breaking news
Democracy country
-
రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల ప్రజల మైత్రికి చిహ్నం ప్రధాని అమెరికా అధికార పర్యటన
ప్రపంచంలో ప్రజాతంత్ర పంథాలో పయనిస్తున్న రెండు అతిపెద్ద దేశాలు ఇండియా, అమెరికా మైత్రి నేడు రోజురోజుకు బలపడుతోంది. ఈ నెల 21-23 మధ్య జరిగే భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా అధికార పర్యటనకు విశేష ప్రాధాన్యం ఉంది. అనేక చారిత్రక కారణాలు, పరిస్థితుల వల్ల 1947 నుచి 1990ల ఆరంభం వరకూ భారత-అమెరికా ప్రజల మధ్య సుహృద్భావ సంబంధాలు ఉన్నంతగా ఈ రెండు దేశాల ప్రభుత్వాలు ఒకదానితో ఒకటి అంత దగ్గరగా లేవనే అభిప్రాయం నెలకొని ఉండేది. అప్పటి రెండు అగ్రరాజ్యాల మధ్య కొనసాగిన ప్రచ్ఛన్నయుద్ధం ప్రభావం రెండు ప్రజాస్వామ్య దేశాల పాలకులపై ఉండేదని రాజకీయ నిపుణులు చెబుతారు. అయితే, ప్రపంచీకరణ, సమాచార సాంకేతిక (ఐటీ) విప్లవం ఆధునిక ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చే ప్రక్రియ మొదలైన 20వ శతాబ్దం చివరిలో ఇండియా, అమెరికా ప్రభుత్వాల మధ్య కూడా సంబంధాలు బలోపేతమయ్యాయి. అన్ని రంగాల్లో రెండు పెద్ద దేశాల మధ్య స్నేహ, సహకార సంబంధాలు పటిష్ఠమవ్వడం మొదలైంది. అలా ఈ స్నేహబంధంలో వచ్చిన గొప్ప మార్పు ఈ పాతికేళ్లలో దృఢపడుతోంది. పెద్ద సంఖ్యలో ‘అవకాశాల స్వర్గం’ అమెరికా వెళ్లి స్థిరపడిన భారత సంతతి ప్రజలు ఈ మిత్ర సంబంధాలు మరింత పరిణతి చెందడానికి తమ వంతు కృషిచేస్తున్నారు. ప్రపంచంలో నేటి అత్యంత క్లిష్ట సమయంలో ఇండియాకున్న భౌగోళిక రాజకీయ ప్రాధాన్యమే అమెరికాకు కొత్త, అతి సన్నిహిత మిత్ర దేశంగా భారత్ అవతరించడానికి అతిపెద్ద కారణమని ప్రపంచ ప్రఖ్యాత ఇంగ్లిష్ పత్రిక ‘ది ఇకనామిస్ట్’ వ్యక్తం చేసిన అభిప్రాయం నూరు శాతం నిజమని అంతర్జాతీయ నిపుణులు అంగీకరిస్తున్నారు. గతంలో అమెరికా, పూర్వపు సోవియెట్ యూనియన్ మధ్య తీవ్ర పోటీ ఉన్న సమయంలో భారత పాలకులు సోవియెట్ పక్షాన ఉన్న మాట కూడా నిజమేనని చరిత్రకారులు చెబుతారు. అయితే, ‘ఇండియాకు సోవియెట్ యూనియన్ ఆదర్శ రాజ్యమని అప్పట్లో ప్రకటించిన కొందరు పెద్దలు మాత్రం తమ పిల్లలను పై చదువులకు అమెరికా పంపేవారు. అనారోగ్యం వస్తే అమెరికా ఆస్పత్రుల్లో చికిత్స చేయించు కోవడానికే ఇష్టపడేవారు,’ అని ప్రసిద్ధ భారత జర్నలిస్టు తవ్లీన్ సింగ్ వ్యగ్యంతో మేళవించి చెప్పిన మాటలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. అమెరికా కాంగ్రెస్ లో రెండోసారి ప్రధాని ప్రసంగించడం ఇండియాకు విశేష గౌరవం భారత ప్రధాని మోదీ వచ్చే వారం తన అధికార పర్యటనలో భాగంగా అమెరికా చట్టసభల (కాంగ్రెస్) సంయుక్త సమావేశంలో రెండోసారి ప్రసంగించబోతున్నారు. ఇలాంటి అరుదైన గౌరవం ఇప్పటి వరకూ బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్, దక్షిణాఫ్రికా నాయకుడు నెల్సన్ మండేలా వంటి కొద్ది మంది మహానేతలకే దక్కింది. అనేక రంగాలతోపాటు ఆర్థికరంగంలో పరుగులు