breaking news
devulapalli
-
విద్యుత్ ఉద్యోగుల చర్చలు సఫలం.. పీఆర్సీ ఎంత శాతమంటే?
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుతో విద్యుత్ ఉద్యోగుల చర్చలు సఫలమయ్యాయి. ఈ క్రమంలో ఏడు శాతం పీఆర్సీకి విద్యుత్ ఉద్యోగులు అంగీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, సీఎండీ ప్రభాకర్ రావుకు విద్యుత్ ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం, ఏడు శాతం పీఆర్సీ ఒప్పందంపై విద్యుత్ ఉద్యోగులు సంతకం చేశారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 17 నుంచి తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎస్పీఈ జాక్) తలపెట్టిన సమ్మె విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి. దీంతో, రేపటి నుంచి తలపెట్టిన సమ్మె విరమించుకున్నారు. -
దేవులపల్లికి జన్మనిచ్చిన గ్రామాన్ని ‘ఆదర్శ’ంగా చేద్దాం
డిప్యూటీ సీఎం చినరాజప్ప ఘనంగా 120వ జయంతి వేడుకలు సామర్లకోట : ప్రముఖ అభ్యుదయ కవి దేవులపల్లి కృష్ణశాస్తి్ర పుట్టిన చంద్రంపాలెం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుదామని, దానికి తనవంతు సహకారం అందిస్తామని డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండలంలోని చంద్రంపాలెం గ్రామంలో దేవులపల్లి 120వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విగ్రహంపై ఏర్పాటు చేసిన మండపాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కృష్ణశాస్త్రి జన్మించిన గ్రామంలో ఆయన పేరు గుర్తుండేలా భవనాన్ని నిర్మిస్తామన్నారు. జిల్లాలో ప్రతీ గ్రంథాలయంలోను ఆయన చిత్రపటం ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే కలెక్టరు హె చ్.అరుణ్‌కుమార్, జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టరు పి.చిరంజీవిని కుమారి, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు కార్యక్రమలో ప్రసంగించారు. ఈ సందర్భంగా చారిటబుల్ ట్రస్టును డిప్యూటీ సీఎం రాజప్ప ప్రారంభించారు. అనంతరం జయంతి వేడుకలను పురస్కరించుకొని నిర్వహించిన వాస్యరచన, వకృ్తత్వ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. జాయింట్ కలెక్టరు ఎస్.సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ చైర్మ¯ŒS నల్లమిల్లి వీర్రరెడ్డి, కార్యదర్శి సత్యనారాయణ, ప్రముఖ రచయితలు డాక్టరు వాడ్రేవు వీరలకీ‡్ష్మదేవి, శ్రీవాత్స రామకృష్ణ, ఐడియల్ డిగ్రీ కళాశాల తెలుగు పండిట్ రామచంద్ర రెడ్డి, గ్రామ సర్పంచ్ తలాటం వెంకటరమణ, పెద్దాపురం మున్సిపల్ చైర్మ¯ŒS రాజా సూరిబాబురాజు, తహసీల్దార్ ఎల్.శివకుమార్, ఎంపీడీఓ బి.నాగేశ్వరరావు, ఎంపీపీ గొడత మార్త, జెడ్పీటీసీ సభ్యురాలు గుమెళ్ల విజయలక్ష్మి పాల్గొన్నారు.