Danube
-
ఒక్క ఉద్యోగమూ పోదు.. దుబాయ్ కంపెనీ అధినేత హామీ
పశ్చిమాసియాలో నెలకొన్న తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో తమ ఉద్యోగుల భవిష్యత్తుపై నెలకొన్న ఆందోళనలకు దుబాయ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, డానుబే గ్రూప్ వ్యవస్థాపకుడు రిజ్వాన్ సాజన్ తెరదించారు. తన సంస్థలో పనిచేస్తున్న 6,000 మందికి పైగా ఉద్యోగులకు ఆయన కొండంత అండగా నిలిచారు. ఈ క్లిష్ట సమయంలో ఎవరి ఉద్యోగానికి డోకా లేదని, అందరికీ సకాలంలో వేతనాలు అందుతాయని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు.కుటుంబంలా అండగా ఉంటాంఇటీవల ఇన్ స్టాగ్రామ్ వేదికగా రిజ్వాన్ సాజన్ స్పందిస్తూ భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు. "మా 6,000 మందికి పైగా ఉద్యోగులు మమ్మల్ని విశ్వసించి, డానుబే గ్రూప్‌ను ఇటుక ఇటుక పేర్చి నిర్మించారు. నేడు వారికి అండగా నిలవడం నా కనీస బాధ్యత. మా గ్రూప్‌లో ఎటువంటి తొలగింపులు ఉండవు, అందరికీ జీతాలు సకాలంలో అందుతాయి" అని ఆయన ప్రకటించారు.ఈ నిర్ణయం పట్ల నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "ఇది 6,000 మంది ఉద్యోగుల విషయం మాత్రమే కాదు, 6,000 కుటుంబాల జీవనాధారం. మీరు నిజమైన నాయకుడు" అంటూ నెటిజన్లు ఆయనను కొనియాడుతున్నారు.హార్డ్‌వేర్ షాప్ నుంచి బిలియనీర్ స్థాయికి..రిజ్వాన్ సాజన్ ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. 1993లో కేవలం కొన్ని వేల దిర్హామ్‌లతో దుబాయ్‌లో అడుగుపెట్టిన ఆయన, మొదట ఒక హార్డ్‌వేర్ దుకాణంలో పనిచేశారు. 1993లోనే 'డానుబే' పేరుతో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. 2014లో 'డానుబే ప్రాపర్టీస్'ను స్థాపించి రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనం సృష్టించారు. ఆయన సంస్థ నేడు సుమారు 5.13 బిలియన్ దిర్హామ్‌ల వార్షిక ఆదాయాన్ని గడిస్తోంది. దుబాయ్‌తో పాటు భారత్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, చైనా దేశాలకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు.ఇటీవల దుబాయ్‌లో 55 అంతస్తుల వాణిజ్య టవర్‌ను నిర్మించి, దానికి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) పేరు పెట్టడం విశేషం. ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ ప్రకటించిన "2025 టాప్ 10 అత్యంత ప్రభావవంతమైన రియల్ ఎస్టేట్ లీడర్స్" జాబితాలో రిజ్వాన్ సాజన్ చోటు సంపాదించుకున్నారు. సంక్షోభ సమయాల్లో కంపెనీలు వ్యయ నియంత్రణ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో, రిజ్వాన్ సాజన్ తీసుకున్న ఈ నిర్ణయం కార్పొరేట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. View this post on Instagram A post shared by Rizwan Sajan (@rizwan.sajan) -
నాడు వీధి వ్యాపారి.. నేడు రూ.18 వేల కోట్లకు అధిపతి!