పెడుతున్న ఇండియా కిందటేడాది బ్రిటన్ ను దాటి ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థికశక్తిగా అవతరించింది. అచిరకాలంలో జర్మనీ, జపాన్ దేశాలను భారత్ అధిగమించి విశ్వశక్తిగా దర్శనమిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని అనేక అంతర్జాతీయ సంస్థలు అంచనావేస్తున్నాయి. అందివస్తున్న అవకాశాలతో అట్లాంటిక్ మహాసముద్రం దాటి అమెరికా వెళ్లి స్థిరపడిన భారతీయుల సంఖ్య 45 లక్షలు దాటిపోయింది. ఈ ప్రవాస భారతీయులు అమెరికాతో భారత్ మైత్రీబంధం మరింత బిగయడానికి చేస్తున్న కృషికి నిదర్శనంగా భారత ప్రధాని అధికార పర్యటన నిలిచిపోతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని కాపిటల్ హిల్ (చట్టసభలు–కాంగ్రెస్)లో భారత ప్రధాని వచ్చే వారం చేసే ప్రసంగం ప్రపంచంలో అతిపెద్ద, అతిగొప్ప ప్రజాస్వామ్య దేశాల మధ్య బలపడుతున్న స్నేహసంబంధాలను గొప్ప మలుపు తిప్పుతుందనడంలో సందేహం లేదు. విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు -
ఓర్వలేకే దేశంపై నిందలు
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని బ్రిటన్‌లో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ తూర్పారబట్టారు. ఇండియాటుడే సదస్సులో మాట్లాడిన ఆయన రాహుల్ పేరు ప్రస్తావించకుండా దుయ్యబట్టారు. ‘‘భారత ప్రజాస్వామ్యం సాధిస్తునప్రగతిని, ఘన విజయాలను కొందరు ఓర్చుకోలేకపోతున్నారు. అందుకే దేశంపై నిందలేస్తున్నారు. మాటల దాడులు చేస్తున్నారు’’ అంటూ విమర్శలు గుప్పించారు. ‘‘దేశంలో ఆత్మవిశ్వాసం నిండుగా తొణికిసలాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా నాయకులు, మేధావులు, ఆర్థికవేత్తలు అందరూ భారత్‌పై ఎంతో విశ్వాసం కనబరుస్తున్నారు. ఇలాంటి వేళ ప్రతికూల వ్యాఖ్యలతో దేశాన్ని తక్కువ చేసే, ప్రజల స్థైర్యాన్ని దెబ్బ తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శుభ సందర్భాల్లో దిష్టిచుక్క పెట్టడం మన సంప్రదాయం. ఇలాంటి వ్యక్తులు తమ చేష్టల ద్వారా బహుశా అలా దిష్టిచుక్క పెట్టే బాధ్యత తీసుకున్నట్టున్నారు’’ అంటూ చురకలంటించారు. ఇలాంటి కురచ ప్రయత్నాలను పట్టించుకోకుండా దేశం ప్రగతి పథంలో దూసుకుపోతూనే ఉంటుందన్నారు. ‘‘గత పాలకుల హయాంలో అవినీతి, కుంభకోణాలే నిత్యం పతాక శీర్షికల్లో ఉండేవి. ఇప్పుడేమో అలాంటి అవినీతిపరులంతా వారిపై ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా ఒక్కటవుతున్న వార్తలు హెడ్‌లైన్స్‌గా మారుతున్న విచిత్ర పరిస్థితిని మనమంతా చూస్తున్నాం’’ అంటూ ఎద్దేవా చేశారు. -
ఎన్నికల ఫలితాలను అంచనా వేసే.. పోల్ అనలిస్ట్
భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలంటే ప్రజలకు, పార్టీలకు నిజంగా ఒక పండగే. ఎన్నికల వేళ ఊరూవాడ హోరెత్తిపోతుంటాయి. గెలుపోటములపై ఊహాగానాలకు అంతే ఉండదు. ఏ పార్టీ అధికారంలోకి రానుందనే ఉత్కంఠ అందరిలో ఉంటుంది. ఇదే సమయంలో ప్రజల దృష్టిని తమ వైపునకు తిప్పుకొనే నిపుణులు కొందరు ఉంటారు. టీవీ చానళ్లు, పత్రికల్లో తమ విశ్లేషణలతో జనంలో రోజురోజుకీ ఆసక్తిని పెంచుతుంటారు. వారే.. ఎన్నికల విశ్లేషకులు(పోల్ అనలిస్ట్‌లు). ఎలక్షన్ల సమయంలో వీరి హవా కొనసాగుతుంటుంది. తమ జాతకాలను తెలుసుకొనేందుకు పార్టీలు, నాయకులు పోల్ అనలిస్ట్‌లను ఆశ్రయిస్తుంటారు. అందుకే దీన్ని కెరీర్‌గా మార్చుకుంటే అవకాశాలకు, ఆదాయానికి లోటు ఉండదు. న్యూస్ చానళ్లు, పత్రికల్లో కొలువులు పోల్ అనలిస్ట్‌లకు ఎన్నికల సీజన్లో చేతినిండా పని దొరుకుతుంది. ఇది పార్ట్‌టైమ్ వృత్తి లాంటిది. ఎన్నికలు లేనప్పుడు ఇతర రంగాల్లో ఉపాధి పొందొచ్చు. డేటా విశ్లేషణపై పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి మార్కెట్ రీసెర్చ్, కన్జ్యూమర్ అండ్ బ్రాండింగ్ రీసెర్చ్, ఎవాల్యుయేషన్ రీసెర్చ్ విభాగాల్లో ఉద్యోగావకాశాలు పొందొచ్చు. ఎన్నికల విశ్లేషకులకు వార్తా చానళ్లు, పత్రికల్లో కొలువులు లభిస్తాయి. రాజకీయ పార్టీలు కూడా వీరిని నియమించుకుంటాయి. న్యూస్ చానళ్ల సంఖ్య పెరుగుతుండడంతో వీరికి అవకాశాలు విస్తరిస్తున్నాయి. అనలిస్ట్‌లు ఓపీనియన్/ఎగ్జిట్ పోల్స్ డేటాతోపాటు ఓటర్ల అభిప్రాయాలను స్వయంగా సేకరించి, తుది ఫలితాలను అంచనా వేయాల్సి ఉంటుంది. కులం, మతం, పట్టణ, గ్రామీణ ప్రాంతాల వారీగా ఓటింగ్ ట్రెండ్‌ను పరిశీలించాలి. ఎన్నికల్లో ఏయే అంశాలను ఓటర్లను ప్రభావితం చేయనున్నాయి, ఏ స్థానంలో ఏ పార్టీ విజయం సాధించనుందో ఊహించగలగాలి. ఎన్నికలకు సంబంధించి ప్రజల్లో ఎన్నో సందేహాలు ఉంటాయి. వాటన్నింటికీ సమాధానాలు చెప్పే సామర్థ్యం అనలిస్ట్‌లకు ఉండాలి. దేశంలో ప్రతిఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికల జరుగుతూనే ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అనలిస్ట్‌ల అవసరం ఉంటుంది. కావాల్సిన నైపుణ్యాలు: పోల్ అనలిస్ట్‌లకు ఓటర్ల నాడిని పట్టుకోగల నైపుణ్యం ఉండాలి. ప్రజాభిప్రాయాన్ని సరిగ్గా గుర్తించగల నేర్పు అవసరం. ఎండా వానలను లెక్కచేయక క్షేత్రస్థాయిలో మారుమూల ప్రాంతాల్లో పనిచేయడానికి శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగక నీతి, నిజాయతీలతో పనిచేస్తే మంచి గుర్తింపు లభిస్తుంది. అర్హతలు: ఎన్నికల విశ్లేషకులుగా మారాలనుకుంటే.. గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణులైతే సరిపోతుంది. స్టాటిస్టిక్స్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, సోషియాలజీ కోర్సులను అభ్యసిస్తే మెరుగ్గా రాణించడానికి వీలుంటుంది. ఇంటర్ తర్వాత గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్ స్థాయిల్లో ఈ కోర్సులు చదవొ చ్చు. పోల్ అనలిస్ట్‌లు డేటా అనాలిసిస్‌పై తప్పనిసరిగా పట్టు సాధించాలి. వేతనాలు: పోల్ అనలిటిక్స్‌కు ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వేతనం అందుతుంది. కొంత అనుభవం సంపాదిస్తే రూ.50 వేలు పొందొచ్చు. సీనియర్ లెవెల్‌కు చేరుకుంటే రూ.70 వేలు సంపాదించు కోవచ్చు. ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తే అధిక ఆదాయం లభిస్తాయి. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఎన్నికల విశ్లేషణపై మనదేశంలో ప్రత్యేకంగా కోర్సులను రూపొందించలేదు. అయితే, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, సోషియాలజీ, స్టాటిస్టిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ కోర్సులను అభ్యసించినవారు పోల్ అనలిస్ట్‌లుగా పనిచేయొచ్చు. భారత్‌లో దాదాపు అన్ని ప్రముఖ యూనివర్సిటీలు ఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. విదేశాల్లో పోల్ అనాలిసిస్‌పై కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులను అందిస్తున్న కొన్ని విదేశీ యూనివర్సిటీలు.. యూనివర్సిటీ ఆఫ్ ఎస్సెక్స్-యూకే వెబ్సైట్: www.essex.ac.uk యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్-యూఎస్ వెబ్సైట్: www.umich.edu యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా-లింకన్, యూఎస్ వెబ్సైట్: www.unl.edu -
మూడో ‘దళ’ పోరుకు రెడీ
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు దేశచరిత్రలోనే నిర్ణయాత్మకమైనవి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్న ఈ ఎన్నికల యుద్ధంలో సుపరిపాలన, అభివృద్ధి మంత్రంతో గుజరాత్ ఎజెండాను ఎత్తుకున్న నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ కాంగ్రెస్‌తో తీవ్రస్థాయిలో పోటీ పడుతోంది. ధరల పెరుగుదల, అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిరుద్యోగం తదితరాలను ఎదుర్కోవడంలో యూపీఏ ప్రభుత్వ వైఫల్యం ఎన్డీఏకు కలిసొస్తోంది. ఏప్రిల్ 7, ఏప్రిల్ 9 తేదీల్లో జరిగిన మొదటి, రెండో దశ ఎన్నికలు ‘వార్మ్ అప్’ రౌండ్ లాంటివి. కానీ, నేడు(ఏప్రిల్ 10న) జరిగే మూడో దశ ఎన్నికలు మొత్తం ప్రక్రియలో కీలకం కానున్నాయి. గురువారం దేశవ్యాప్తంగా 92 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. - ప్రవీణ్ రాయ్ సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) 10 రాష్ట్రాల్లో నేడే ఎన్నికలు ఎన్నికలు జరగనున్న ప్రాంతాలు 10 రాష్ట్రాలు: ఉత్తరప్రదేశ్, హర్యానా, బీహార్, జమ్మూ, కాశ్మీర్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఢిల్లీ, జార్ఖండ్. 3 యూటీలు చండీగఢ్, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ 92 నియోజకవర్గాలు 2009లో ఎవరికి ఎన్ని? యూపీఏ 51 (కాంగ్రెస్ 46) ఎన్డీఏ 17 (బీజేపీ 13) వామపక్షాలు 4 బీఎస్పీ 6 ఇతరులు 14 ఢిల్లీ, హర్యానా, కేరళల్లో ఒకే దశలో ఎన్నికలు పూర్తవుతాయి ఢిల్లీ ఢిల్లీలో ఆప్ ప్రభావం ఎక్కువగా ఉంది. 