పుష్కర డాక్యుమెంటరీకీ బాబు లక్షల ఒప్పందం
రాజమండ్రి: గోదావరి పుష్కరాల విషయంలో ప్రజల ప్రాణాలు లెక్కచేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనవసర గొప్పలకు పోయిందని తెలుస్తోంది. పుష్కరాల డాక్యుమెంటరీపై పలు లెక్కలు వెలుగు చూశాయి. గోదావరి పుష్కరాల విషయంలో ఓ అంతర్జాతీయ స్థాయి ఛానల్‌తో ఏపీ సర్కార్ ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది.
మొత్తం 12 రోజులు పుష్కరాల తీరుపై డాక్యుమెంటరీ కోసం నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్‌కు ఏపీ సర్కార్ ప్రాజెక్టు ఇచ్చినట్లు సమాచారం. డాక్యుమెంటరీ కోసం రూ.64 లక్షలు ఏపీ సర్కార్ కేటాయించింది. ఇందులో ప్రొడక్షన్‌కు రూ.30 లక్షలు, డిజిటలైజేషన్‌కు రూ.19 లక్షలు, ప్రమోషన్ కోసం రూ.8.3 లక్షలు కేటాయించింది.