్ గడ్డల్లా తయారు చేసి స్మగ్లింగ్ చేస్తుంటాడు. అయితే బాలమురుగన్ అనే వ్యక్తి, డీసీపీతో చేతులు కలిపి మనోహర్ క్రూడ్ ఆయిల్ సామ్రాజ్యాన్ని దోచుకుందామని అనుకుంటారు. దీనికి అడ్డంగా ఉన్న మనోహర్ని చంపేయాలని వీళ్లు ప్లాన్ వేస్తారు. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి? దీన్ని వాసు ఎలా అడ్డుకున్నాడనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఒళ్లు జలదరించేలా 'ధురంధర్' ట్రైలర్)