2009లో ఇక్కడి మొత్తం 7 స్థానాలను కాంగ్రెసే గెలుచుకుంది. కానీ ఈ సారి పరిస్థితి మారింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల పరాజయం నుంచి కాంగ్రెస్ ఇంకా తేరుకోలేదు. అయితే, 49 రోజుల్లోనే అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కుప్పకూలడం, ఆప్ సుస్థిర ప్రభుత్వాన్ని అందివ్వలేకపోవడంతో కాంగ్రెస్‌కు కొంత కలిసొచ్చే అవకాశముంది. పార్టీ కోల్పోయిన ఓటుబ్యాంకును కొంతయినా వెనక్కు తెచ్చుకునే అవకాశం దాంతో ఏర్పడింది. ఢిల్లీ స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు పార్టీలు.. కాంగ్రెస్, బీజేపీ, ఆప్‌లు బలమైన అభ్యర్థులను బరిలో దింపాయి. చాందినీ చౌక్, ఈశాన్య ఢిల్లీ స్థానాల్లో 20% పైగా ముస్లింలున్నారు. ముస్లింలంతా కాంగ్రెస్‌కే మద్దతివ్వాలంటూ ఢిల్లీలోని జామా మసీదు ఇమాం బుఖారీ ఇచ్చిన పిలుపుతో ఆ రెండు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపునకు అవకాశాలు మెరుగయ్యాయి. ముస్లింల ఓట్లన్నీ గంపగుత్తగా కాంగ్రెస్‌కు పడటం వల్ల బీజేపీ విజయావకాశాలు దెబ్బ తింటాయి. మొత్తంమీద 3 నుంచి 4 స్థానాల్లో బీజేపీ, 2-3 స్థానాల్లో కాంగ్రెస్, 1 స్థానంలో ఆప్ గెలిచే పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఒకవేళ ముస్లిం ఓట్లు కాంగ్రెస్, ఆప్‌ల మధ్య చీలితే మాత్రం బీజేపీ కనీసం 5 స్థానాల్లో గెలుస్తుంది. హర్యానా 2009 ఎన్నికల్లో హర్యానాలో కాంగ్రెస్ 10 స్థానాలకు గానూ 9 స్థానాల్లో విజయం సాధించింది. హర్యానా జనహిత్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కుల్దీప్ బిష్ణోయి హిస్సార్ నుంచి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. సోనియాగాంధీ కుటుంబానికి లబ్ధి చేకూరేలా భూ కుంభకోణాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు కాంగ్రెస్‌పై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. దాంతోపాటు బీజేపీ, హెచ్జేసీల కూటమి గట్టి పోటీని ఇస్తోంది. అయితే ఈ రెండు పార్టీల మధ్య అంతర్గత విభేదాలు బీజేపీ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశముంది. ఆప్ కూడా బరిలో దిగడంతో పలు స్థానాల్లో త్రిముఖ పోటీ తప్పడంలేదు. కురుక్షేత్ర(నవీన్ జిందాల్), రోహ్తక్(దీపేందర్ సింగ్ హుడా), భీవానీ(శ్రుతి చౌధరీ) స్థానాలను కాంగ్రెస్ నిలుపుకునే అవకాశముంది. ముస్లిం ఓట్లు కలిసొస్తే మరో రెండు స్థానాల్లోనూ గెలిచే అవకాశముంది. గుర్గావ్ స్థానంలో బహుముఖ పోటీ ఉంది. ఇక్కడ యోగేంద్రయాదవ్(ఆప్), రావు ఇంద్రజిత్‌సింగ్(బీజేపీ), రావు ధర్మపాల్(కాంగ్రెస్), జాకిర్‌హుస్సేన్(ఐఎన్ఎల్డీ)లు హోరాహోరీగా తలపడుతున్నారు. అయితే, ఇక్కడ 20%పైగా ఉన్న ముస్లిం ఓటర్లు జాకిర్ హుస్సేన్ వైపు మొగ్గు చూపితే ఐఎన్ఎల్డీ గెలుపు సులభసాధ్యమవుతుంది. ఒడిశా ఒడిశాలో గురువారం 10 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ 5, బీజేడీ 4, బీజేపీ 1 స్థానంలో గెలుపొందాయి. బీజేడీతో తెగతెంపులు బీజేపీపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. అత్యధిక స్థానాల్లో బీజేడీనే విజేతగా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. బీహార్ బీహార్‌లోని 6 