కష్టపడ్డాడు.. వీధుల్లో పుస్తకాలు అమ్మాడు.. ఇంటింటికీ తిరిగి పాలు పోశాడు.. నేడు రూ.18 వేల కోట్లకు అధిపతి.. యూఏఈలో అత్యంత ధనవంతులైన భారతీయల్లో ఆయన ఒకరు. డానుబే గ్రూప్ అధినేత, ముంబైకి చెందిన రిజ్వాన్ సజన్ స్ఫూర్తివంతమైన విజయగాథ ఇది. (గూగుల్ చీకటి ‘గేమ్’! రూ.260 కోట్ల భారీ జరిమానా..) తన తండ్రి మరణించినప్పుడు రిజ్వాన్ సజన్ వయసు కేవలం 16 సంవత్సరాలు. ముగ్గురు సంతానంలో రిజ్వాన్ పెద్దవాడు కావడంతో కుటుంబ పోషణ బాధ్యత అతనిపై పడింది. దీంతో రిజ్వాన్ వీధుల్లో పుస్తకాలు, స్టేషనరీ అమ్మాడు. అదనపు ఆదాయం కోసం మిల్క్ డెలివరీ బాయ్‌గా కూడా పనిచేశాడు. 1981లో 18 ఏళ్లు నిండిన రిజ్వాన్‌కు ఆయన మామ కువైట్‌లో ఉద్యోగం ఇప్పించి ఆయన ఎదుగుదలలో తోడ్పాటు అందించారు. కువైట్‌లో రిజ్వాన్ ప్రారంభంలో సేల్స్ ట్రెయినీగా 150 దినార్లు అంటే అప్పట్లో రూ.18 వేల జీతానికి పనిచేశారు. అలా ఎనిమిదేళ్లు పనిచేశాక సేల్స్ మేనేజర్ అయ్యారు. కానీ 1990లో గల్ఫ్ యుద్ధం తర్వాత సజన్ ముంబైకి తిరిగి వచ్చి మళ్లీ ఉద్యోగం కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ సారి దుబాయ్‌లో బిల్డింగ్ మెటీరియల్స్ బ్రోకరేజ్ వ్యాపారంలో చేరాడు. ఒక రోజు రిజ్వాన్ ఆ ఉద్యోగం మానేసి తన సొంత నిర్మాణ సామగ్రి వ్యాపార సంస్థను స్థాపించారు. అలా పుట్టుకొచ్చింది డానుబే గ్రూప్. (ఫోన్‌పే దూకుడు.. కొత్త వ్యాపారాలకు నిధుల సమీకరణ) బాల్యంలో తాను అనేక సవాళ్లు ఎదుర్కొన్నానని, తన తండ్రి ఓ స్టీల్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పనిచేసేవారని, నెలకు రూ. 7వేల జీతంతో ఇల్లు గవడం చాలా కష్టంగా ఉండేదని, స్కూల్ ఫీజులు కట్టడానికి కూడా ఇబ్బందులు పడినట్లు రిజ్వాన్ గల్ఫ్ న్యూస్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కానీ రిజ్వాన్ సజన్ పట్టు వదలలేదు. 1993లో డానుబే గ్రూప్‌ను ప్రారంభించేంత వరకూ అనేక కష్టాలు పడ్డారు. 2019 నాటికి డానుబే గ్రూప్ వార్షిక టర్నోవర్ 1.3 బిలియన్ డాలర్లుగా ఉండేది. డానుబే గ్రూప్ బిల్డింగ్ మెటీరియల్స్, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహా అనేక వ్యాపారాలను నిర్వహిస్తోంది. (ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్.. స్టోరేజ్ సమస్యకు పరిష్కారం) -
ఎవరూ రాకపోతే.. డబ్బంతా ఆ పిల్లాడికే!
వియన్నా: ఆస్ట్రియాలోని డాన్యూబ్ నదిలో అకస్మాత్తుగా డబ్బుల కట్టలు తేలుతూ కనిపించాయి. అంత డబ్బు కనిపిస్తే ఎవరికైనా కళ్లు చెదురుతాయి కదా... ఒడ్డున నిలబడి చూస్తున్న పిల్లాడికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ డబ్బును సొంతం చేసుకోవాలనుకున్నాడు.. కానీ ఈత రాదు. అందుకే పోలీసులకు సమాచారాన్ని చేరవేశాడు. పోలీసులు వచ్చేలోపు ప్రాణం ఆగలేదు.. వాళ్లు వచ్చేలోపు ఎంతోకొంత దక్కించుకోవాలని ప్రయత్నించాడు. మెల్లిగా నదిలోకి వెళ్లి కొంత డబ్బు తీసుకున్నాడు. అయితే నది ఒడ్డున తచ్చాడుతున్న పిల్లాడిని చూసిన కొందరు పెద్దలు.. అతడు ఆత్మహత్య చేసుకుంటున్నాడోమేనని కంగారుపడ్డారు. అంతా అక్కడ గుమిగూడారు. ఇంతలో పోలీసులకు రానే వచ్చి.. పెద్దఎత్తున 500, 100 యూరో కరెన్సీ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బుకట్టలు నదిలో ఎలా కొట్టుకొచ్చాయో అక్కడివారికి అంతుపట్టలేదు. డబ్బును చూసిన పిల్లడు మాత్రం తనకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. మరోవైపు ఇవి నకిలీ నోట్లు కావచ్చని పోలీసులు అనుమానించినా... నకిలీవి కావని తేల్చారు. ఇంత డబ్బు ఎవరు నదిలో పడేశారు.. ఎక్కడినుంచి వచ్చిందనేది ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. తాము స్వాధీనం చేసుకున్న సొమ్ము విలువ లక్ష యూరోలు (73 లక్షల రూపాయలు) అని అన్నారు. సాధారణంగా ఆస్ట్రియాలో ఎవరికైనా డబ్బు దొరికితే అందులో ఆ డబ్బు ఆచూకీ చెప్పినవారికి 15 - 10 శాతాం వాటా ఇస్తారు. అంతేనా, ఆ డబ్బు అసలు యజమాని వివరాలు ఏడాదిలోపు తెలియక పోతే...ఆ పూర్తి మొత్తాన్ని డబ్బు ఆచూకీ తెలిపిన వారికి అప్పగిస్తారట.