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 2009లో జేడీయూ 3, కాంగ్రెస్, బీజేపీలు ఒక్కో స్థానం గెలుచుకున్నాయి. ఈ ఆరు నియోజకవర్గాల్లో మూడు ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు. గత ఎన్నికల్లో ఈ మూడింటినీ జేడీయూ, కాంగ్రెస్, బీజేపీలు పంచుకున్నాయి. జేడీయూ, బీజేపీలు గత పదిహేడేళ్ల అనుబంధాన్ని తెంచుకుని ఈ సారి వేరువేరుగా పోటీ చేస్తున్నాయి. బీజేపీకి దూరం కావడం కొంతవరకు జేడీయూ విజయావకాశాలను దెబ్బతీయనుంది. రామ్‌విలాస్ పాశ్వాన్ పార్టీ ఎల్జేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా బీజేపీ బలపడింది. అయితే, ఈ ఆరు నియోజకవర్గాల్లోని నాలుగింటిలో ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్నారు. ఈ స్థానాల్లో దాదాపు 10% నుంచి 20% వరకు ముస్లిం ఓటర్లు బీజేపీ విజయావకాశాలను ప్రభావితం చేయగలరు. బీజేపీ, ఆర్జేడీ కూటమి ముస్లిం ఓట్లను మొత్తంగా సాధించగలిగితే వారికి విజయావకాశాలు మెరుగవుతాయి. 15వ లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ సాసారాం నుంచి పోటీ చేస్తున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో పోరు ఆసక్తికరంగా సాగనుంది. ఆప్, బీజేపీల నుంచి బాలీవుడ్ నటీమణులు గుల్‌పనగ్, కిరణ్ ఖేర్‌లు బరిలో ఉండగా.. కాంగ్రెస్‌కు పట్టున్న ఈ ప్రాంతాన్ని నిలబెట్టుకునేందుకు పవన్ కుమార్ బన్సల్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే, ఇటీవలి రైల్వే స్కామ్ ఈ మాజీ కేంద్రమంత్రిని ఇబ్బంది పెడుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పశ్చిమ ప్రాంతంలోని 10 లోక్‌సభస్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో వీటిలో బీఎస్పీ 5, బీజేపీ 2, అజిత్‌సింగ్ నేతృత్వంలోని ఆరెల్డీ 2, ఎస్పీ 1 స్థానంలో విజయం సాధించాయి. గత ఏడాది జరిగిన ముజఫర్‌నగర్ మత కలహాలు, వాటిని సర్కారు సమర్థంగా అదుపుచేయలేకపోవడం.. సమాజ్‌వాదీ పార్టీపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. 10 స్థానాల్లో 9 స్థానాలు ముస్లిం ఓట్లు భారీగా ఉన్నవే కావడం గమనార్హం. గాజియాబాద్ మినహా మిగిలిన 9 నియోజకవర్గాల్లో 20% పైగా ముస్లిం ఓటర్లున్నారు. దాంతో ఈ 10 స్థానాల్లోనూ ఎస్పీ ఏ ఒక్క స్థానంలోనూ గెలిచే అవకాశాల్లేవు. ముస్లింలు బీఎస్పీ, కాంగ్రెస్‌ల్లో దేని వైపు మొగ్గితే ఆ ఆ పార్టీ ఈ స్థానాల్లో విజయం సాధిస్తుంది. అయితే, బీజేపీ వ్యూహాత్మకంగా ఈ ప్రాంతంలోని జాట్ సహా హిందూ ఓట్లన్నీ తమ పార్టీకే పడేలా పావులు కదుపుతోంది. అదే జరిగితే బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుపొందుతుంది. టికెట్ ఖాయం అయ్యాక, ఎన్నికలకు వారం ముందు గౌతమ్బుద్ధనగర్కు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ చంద్ తోమర్ బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పుడక్కడ కాంగ్రెస్‌కు అభ్యర్ధే లేని పరిస్థితి నెలకొంది. దాంతో ఆ స్థానంలో బీజేపీ, బీఎస్పీల మధ్యే ప్రధానంగా పోటీ ఏర్పడింది. గాజియాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్, బీఎస్పీల మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది. ఎవరు గెలిచినా అతి తక్కువ మెజారిటీతోనే గెలుస్తారు. బిజ్నోర్, మీరట్‌లలో సినీ తారలు జయప్రద, నగ్మాలు పోటీలో ఉండటంతో అక్కడి పోరుకు గ్లామర్ తోడైంది. కేరళ 20 స్థానాలున్న కేరళలో 2009లో యూడీఎఫ్ 16 (కాంగ్రెస్ 13, కేరళ కాంగ్రెస్(మణి) 1, ఐయూఎంఎల్ 2), ఎల్డీఎఫ్ 4 స్థానాల్లో గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీలు యూడీఎఫ్ ఓట్లకు గండికొట్టే పరిస్థితి కనిపిస్తోంది. అయినా, గత స్థానాలను కాంగ్రెస్ నిలుపుకునే అవకాశాలున్నాయి. ముస్లింలు ఎక్కువగా ఉన్న మలబార్, క్రైస్తవ జనాభా అధికంగా గల కొచ్చిన్ ప్రాంతాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది. దక్షిణ కేరళలో మాత్రం ఎల్డీఎఫ్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. మహారాష్ట్ర మహారాష్ట్రలో విదర్భ ప్రాంతంలోని 10 నియోజకవర్గాల్లో ఏప్రిల్ 10న ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో 6 తూర్పు విదర్భ ప్రాంతంలో, 4 పశ్చిమ విదర్భ ప్రాంతంలో ఉన్నాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ 4, బీజేపీ 2, శివసేన 2, ఎన్సీపీ 1 స్థానంలో గెలుపొందాయి. మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా చోటుచేసుకున్న ప్రాంతం విదర్భ. ఇక్కడ రైతు వ్యతిరేకతతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ఎదుర్కొంటోంది. దాంతోపాటు మోడీ గాలి బలంగా వీస్తుండటంతో ఈ ప్రాంతంలో ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమి కనీసం 7 స్థానాల్లో గెలిచే అవకాశముంది. మధ్యప్రదేశ్, జార్ఖండ్ మధ్యప్రదేశ్, జార్ఖండ్లలోనూ బీజేపీ వైపే మొగ్గు కనిపిస్తోంది. మూడో దశలో మధ్యప్రదేశ్‌లో మొత్తం 9 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో మహాకోశల్ ప్రాంతంలో 5, వింధ్య ప్రాంతంలో 4 నియోజకవర్గాలు ఉన్నాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు చెరో 4 స్థానాల్లో పాగా వేయగా, ఒకస్థానాన్ని బీఎస్పీ గెలుచుకుంది. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఇమేజ్, మోడీ ప్రభావంతో ఈ సారి 7కు పైగా స్థానాలను బీజేపీ గెలిచే పరిస్థితి ఉంది. జార్ఖండ్‌లో నేడు ఎన్నికలు జరగనున్న 5 స్థానాల్లో కనీసం రెండు సీట్లను బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. మూడో దశలో ప్రముఖులు మీరా కుమార్ (కాంగ్రెస్) సాసారాం, బీహార్ గుల్ పనగ్ (ఆప్) చండీగఢ్ కిరణ్ ఖేర్ (బీజేపీ) చండీగఢ్ కరుణ శుక్లా (కాంగ్రెస్) వాజ్‌పేయి అన్న కూతురు బిలాస్పూర్ ఛత్తీస్‌గఢ్ నవీన్ జిందాల్ (కాంగ్రెస్) కురుక్షేత్ర, హర్యానా జయప్రద (ఆరెల్డీ) బిజ్నోర్, యూపీ రాజ్‌బబ్బర్ (కాంగ్రెస్) గాజియాబాద్, యూపీ సందీప్ దీక్షిత్ (కాంగ్రెస్) తూర్పు ఢిల్లీ